News
News
X

Citroen C3: రూ.5 లక్షల రేంజ్‌లో కొత్త కారు.. త్వరలో లాంచ్.. పంచ్‌కే పంచ్!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ సిట్రియోన్ మనదేశంలో కొత్త కారును త్వరలో లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

FOLLOW US: 

సిట్రియోన్ సీ3 కారు భారతీయ రోడ్ల మీద ఇటీవలే కనిపించింది. దీన్ని బట్టి ఈ కారు త్వరలోనే మనదేశంలో లాంచ్ కానుందని అంచనా వేయవచ్చు. ఈ సీ3 ఎస్‌యూవీ కాదు కానీ కాస్త ఎత్తు ఎక్కువ ఉన్న హ్యాచ్‌బ్యాక్‌లా కనిపిస్తుంది. సిట్రియోన్ మనదేశంలో తన మొదటి కారు సీ5 ఎయిర్ క్రాస్‌ను గతంలోనే లాంచ్ చేసింది. ఇది సిట్రియోన్ లాంచ్ చేయనున్న రెండో కారు.

మనదేశం కోసం దీన్ని బాగా లోకలైజ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎస్‌యూవీల కంటే తక్కువ ధరకే ఈ కారు మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. హెడ్ ల్యాంప్స్/డీఆర్ఎల్స్ వేర్వేరుగా ఉన్నాయి. కాబట్టి ఇది చూడటానికి కూడా చాలా స్టైలిష్‌గా ఉంది.

ఎస్‌యూవీ కానప్పటికీ ఇందులో క్లాడింగ్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్‌తో పాటు ఎస్‌యూవీ తరహా స్టాన్స్ కూడా ఉండనున్నాయి. దీని ఇంటీరియర్‌ను అందంగా తీర్చిదిద్దారు. విండో కంట్రోల్స్ మధ్యలో ఉన్నాయి. దీంతోపాటు మాన్యువల్ ఏసీ కూడా ఈ కారులో ఉంది.

ఇందులో 10 అంగుళాల టచ్ స్క్రీన్ అందించే అవకాశం ఉంది. దీనికి స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఫీచర్ కూడా అందించారు. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇందులో ఉండనుంది. సీ3లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్ గేర్ బాక్స్ వేరియంట్, ప్రాపర్ ఆటోమేటిక్ వేరియంట్లు ఉండే అవకాశం ఉంది.

ఈ కారు ధర ఎంత ఉండనుంది అనే విషయం తెలియరాలేదు. అయితే ఫీచర్లను బట్టి చూస్తే రూ.5 లక్షల రేంజ్‌లో దీని ధర ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం టాటా పంచ్ రూ.5.4 లక్షల నుంచి ప్రారంభం కానుంది. పంచ్ కంటే తక్కువ ధరకే లాంచ్ అయితే సీ3 వినియోగదారులను ఆకర్షించడం ఖాయం.

Also Read: Best Selling Cars: 2021లో ఎక్కువ అమ్ముడుపోయిన కార్లు ఇవే.. ఏ కారును ఎక్కువ కొన్నారంటే?

Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేసింది.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 10 Jan 2022 08:18 PM (IST) Tags: Citroen C3 India Launch Citroen C3 Citroen C3 Expected Price Citroen New Car Citroen C3 Spotted Citroen C3 Expected Features New Budget Car

సంబంధిత కథనాలు

Skoda Octavia: స్కోడా ఎలక్ట్రిక్ కారు, ఒక్కసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లిపోవచ్చు!

Skoda Octavia: స్కోడా ఎలక్ట్రిక్ కారు, ఒక్కసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లిపోవచ్చు!

Hero E-scooter: హీరో నుంచి ఎట్టకేలకు ఇ-స్కూటర్, విడుదల ఎప్పుడంటే?

Hero E-scooter: హీరో నుంచి ఎట్టకేలకు ఇ-స్కూటర్, విడుదల ఎప్పుడంటే?

Electric SUV Space: ఎలక్ట్రిక్‌ SUVల కోసం ₹4 వేల కోట్ల ప్లాన్‌లో మహీంద్ర

Electric SUV Space: ఎలక్ట్రిక్‌ SUVల కోసం ₹4 వేల కోట్ల ప్లాన్‌లో మహీంద్ర

Airplane Mode: విమానంలో ఫోన్లను ‘ఫ్లైట్ మోడ్’లో పెట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

Airplane Mode: విమానంలో ఫోన్లను ‘ఫ్లైట్ మోడ్’లో పెట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

Tata Punch Camo Edition: టాటా పంచ్‌లో కొత్త వెర్షన్ - సూపర్ అనిపించే లుక్!

Tata Punch Camo Edition: టాటా పంచ్‌లో కొత్త వెర్షన్ - సూపర్ అనిపించే లుక్!

టాప్ స్టోరీస్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల