అన్వేషించండి

Tirumala News: పెళ్లై 15 రోజులే - శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా కుప్పకూలిన వరుడు, చివరకు విషాదం

Andhra News: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తూ ఓ నవ వరుడు గుండెపోటుతో కుప్పకూలాడు. కుటుంబసభ్యులు, భద్రతా సిబ్బంది ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Newly Married Groom Died Due To Heart Attack In Tirumala: వారికి పెళ్లై 15 రోజులే అయ్యింది. కొత్త ఆశలతో నూతన జీవితంలో అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు (Tirumala) చేరుకున్నారు. కాలినడకన వెంకటేశుని దర్శనం కోసం దంపతులిద్దరూ కుటుంబ సభ్యులతో కలిసి మెట్ల మార్గంలో వెళ్తుండగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నవ వరుడు ఒక్కసారిగా కుప్పకూలాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నవీన్ అనే వ్యక్తి బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. అతనికి 15 రోజుల క్రితం వివాహం జరిగింది. అనంతరం నవీన్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చారు. శుక్రవారం కాలినడకన అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు బయలుదేరారు.

కుప్పకూలిన వరుడు

ఈ క్రమంలోనే 2,350 మెట్టు వద్దకు రాగానే నవీన్ అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలాడు. గమనించిన కుటుంబ సభ్యులు భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు నవీన్‌ను అంబులెన్సులో తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే, నవీన్ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్థారించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. దీనిపై తిరుమల టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నవీన్‌ది తమిళనాడులోని తిరుత్తణి ప్రాంతం. ఉద్యోగ రీత్యా ఆయన బెంగుళూరులో స్థిరపడ్డారు.

Also Read: Tirumala News: తిరుమల టికెట్లు ఇలా బుక్ చేసుకుంటున్నారా? అదొక స్కామ్! టీటీడీ హెచ్చరిక

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Robots Into SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రంగంలోకి దిగిన రోబోలు.. 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
Robots Into SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రంగంలోకి దిగిన రోబోలు.. 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
Somu Veerraju: జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
Court: State vs A Nobody: నాని నిర్మించిన 'కోర్టు'పై పుష్పరాజ్ ఎఫెక్ట్... సంధ్య థియేటర్ ఘటనతో మార్పులు
నాని నిర్మించిన 'కోర్టు'పై పుష్పరాజ్ ఎఫెక్ట్... సంధ్య థియేటర్ ఘటనతో మార్పులు
Nara Lokesh: రాష్ట్రంలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలు: మంత్రి నారా లోకేష్
రాష్ట్రంలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలు: మంత్రి నారా లోకేష్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DMK Uncivilised Heated Argument in Parliament | నోరు జారిన ధర్మేంద్ర ప్రధాన్..ఒళ్లు దగ్గర పెట్టుకోమన్న స్టాలిన్ | ABP DesamChampions Trophy 2025 Winners Team India | కాలు కదపకుండా ఆడి ట్రోఫీ కొట్టేశామా | ABP DesamRohit Sharma Virat Kohli Kolatam | వైట్ కోటులతో రచ్చ చేసిన టీమిండియా హీరోలు | ABP DesamRohit Sharma Fitness Champions Trophy 2025 | ఫిట్ నెస్ లేకుండానే రెండు ఐసీసీ ట్రోఫీలు కొట్టేస్తాడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Robots Into SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రంగంలోకి దిగిన రోబోలు.. 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
Robots Into SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రంగంలోకి దిగిన రోబోలు.. 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
Somu Veerraju: జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
Court: State vs A Nobody: నాని నిర్మించిన 'కోర్టు'పై పుష్పరాజ్ ఎఫెక్ట్... సంధ్య థియేటర్ ఘటనతో మార్పులు
నాని నిర్మించిన 'కోర్టు'పై పుష్పరాజ్ ఎఫెక్ట్... సంధ్య థియేటర్ ఘటనతో మార్పులు
Nara Lokesh: రాష్ట్రంలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలు: మంత్రి నారా లోకేష్
రాష్ట్రంలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలు: మంత్రి నారా లోకేష్
IPL 2025 Jio Offers: మీ దగ్గర రూ.100 ఉంటే చాలు, జియో హాట్‌స్టార్‌ సబ్‌స్ర్కిప్షన్‌ ఉచితం - IPL మెరుపులన్నీ చూడొచ్చు!
మీ దగ్గర రూ.100 ఉంటే చాలు, జియో హాట్‌స్టార్‌ సబ్‌స్ర్కిప్షన్‌ ఉచితం - IPL మెరుపులన్నీ చూడొచ్చు!
SSMB 29 Update: మహేష్ - రాజమౌళి షూట్‌లో మళ్లీ జాయిన్ అయిన ప్రియాంకా చోప్రా... ఒడిశా ఎయిర్‌ పోర్ట్‌లో క్యాబిన్ క్రూతో వైరల్ పిక్
మహేష్ - రాజమౌళి షూట్‌లో మళ్లీ జాయిన్ అయిన ప్రియాంకా చోప్రా... ఒడిశా ఎయిర్‌ పోర్ట్‌లో క్యాబిన్ క్రూతో వైరల్ పిక్
Kannada Actress Ranya Rao: కోర్టులో బోరున విలపించిన రన్యా రావు... బంగారం స్మగ్లింగ్ కేసులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
కోర్టులో బోరున విలపించిన రన్యా రావు... బంగారం స్మగ్లింగ్ కేసులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
Telangana News: పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
Embed widget