News
News
X

Bio Diesel Plant: నెల్లూరులో అక్రమ బయోడీజిల్ కేంద్రం గుట్టురట్టు, అంత కథ నడిచిందా !

వెంకటాచలం మండల పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న బయోడీజిల్‌ విక్రయ కేంద్రం గుట్టు రట్టు చేశారు పోలీసులు. చెన్నై నుంచి ట్యాంకర్లలో డీజిల్ ని అక్రమంగా తెచ్చి భారీ ట్యాంకుల్లో నిల్వ చేస్తున్నారు.

FOLLOW US: 

బయో డీజిల్ విక్రయ కేంద్రాలు నెల్లూరులో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అయితే వీటికి అనుమతి లేదనే విషయం మాత్రం తనిఖీలు చేపట్టే వరకు తెలియడంలేదు. ఇటీవల పొదలకూరులో బయోడీజిల్ విక్రయ కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. అక్రమంగా నిల్వ చేసిన డీజిల్ ని సీజ్ చేశారు. తాజాగా వెంకటాచలం మండల పరిధిలో జాతీయ రహదారి పక్కనే అక్రమంగా నిర్వహిస్తున్న బయోడీజిల్‌ విక్రయ కేంద్రం గుట్టు రట్టు చేశారు పోలీసులు. చెన్నై నుంచి ట్యాంకర్లలో డీజిల్ ని ఇక్కడికి అక్రమంగా తరలించి.. భారీ ట్యాంకుల్లో నిల్వ చేస్తున్నారు. అలా నిల్వచేసిన దాన్ని హోల్ సేల్ గా అమ్మేస్తున్నారు. రెండేళ్లుగా ఈ కేంద్రం ఇక్కడ ఉంటే, ఇంతవరకు అధికారులు దాడి చేయకపోవడం విశేషం. కొంతమంది పెద్దల సహకారం కూడా నిర్వాహకులకు ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వెంకటాచలం మండలం గొలగమూడి రోడ్డు వద్ద పాత జాతీయ రహదారి మధ్యలో అక్రమంగా బయో డీజిల్‌ విక్రయ కేంద్రం ఏర్పాటు చేశారు కొంతమంది. దీని చుట్టూ పచ్చటి పట్టలతో 20 అడుగుల ఎత్తులో కంచె ఏర్పాటు చేశారు. అక్కడ నిర్మాణం ఏదైనా జరుగుతుందేమో అని అందరూ అనుకునేవారు. కానీ వెనుకవైపు నుంచి దీనికి దొడ్డిదారి ఉంది. అది కొంతమందికి మాత్రమే తలుసు. అటువైపు వెళ్తే బయోడీజిల్ విక్రయిస్తుంటారు.

ఒక్కో ట్యాంక్ లో 28వేల లీటర్లు.. 
28 వేల లీటర్ల సామర్థ్యంతో లోపల డీజిల్ నిల్వ చేసుకునే భారీ ట్యాంకులు నిర్మించారు. చెన్నై నుంచి ఇక్కడకు తీసుకొచ్చి బయో డీజిల్ ని విక్రయిస్తున్నారు. బయట నుంచి ఈ ఏర్పాట్లు చూస్తే.. అక్కడేదో మొక్కల పెంపక కేంద్రం ఉన్నట్టు కనిపిస్తుంది, లేదా కొత్త నిర్మాణం జరుగుతున్నట్టుగా ఉంటుంది. కానీ లోపలికి వెళ్తే అసలు విషయం బయటపడుతుంది.

