News
News
X

Nalgonda Crime: గుడి ముందు మనిషి తలకాయ, ఈ మిస్టరీ కీలక వివరాలు వెలుగులోకి.. మృతుడు ఎవరంటే..

ఓ వ్యక్తి తల నరికి దాన్ని గుడి ముందు ఉంచినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి మతిస్తిమితం లేని వ్యక్తిగా తేల్చారు.

FOLLOW US: 

నల్గొండ జిల్లాలో సోమవారం (డిసెంబరు 11) ఉదయం మైసమ్మ గుడి ముందు మనిషి తల కనిపించడం స్థానికంగా భయాందోళన కలిగించిన సంగతి తెలిసిందే. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం  విరాట్‌నగర్‌ కాలనీ సమీపంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ విరాట్‌నగర్‌ కాలనీ నాగార్జునసాగర్‌ - హైదరాబాద్‌ జాతీయ రహదారి వెంట ఉంది. అయితే, పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రాబట్టారు. మొత్తానికి ఓ వ్యక్తి తల నరికి దాన్ని అక్కడ ఉంచినట్లుగా గుర్తించారు. ఆ వ్యక్తి మతిస్తిమితం లేని వ్యక్తిగా తేల్చారు. అయితే, ఈ ఆకృత్యం గుప్త నిధుల కోసం నరబలి ఇవ్వడమా? లేక మరేదైనా ఉద్దేశంతో చేశారా? అనేది తేలాల్సి ఉంది. తల భాగాన్ని దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి, వెంట్రుకలు, చర్మాన్ని డీఎన్‌ఏ పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు పంపారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రహదారి పక్కనే మెట్టు మహంకాళీ అమ్మవారి విగ్రహం ఉంది. సోమవారం ఉదయం అమ్మవారి పాదాల వద్ద మొండెం లేని తల ఉండడాన్ని ఆలయ పూజారి బ్రహ్మచారి తొలుత గుర్తించారు. ఆయన భయపడిపోయి స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ ఆనంద్‌ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ ప్రారంభించారు. మృతుడిని గుర్తించేందుకు తల ఫొటోను సోషల్ మీడియాలో పెట్టారు. పలువురి సమాచారం ఆధారంగా మృతుడు జహేందర్‌ నాయక్‌ అనే 30 ఏళ్ల వ్యక్తి అని తేల్చారు. అతడిది సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్య పహాడ్‌ గ్రామమని ప్రాథమికంగా నిర్ధరించారు. 

అయితే, ఈ తరహాలో హత్య నరబలి కోసమే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో గుట్టల్లో గుప్త నిధుల కోసం నరబలి ఇచ్చిన ఘటనలు వెలుగు చూశాయి. అందుకే పోలీసులు ఆ కోణంలో అనుమానిస్తున్నారు. గతంలో ఆ తరహా నేరాలకు పాల్పడ్డ వ్యక్తులను ఆరా తీస్తున్నారు. తల ఉన్నచోట రక్తపు ఆనవాళ్లు లేకపోవడం, తలకు గడ్డి, మట్టి అతుక్కుని ఉండడంతో అతణ్ని ఎక్కడో చంపి తల ఇక్కడ పడేసి ఉంటారని భావిస్తున్నారు. 

మృతుడికి మతిస్తిమితం లేదు
మృతుడి గురించి ఆరా తీయగా.. జహేందర్‌ నాయక్‌కు మతిస్థిమితం లేదని.. ఐదారేళ్లుగా ఇంటికి దూరంగా ఉంటున్నాడని తెలిసింది. కొన్నాళ్లుగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని తుర్కయాంజాల్‌ సమీపంలో ఓ ఆలయం వద్ద ఉంటూ చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరిస్తుండేవాడు. పూర్తి వివరాలు తెలుసుకొనేందుకు 8 బృందాలను నియమించినట్లుగా డీఎస్పీ ఆనంద్‌ రెడ్డి వెల్లడించారు. సీసీ ఫుటేజీలు, ఇతర ఆధారాలను సేకరిస్తున్నట్లు తెలిపారు.

Also Read: అరె ఏంట్రా ఇది.. లోన్ రిజెక్ట్ చేశారని ఏకంగా బ్యాంకునే తగలెట్టేశాడు, అంతా బూడిదే

Also Read: ఈ నాలుగు రాశుల వారు ఈ రోజు ఏం చేసినా సక్సెస్ అవుతారు, మీరున్నారా అందులో ఇక్కడ తెలుసుకోండి..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 11 Jan 2022 11:00 AM (IST) Tags: Nalgonda Police Man head bofore temple virat nagar temple Nalgonda Insane death Nalgonda Man head

సంబంధిత కథనాలు

Cyber Crime : సైబర్ కేటుగాళ్లు డబ్బు కొట్టేశారా? అయితే ఇలా చేస్తే మీ సొమ్ము తిరిగొస్తుంది!

Cyber Crime : సైబర్ కేటుగాళ్లు డబ్బు కొట్టేశారా? అయితే ఇలా చేస్తే మీ సొమ్ము తిరిగొస్తుంది!

Hyderabad News: భాగ్యనగరంలో ఉగ్రకుట్న భగ్నం, 10 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు!

Hyderabad News: భాగ్యనగరంలో ఉగ్రకుట్న భగ్నం, 10 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు!

Rangareddy News : రంగారెడ్డి జిల్లాలో విషాదం, ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి

Rangareddy News : రంగారెడ్డి జిల్లాలో విషాదం, ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి

Rajahmundry News : అప్పు చేస్తే ప్రాణం రాసిచ్చినట్లే, లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు ఆత్మహత్య

Rajahmundry News : అప్పు చేస్తే ప్రాణం రాసిచ్చినట్లే, లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు ఆత్మహత్య

Delhi: కత్తులతో పొడుస్తుంటే కుర్చీ వేసుకుని చూసిన వ్యక్తి - వీడియో వైరల్!

Delhi: కత్తులతో పొడుస్తుంటే కుర్చీ వేసుకుని చూసిన వ్యక్తి - వీడియో వైరల్!

టాప్ స్టోరీస్

CM Jagan : సీఎం జగన్ ఉదారత, చిన్నారి వైద్యానికి కోటి రూపాయలు మంజూరు

CM Jagan : సీఎం జగన్  ఉదారత, చిన్నారి వైద్యానికి కోటి రూపాయలు మంజూరు

Minister KTR : బీజేపీ పేరు ఇలా మార్చేసుకోండి, ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ సెటైర్

Minister KTR : బీజేపీ పేరు ఇలా మార్చేసుకోండి, ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ సెటైర్

IND Vs SA 2nd T20 Toss: ఈసారి టాస్ దక్షిణాఫ్రికాది - బౌలింగ్‌కు మొగ్గు చూపిన ప్రొటీస్!

IND Vs SA 2nd T20 Toss: ఈసారి టాస్ దక్షిణాఫ్రికాది - బౌలింగ్‌కు మొగ్గు చూపిన ప్రొటీస్!

The Ghost: 'ది ఘోస్ట్' హిందీ రిలీజ్ - నాగార్జున రిస్క్ చేస్తున్నారా?

The Ghost: 'ది ఘోస్ట్' హిందీ రిలీజ్ - నాగార్జున రిస్క్ చేస్తున్నారా?