By: ABP Desam | Updated at : 11 Jan 2022 06:33 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు స్వల్పంగా రూ.11 తగ్గింది. వెండి ధర కిలోకు రూ.300 పతనం అయింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.44,500 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.48,550 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.64,300గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,500 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,550గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.64,300 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.44,500 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,550గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.64,300గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
అయితే, ఇతర నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.44,720గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,790గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,610 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,610 గా ఉంది.
ప్లాటినం ధర నేడు ఇలా..
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం నేడు రూ.20 తగ్గి.. రూ.22,291 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.
అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: Citroen C3: రూ.5 లక్షల రేంజ్‌లో కొత్త కారు.. త్వరలో లాంచ్.. పంచ్‌కే పంచ్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?
Tata Money Market Fund - Direct - Growth NAV June 27, 2022: నెట్ అసెట్స్ విలువ, ధర, స్కీమ్, పెట్టుబడి, వడ్డీరేటు తెలుసుకోండి
Kotak Liquid Fund - Direct - Growth NAV June 27, 2022: నెట్ అసెట్స్ విలువ, ధర, స్కీమ్, పెట్టుబడి, వడ్డీరేటు తెలుసుకోండి
Invesco India Gold Exchange Traded Fund NAV June 27, 2022: నెట్ అసెట్స్ విలువ, ధర, స్కీమ్, పెట్టుబడి, వడ్డీరేటు తెలుసుకోండి
HDFC Money Market Fund - Direct - Growth NAV June 27, 2022: నెట్ అసెట్స్ విలువ, ధర, స్కీమ్, పెట్టుబడి, వడ్డీరేటు తెలుసుకోండి
IDBI Gold Exchange Traded Fund NAV June 27, 2022: నెట్ అసెట్స్ విలువ, ధర, స్కీమ్, పెట్టుబడి, వడ్డీరేటు తెలుసుకోండి
Chiru In Modi Meeting : మోదీ, జగన్‌తో పాటు చిరంజీవి కూడా ! - నాలుగో తేదీన ఏపీలో
Telangana SSC Exam Results: గురువారం తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు
Janasena Janavani : " జనవాణి " ప్రారంభిస్తున్న పవన్ కల్యాణఅ ! ఇక నుంచి ప్రతి ఆదివారం ..
IND vs IRE, 1st Innings Highlights: దీపక్ హుడా, సంజూ శాంసన్ సూపర్ షో- ఐర్లాండ్‌కు భారీ టార్గెట్