నెల్లూరు నగరంలోని చెత్త తీసుకెళ్లే వాహనాలకు ఇక్కడ బయో డీజిల్ నింపుతున్నారు. ఇలాంటి వాహనాలు నిత్యం పదుల సంఖ్యలో ఇటువైపు వస్తుంటాయి. ఇవి గొలగమూడి రోడ్డు మీదుగా వెళ్లి.. దొంతాలి సమీపంలోని డంపింగ్‌ యార్డులో చెత్తను పడేసి తిరిగి ఇదే మార్గంలో రావాల్సి ఉంది. ఇలా వచ్చే వాహనాల్లో 90 శాతానికిపైగా ఇక్కడి బయోడీజిల్‌ ని నింపుతున్నారు. 28వేల లీటర్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ట్యాంకుల ద్వారా ఈ వాహనాలకు డీజిల్ పోస్తున్నారు.

News Reels

జాతీయ రహదారిపై జిల్లా పోలీసులు నిత్యం గస్తీ నిర్వహిస్తుంటారు. అలాంటి వారు ఈ బయో డీజిల్ కేంద్రాన్ని ఇన్నాళ్లూ కనిపెట్టకపోవడం విశేషం. అయితే ఇక్కడ ఉన్న అక్రమ డీజిల్ కేంద్రం గురించి కొంతమంది పౌర సరఫరాల శాఖకు సమాచారం ఇవ్వడంతో ఈ గుట్టు రట్టయింది.

నెల్లూరు డివిజన్‌ ఏఎస్వో రవికుమార్‌ ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. రూ.1.40 లక్షలు విలువజేసే 1500 లీటర్ల బయోడీజిల్‌ ని వారు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ విక్రయ కేంద్రాన్ని సీజ్‌ చేశారు. బయో డీజిల్ ని అక్రమంగా నిల్వ చేయకూడదని, దానికి తగిన పర్మిషన్లు తీసుకోవాలని చెబుతున్నారు అధికారులు. అయితే ఇటీవల ఇలా అక్రమ నిల్వ కేంద్రాలు పెరిగిపోయాయని, వాటి సమాచారాన్ని ప్రజలు తమకు తెలియజేయాలని తెలిపారు.

Published at : 21 Oct 2022 11:04 AM (IST) Tags: nellore police Nellore Crime Nellore Nellore News bio diesel plant

సంబంధిత కథనాలు

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు

Jeevitha Rajashekar : జీవితా రాజశేఖర్ ను బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాడు, ఆఫర్ల పేరుతో టోకరా!

Jeevitha Rajashekar : జీవితా రాజశేఖర్ ను బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాడు, ఆఫర్ల పేరుతో టోకరా!

Peddapalli Crime News: అప్పు ఇచ్చిన పాపానికి దివ్యాంగుడిపై దాడి, ఏం జరిగిందంటే?

Peddapalli Crime News: అప్పు ఇచ్చిన పాపానికి దివ్యాంగుడిపై దాడి, ఏం జరిగిందంటే?

Crime News: ఈజీ మనీ కోసం రిటైరయ్యాక ఫేక్ దందా షురూ, కథ అడ్డం తిరిగి బుక్కయ్యాడు !

Crime News: ఈజీ మనీ కోసం రిటైరయ్యాక ఫేక్ దందా షురూ, కథ అడ్డం తిరిగి బుక్కయ్యాడు !

టాప్ స్టోరీస్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

WhatsApp Data Breach: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్ - 50 కోట్ల మంది డేటా లీక్!

WhatsApp Data Breach: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్ - 50 కోట్ల మంది డేటా లీక్!

Jio True 5G: 100 శాతం 5జీ కవరేజీ - మొదటి రాష్ట్రం గుజరాతే!

Jio True 5G: 100 శాతం 5జీ కవరేజీ - మొదటి రాష్ట్రం గుజరాతే!

Poland Vs Saudi Arabia: ప్రపంచకప్‌లో సౌదీకి తొలి ఓటమి - రౌండ్ ఆఫ్ 16 రేసులో పోలండ్!

Poland Vs Saudi Arabia: ప్రపంచకప్‌లో సౌదీకి తొలి ఓటమి - రౌండ్ ఆఫ్ 16 రేసులో పోలండ్!