Road Roller Thieves: దొంగల్లో దరిద్రులంటే వీళ్లే - రోడ్డు రోలర్ కొట్టేయడం ఏందిరా అయ్యా !
crime news: రోడ్ రోలర్ దొంగతనం చేసిన దొంగల్ని మేడ్చల్ పోలీసుల్ని పట్టుకున్నారు. వాటిని దొంగతనం చేసి స్క్రాప్ గా మార్చి అమ్మేసుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు.

Medchal police caught the thieves who stole the road roller: ప్రపంచంలో దొంగతనం చేయాలని ఎవరైనా అనుకుంటే దేన్నైనా కొట్టేస్తారు. చివరికి రోడ్డు రోలర్ ని కూడా. అందులో వారికి కావాల్సిన ప్లస్ పాయింట్లను దొంగలు వారు చూసుకుంటారు. అది భారీగా ఉండటం.. కొట్టేసి తుక్కు కింద మార్చేసి అమ్మేసుకుంటే దొరకను కూడా దొరకం అనే నమ్మకం.. రోడ్డురోలర్ పోయిందంటే పోలీసులు కూడా అంత సీరియస్ గా తీసుకోరన్న అభిప్రాయంతో రోడ్ రోలర్లను..ఎక్స్ కవేటర్లను దొంగతనం చేయడాన్ని మంచి ప్రాఫిటబుల్ వెంచర్ గా భావించి ఆ దొంగలు. అయితే వారి లెక్క తప్పింది. దొరికిపోయారు.
రోడ్డు నిర్మాణ పనుల్లో వాడుతున్న రోడ్ రోలర్ దొంగతనం
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి లో ఈ నెల 21న రోడ్డు పక్కన పెట్టి ఉన్న ఓ రోడ్డు రోలర్ కనిపించకుండా పోయింది. అక్కడ నిర్మిస్తున్న కారణంగా వాటిని తెచ్చి పెట్టారు కాంట్రాక్టర్లు. వర్కర్లు ఏ రోజు పని ఎంత వరకూ పూర్తి అయితే అక్కడ రోడ్డు రోలర్ పెట్టి వెళ్తారు. ఉదయమే వచ్చి మళ్లీ పని ప్రారంభిస్తారు. ఓ రోజు ఉదయం వచ్చి చూస్తే రోడ్డు రోలర్ లేదు. దాన్ని తీసుకుని ఎవరో వెళ్లిపోయారని అర్థం అయింది. అయితే ఎంత దూరం వెళ్తారని ఆరా తీసినా ఎక్కడా కనిపించలేదు. దాతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
స్క్రాప్ గా మార్చేసి అమ్ముకునేందుకు తీసుకెళ్లిన దొంగలు
పోలీసులు విచారణ జరిపి ఇలాంటి వాటిని దొంగతనం చేసేవారి గురించి ఆరా తీసి.. దొంగల్ని పట్టుకున్నారు. రోడ్డు మరమ్మత్తు పనులు జరిగే ప్రదేశాల్లో రోడ్డు రోలర్,చిన్న క్రేన్లు వంటి వాహనాలను దొంగిలించి వాటిని స్క్రాప్ కింద మార్చి సొమ్ము చేసుకుంటున్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. నిందితుల నుండి డిసియం లో ఉన్న రోడ్డురోలర్ తో పాటు 2భారీ క్రేన్ లు,4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 5గురిలో నలుగురు దొంగల్ని రిమాండ్ కు తరలించిన పోలీసులు, మరో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు.
దొంగతనం చేసే వాహనంతో సహా స్వాధీనం చేసుకున్న పోలీసులు
రోడ్డు పక్కన పార్క్ చేసి వెళ్తే సైకిల్ కే గ్యారంటీ ఉండదు. కానీ సైకిల్ వేరు.. రోడ్డు రోలర్ వేరు. ఇలా సులువుగా తీసుకెళ్లిపోయి అమ్మేసుకోవచ్చు సైకిల్ ను. కానీ రోడ్డు రోలర్ ను తీసుకెళ్లడమే కాదు అమ్ముకోవడం కూడా కష్టమే. ఎవరూ కొనరు. చాలా బరువు ఉంటుంది కాబట్టి స్క్రాప్ గా మార్చేసి అమ్మకుంటున్నారు. ఇలాంటి వాటిని తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా డీసీఎంను కూడా కొనుగోలు చేశారు దొంగలు. ఇప్పుడు దాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.





















