Best Selling Cars: 2021లో ఎక్కువ అమ్ముడుపోయిన కార్లు ఇవే.. ఏ కారును ఎక్కువ కొన్నారంటే?
2021లో మనదేశంలో ఎక్కువగా అమ్ముడు పోయిన కార్లు ఇవే.. మారుతి హవా..
కరోనావైరస్ కారణంగా భారత కార్ల మార్కెట్ కాస్త దెబ్బ తిన్నప్పటికీ.. 2021లో తిరిగి కోలుకుంది. అయితే చిప్ షార్టేజ్ కారణంగా డెలివరీల్లో ఆలస్యం జరిగింది. ఈ సమస్య ఇప్పటికే కొనసాగుతోంది కూడా. అయితే లాక్ డౌన్ ఎత్తేశాక భారతీయులు కార్లను ఎక్కువగా కొనుగోలు చేశారు. ప్రజా రవాణా కంటే వ్యక్తిగత వాహనాల వైపు ప్రజలు మొగ్గు చూపడంతో కార్ల అమ్మకాలు పెరిగాయి. ఈ సంవత్సరం మనదేశంలో ఎక్కువగా అమ్ముడుపోయిన వాహనాలు ఇవే..
1. మారుతి వాగన్ ఆర్
ఏ సంవత్సరం చూసుకున్నా.. మారుతి బెస్ట్ సెల్లింగ్ కార్లలో వాగన్ ఆర్ కూడా ఉంటుంది. ఈ సంవత్సరం దాని పాపులారిటీ మరింత పెరిగింది. ఇందులో సీఎన్‌జీ వెర్షన్ రావడం.. ఇంటీరియర్లలో మార్పులు, కారు మరింత విశాలం కావడంతో ఈ కారు వినియోగదారులకు మరింత అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఏఎంటీ ఆటోమేటిక్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ సంవత్సరం వాగన్ ఆర్ దాదాపు 1.64 లక్షల యూనిట్లు అమ్ముడుపోయింది.
2. మారుతి స్విఫ్ట్/బలెనో
స్విఫ్ట్ ఈ సంవత్సరం కూడా బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. దీనికి సంబంధించిన కొత్త పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ రావడం సేల్స్‌కు బాగా హెల్ప్ అయింది. ఈ సంవత్సరం దాదాపు 1.5 లక్షల మారుతి స్విఫ్ట్ యూనిట్లు అమ్ముడుపోయాయి. బలెనో కూడా 1.5 లక్షల యూనిట్ల వరకు అమ్ముడుపోయాయి.
3. మారుతి విటారా బ్రెజా
మారుతి విటారా బ్రెజా పాత కారు అయినా సరే.. ఇప్పటికీ హయ్యస్ట్ సెల్సింగ్ కార్లలో ఒకటిగా నిలిచింది. రగ్డ్ లుక్ ఉండటం, కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ఉండటంతో ఈ కారు వినియోగదారులను ఆకర్షిస్తూనే ఉంది.
4. హ్యుండాయ్ క్రెటా
హ్యుండాయ్ క్రెటా కూడా మనదేశంలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీల్లో ఒకటి. దాదాపు లక్షకు పైగా క్రెటా కార్లు అమ్ముడుపోయాయి. ఇందులో డీజిల్, పెట్రోల్ వేరియంట్లు కూడా ఉన్నాయి.
5. టాటా నెక్సాన్
టాటా నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ వేరియంట్ వచ్చాక దీనికి డిమాండ్ బాగా పెరిగింది. అమ్మకాలు కూడా ఎక్కువయ్యాయి. ప్రస్తుతం బెస్ట్ సెల్లింగ్ టాటా కారు ఇదే. దీని సేఫ్టీ, లుక్స్, ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి. దీంతోపాటు ఇందులో ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా అందుబాటులోకి వచ్చింది.
6. కియా సెల్టోస్
ఈ కారును కంపెనీ అప్ డేట్ చేసింది. దీంతోపాటు మరిన్ని వేరియంట్లను కూడా లాంచ్ చేసింది. దీని కారణంగా సేల్స్ విపరీతంగా పెరిగాయి. కియా సోనెట్‌ను కూడా దాటి కంపెనీ బెస్ట్ సెల్లర్‌గా ఈ కారు నిలిచింది. దీని క్యాబిన్ పెద్దగా ఉండటం, ఎక్కువ ఇంజిన్ ఆప్షన్లు, మంచి ధర కారణంగా సెల్టోస్ సూపర్ హిట్ అయింది.
Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేసింది.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?