Nalgonda Crime: భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య! ఆ వెంటనే పోలీస్ స్టేషన్‌కు, కారణం ఏంటంటే
Wife Kills Husband: భార్య తన భర్తను గొడ్డలితో నరికి చంపింది. ఆ వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది.
![Nalgonda Crime: భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య! ఆ వెంటనే పోలీస్ స్టేషన్‌కు, కారణం ఏంటంటే Nalgonda wife murders husband with axe due to extramarital affair Nalgonda Crime: భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య! ఆ వెంటనే పోలీస్ స్టేషన్‌కు, కారణం ఏంటంటే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/08/de8dc919539eb8a4237605ddf5217ed0_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలో గల గుండ్లపల్లి (డిండి) మండలం పడమటి తండాలో దారుణం చోటు చేసుకుంది. జర్పుల చీన్య (45) అనే వ్యక్తిని అదే తండాకు చెందిన రాత్లావత్ పండు (35) అనే మహిళ గొడ్డలితో దారుణంగా నరికి చంపి పోలీసులకు లొంగిపోయింది. హతుడి కుమారుడు శివ తెలిపిన వివరాల ప్రకారం.. తన తండ్రి చీన్యకు గత 25 సంవత్సరాల క్రితమే కరెంటు షాక్‌తో రెండు చేతులను మోచేతి వరకు తొలగించాల్సి వచ్చింది. 10 సంవత్సరాలుగా తన తండ్రికి పండుతో అక్రమ సంబంధం కొనసాగుతుందని, ఇది తెలుసుకున్న గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టి ఇద్దరినీ వారించారని అన్నారు. ఆదివారం రాత్రి పథకం ప్రకారం తన తండ్రిని పండు ఇంటికి పిలిపించి హత్యచేసిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
నిందితురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తనకు ఇద్దరు కుమారులు ఉన్నారని, పెద్ద కుమారుడికి పెళ్ళి చేశానని, ఇంట్లో పెద్ద కొడుకు, కోడలు, పెళ్ళీడుకొచ్చిన కొడుకు ఉన్నారని చెప్పింది. దాంతో ఇంకోసారి తన ఇంటికి రావొద్దని చీన్యకు చెప్పినా వినకుండా తన ఇంటికి వచ్చినందుకు చంపానని తెలియజేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
నల్గొండ జిల్లాలో కొద్ది వారాల క్రితం మొండెం లేని తల కలకలం రేపిన సంగతి తెలిసిందే. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం విరాట్‌నగర్ కాలనీ నాగార్జున సాగర్-హైదరాబాద్ జాతీయ రహదారి వెంట ఉన్న మెట్టు మహంకాళీ మాత విగ్రహం పాదాల వద్ద మొండెం లేని తల వెలుగు చూసిన ఈ సంఘటన మూఢ నమ్మకాలకు బలం చేకూర్చింది.
Also Read: Medaram Jatara: సమ్మక్క సారలమ్మ జాతరలో తొలిఘట్టం - పగిడిద్దరాజు రాకతో జాతర ప్రారంభం, 16న మేడారానికి
జగిత్యాలలో కార్మికుడి హత్య
మరో ఘటనలో జగిత్యాలలో ఇటుక బట్టీ కార్మికుల మధ్య ఘర్షణ జరగడంతో ఒకరు చనిపోయారు. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలం నేరెళ్లలో బావమరిది తరుణ్‌పై బావ రుతన్ ఓ కర్రతో దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన తరుణ్ దవాఖానాలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. తన అక్కపై బావ రుతన్ దాడి చేస్తుండగా తరుణ్ అడ్డుకోబోయాడని, ఈ క్రమంలో గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. బాధితులు ఒడిశాకు చెందినవారని వెల్లడించారు. కేసు నమోదుచేసి విచారణ జరుపుతున్నట్లుగా చెప్పారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)