Man Sets Bank On Fire: అరె ఏంట్రా ఇది.. లోన్ రిజెక్ట్ చేశారని ఏకంగా బ్యాంకునే తగలెట్టేశాడు, అంతా బూడిదే
Man Sets Bank On Fire For Denying Loan: బ్యాంకులో అగ్ని ప్రమాదం కేసును పోలీసులు ఛేదించారు. లోన్ ఇవ్వడానికి నిరాకరించిన కారణంగా బ్యాంకుకు నిందితుడు నిప్పుపెట్టాడని విచారణలో తేలింది.
Man Sets Bank On Fire For Denying Loan: బ్యాంకుకు నిప్పు పెట్టిన కేసును పోలీసులు ఛేదించారు. కర్ణాటకలోని హవేరీ జిల్లాలో బ్యాంకుకు నిప్పు పెట్టిన కేసులో రత్తిహళ్లికి చెందిన వసీం అక్రమ్ ముల్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులు ఐఏఎన్ఎస్ మీడియాకు వెల్లడించారు.
అసలేం జరిగిందంటే..
హవేరి జిల్లా బ్యాడగి సమీపంలోని హెగ్గొండ గ్రామంలోని బ్యాంకుకు వసీం అక్రమ్ ముల్లా అనే వ్యక్తి ఇటీవల వెళ్లాడు. తనకు లోన్ కావాలని కోరాడు. అయితే బ్యాంకు సిబ్బంది ఏదో కారణంతో అతడికి రుణం ఇవ్వడానికి అంగీకరించలేదు. ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన వసీం బ్యాంకుకు నిప్పు పెట్టినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. బ్యాంకులో ఉన్నవాళ్లే ఈ పని చేసి ఉంటారని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
వసీం అక్రమ్ ముల్లా ఆదివారం తెల్లవారుజామున పారిపోతుండగా గ్రామస్తులు అతడ్ని పట్టుకున్నారు. బ్యాంకు మంటల్లో కాలిపోతుంటే అదే చోటు నుంచి వసీం పారిపోవడంతో గ్రామస్తులకు అతడిపై అనుమానం వచ్చింది. బ్యాంకులో ఉన్న కొందరు సిబ్బంది నిప్పు పెట్టి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నా, మరోవైపు పోలీసులు నిందితుడు వసీంను విచారించగా అసలు విషయాలు వెలుగుచూశాయి. లోన్ మంజూరు చేయలేదన్న కారణంగా బ్యాంకుకు నిప్పు పెట్టానని నిందితుడు అంగీకరించడంతో స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు.
డాక్యుమెంట్స్ దగ్ధం..
బ్యాంకులో ఉన్న విలువైన పత్రాలు నాశనం చేయాలనే ఉద్దేశంతో బ్యాంకు సిబ్బంది ఈ పని చేసి ఉంటారని హెగ్గొండ గ్రామస్తులు మొదట భావించారు. కానీ నిందితుడు వసీంను విచారించగా.. తనకు లోన్ మంజూరు చేయలేదని ఈ పని చేసినట్లు ఒప్పుకోవడంతో గ్రామస్తులకు అసలు నిజం తెలిసింది.
వసీం అక్రమ్ ముల్లా ఆదివారం వేకువజామున బైకుమీద బ్యాంకుకు వెళ్లాడు. అద్దాలు పగలగొట్టి బ్యాంకులో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. పొగ రావడం గమనించిన హెగ్గొండ గ్రామస్తులు బ్యాంకు వద్దకి పరుగులు తీశారు. అదే సమయంలో వసీం భయంతో పారిపోతున్నట్లుగా కనిపించడంతో అతడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కత్తితో బెదిరించే ప్రయత్నం చేసినా స్థానికులు ధైర్యంగా అతడ్ని పట్టుకున్నారు. అగ్ని ప్రమాదం ఘటనలో బ్యాంకులోని ఫర్నిచర్, సీసీ కెమెరాలు, డాక్యుమెంట్స్ దగ్ధమయ్యాయి. తనకు లోన్ మంజూరు చేయనందుకే ఇలా చేశానని నిందితుడు ఒప్పుకోవడంతో గ్రామస్తులకు బ్యాంకు సిబ్బందిపై అనుమానం తొలగిపోయింది.
Also Read: ఈ నాలుగు రాశుల వారు ఈ రోజు ఏం చేసినా సక్సెస్ అవుతారు, మీరున్నారా అందులో ఇక్కడ తెలుసుకోండి..
Also Read: Gold-Silver Price: గుడ్‌న్యూస్! నేడు మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. మీ ప్రాంతంలో తాజా ధరలు ఇవీ..