Mulugu Fire Accident : ములుగు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం, 40 ఇళ్లు అగ్నికి ఆహుతి
Mulugu Fire Accident : ములుగు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అటవీ ప్రాంతం నుంచి మంటలు వ్యాపించి 40 గిరిజన ఇళ్లు కాలిపోయాయి. కట్టుబట్టలతో 40 కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
Mulugu Fire Accident : ములుగు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగపేటలో గురువారం సాయంత్రం ఏడున్నర గంటల సమయంలో అకాలంగా వీచిన గాలి దుమ్ముకు సమీప అటవీ ప్రాంతం నుంచి గ్రామంలోకి మంటలు వ్యాపించాయి. ములుగు జిల్లా మంగపేట మండలంలోని శనిగకుంట గ్రామంలో అగ్ని ప్రమాదం చోటుకుని 40 ఇళ్లు కాలిబూడిదయ్యాయి. ఇళ్లు అగ్నికి ఆహుతి అవ్వడంతో గిరిజన కుటుంబాలు నిలువనీడ కోల్పోయాయి. ఇళ్లు మంటల్లో కాలిపోవడంతో గిరిజనులు కట్టుబట్టలు, పిల్లలతో నడిరోడ్డుపై పడ్డాయి. కన్నాయిగూడెంలో గాలి దుమారం భారీ అగ్ని ప్రమాదానికి కారణమైంది. గాలి దుమారం కారణంగా మంగపేట మండలం శనగకుంటలో 40 ఇళ్లకు మంటలు అంటున్నాయి. ఆ మంటలు కాసేపట్లోనే ఊరంతా వ్యాపించాయి. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఆదివాసీల ఇళ్లు మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి. ఈ గ్రామంలోని గిరిజన కుటుంబాలు కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటపడ్డారు. అగ్ని ప్రమాదంతో అప్రమత్తమైన విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో ఆ ప్రాంతం పూర్తిగా చీకటిమయంగా మారింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని గిరిజనులు వేడుకున్నారు.
ప్రకాశం జిల్లాలో
ప్రకాశం జిల్లా మార్కాపురంలోని సాయి బాలాజీ థియేటర్ వెనక ఉన్న ప్లాస్టిక్ వేస్ట్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ప్లాస్టిక్ ఫ్యాక్టరీ దగ్ధం అయింది. బుధవారం అర్ధరాత్రి 11.30 ప్రాంతంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంలో రూ. 20 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని ఫ్యాక్టరీ యజమాని తెలిపారు.
విశాఖలో
విశాఖపట్నం గాజువాకలో అగ్నిప్రమాదంలో జరిగింది. మింది గ్రామం వెళ్లే రహదారిలో స్క్రాప్ షాపు మంటలు అలముకున్నాయి. ఈ సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపుచేశారు. పక్కనే రెండు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మాలకు మంటలు వ్యాప్తించి భారీగా ఎగసిపడుతున్నాయి.
తమిళనాడులో
తమిళనాడు రాజధాని చెన్నైలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మూడు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటల్ని అదుపుచేశారు. ఆస్పత్రిలోని ఐసీయూలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన ఆసుపత్రిని మంత్రి సుబ్రమణ్యం, హెల్త్ సెక్రటరీ రాధాకృష్ణన్ పరిశీలించారు.
Also Read : Guntur News : తుమ్మపూడిలో ఉద్రిక్తత, లోకేశ్ పర్యటనలో రాళ్ల దాడి