అన్వేషించండి

Tirumala News: తిరుమల టికెట్లు ఇలా బుక్ చేసుకుంటున్నారా? అదొక స్కామ్! టీటీడీ హెచ్చరిక

Tirumala News: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు టీటీడీ సూచించిన వెబ్ సైట్ లో బుకింగ్ చేసుకోవాలి. దళారులను నమ్మి మోసపోవద్దని టీటీడీ సూచనలు చేస్తోంది.

Tirumala News: తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎంతో మంది భక్తులు ఆనో లైన్ విధానం ద్వారా ప్రయత్నం చేస్తుంటారు. కొందరు సొంతంగా ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకుంటే మరికొందరు ఇంటర్ నెట్ సెంటర్ కి వెళ్లి బుక్ చేసుకుంటారు. ఇలా ఇంటర్ నెట్ సెంటర్ల ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకునే వారి పట్ల కొందరు మోసాలకు తెరతీసి అధిక డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. ఇలాంటి నకిలీ టికెట్లపై టీటీడీ విజిలెన్స్ విస్తృత తనిఖీలు నిర్వహిస్తుంది.

పాస్ పోర్టు నెంబర్ మార్చి

తిరుమలలో టీటీడీ ఆన్ లైన్ టికెట్లు కల్యాణోత్సవంలో పొందేందుకు పాస్ పోర్ట్ ద్వారా కూడా అవకాశం ఉంది. అయితే పాస్ పోర్ట్ లోని చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తూ... మిగిలిన నెంబర్లు కనిపించకుండా ఉంటాయి. దానిని అదనుగా చేసుకుని  ఓ నిందితుడు కళ్యాణోత్సవం టికెట్లను బుక్ చేసి భక్తులకు ఇచ్చిన ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.

తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు కు చెందిన ఎస్ మురళీధర్, ఎస్ మురిగేషన్ రెండు శ్రీవారి కళ్యాణోత్సవం టికెట్ల కోసం తిరుపత్తూరుకు చెందిన ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు, దళారి అన్నాదురైని సంప్రదించారు. వారికి కళ్యాణోత్సవం టికెట్ల కోసం నకిలీ పాస్ పోర్ట్ నెంబర్ చివరి 4 అంకెల మాత్రం ఒరిజినల్ పాస్ పోర్ట్ నంబర్లు ఉండేలా చూసుకొని టిటిడి ఆన్ లైన్ లో టికెట్లు పొందాడు. ఆ టికెట్ తో తిరుమలకు వచ్చిన భక్తులను టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ చేసారు. తమకు అన్నాదురై అధిక డబ్బు తీసుకుని టిక్కెట్లు ఇచ్చినట్లు భక్తులు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విజిలెన్స్ అధికారులు పోలీసులు అప్పగించగా.. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

టీటీడీ ఏమంటుంది?

టిటిడి అధికారులు నకిలీ టికెట్లను అడ్డుకట్ట వేసేందుకు వివిధ రకాల చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇటీవల ఒకే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తో అధికంగా టికెట్లు బుక్ చేసిన వారిని గుర్తించింది. దాంతో పాటు ఒకే ఆధార్ ఫోన్ నెంబర్ తో అధికంగా గదులు బుకింగ్ చేసిన వారిని చిట్టాను కూడా బయటికి తీసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ నకిలీ పాస్ పోర్ట్ నెంబర్ ద్వారా కళ్యాణోత్సవ టికెట్లు బుక్ చేసిన దళారిని గుర్తించారు.

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం భక్తులు టిటిడి అధికారిక వెబ్సైట్  https://ttdevasthanams.ap.gov.in
ద్వారా మాత్రమే ఆన్లైన్ లో తమ ఆధార్ కార్డ్ నంబర్, చిరునామాతో టికెట్లు బుక్ చేసుకోవాలని, దళారులను ఆశ్రయించి తమ దర్శన టికెట్లు నష్ట పోవద్దని టీటీడీ మరోసారి విజ్ఞప్తి చేస్తోంది. 

కొంతమంది దళారులు తాము దర్శనం టికెట్లు బుక్ చేయిస్తామని భక్తుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రస్తుత టిటిడి  యాజమాన్యం దళారుల ఏరివేత పట్ల అకుంఠిత  దీక్షతో ఉంది. దర్శనాల కోసం భక్తులు దళారులను ఆశ్రయించి ఇబ్బందులకు గురికా వద్దని టీటీడీ  తెలుపుతోంది. భక్తులు పొందిన టికెట్లను, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది దర్శనానికి వెళ్లే ముందు మరొకసారి పరీక్షించడం జరుగుతుంది. ఆ సమయంలో వారు పొందిన టికెట్లు నకిలీగా తేలితే భక్తులు అనవసరమైన ఇబ్బందులు గురికావాల్సి వస్తుంది. స్వామివారి దర్శనం టికెట్లు, సేవా టికెట్లతో వ్యాపారం చేసే దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరిస్తోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP DesamAus vs Ind sydeny Test Day 1 Highlights | సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్ | ABP DesamGame Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamCyber Truck Explosion | కారుతో దాడి, కారులో పేలిన బాంబుకు సంబంధం ఉందా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Google Search Don'ts: గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
ACB Notice To kTR:  కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Railway Recruitment Board: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
CM Chandrababu: 'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
Embed widget