Konaseema News: పుట్టినరోజు వేడుకలో విషాదం, గౌతమీ నదిలో దిగి ఇద్దరు యువకులు మృతి
పుట్టినరోజు వేడుకలో విషాదం. గౌతమీ నదిలో దిగి ఇద్దరు యువకులు మృతుఒడికి చేరుకున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈసంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్నినింపింది.
గౌతమీ నదిలో దిగి ఇద్దరు యువకులు మృతి..
పుట్టినరోజు వేడుకలో విషాదం..
ఇసుక తవ్వకాల వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపణ..
వేసవి తాపానికి సరదాగా గోదావరిలో స్నానం చేసి సేదతీరాలన్న ఆ యువకులను కానరాని లోకాలకు తీసుకెళ్లింది.. ఇసుక తవ్వకాలు ఎక్కువగా జరిగే జన్నాడ గోదావరి తీరంలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతుఒడికి చేరుకున్నారు. స్నేహితుని పుట్టిన రోజు సందర్భంగా ఆటవిడుపులా గోదావరి తీరానికి వెళ్లిన ఆ యువకులకు లోతు లేదని అనుకుని గోదావరి లో దిగిన కొన్ని క్షణాల్లోనే ఇసుకాసురులు సృష్టించిన అగాధంలోకి వెళ్లిపోయారని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు.. ఏది ఏమైనా ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన గెద్దాడ కరణ్‌కుమార్(22) అయినవల్లి మండలం పెద్దపాలెంకు చెందిన మోటూరి త్రిలోక్(18) గోదావరిలో మునిగి మృతిచెందారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
పుట్టినరోజు సందర్భంగా వెళ్లి మృత్యుఒడికి..
గోదావరి తీరంలో స్నేహితుని పుట్టిన రోజు వేడుక సరదాగా చేసుకుందామని వెళ్లిన క్రమంలో నదిలో దిగి ఇద్దరు యువకులు మృతిచెందిన సంఘనటకు సంబందించి ఆసమయంలో మొత్తం ఆరుగులు ఉండగా ఉన్నఫళంగా మృతులిద్దరూ ఊబిలోకి దిబడిపోయారని, తాము మాత్రం సురక్షితంగా బయటపడ్డామని స్నేహితులు చెబుతున్నారు. వేసవి తాపానికి గోదావరిలో స్నానం చేసేందుకు ఈప్రాంతానికి యువకులు, పిల్లలు తరలివస్తుండడంతో రెండు రోజుల క్రితం పోలీసులు సంఘటన జరిగిన కొంత దూరంలోనే హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. ఈప్రాంతంలో ఇసుక తవ్వకాలు జరిగాయని తెలియని కొందరు స్నానాలకు దిగుతున్నారని, గోదావరి ప్రవాహ వడికి ఇంకా అఘాధాలుగా మారుతున్నాయని చెబుతున్నారు.
Also Read: Hyderabad Delivery Boy: దూసుకొచ్చిన పెంపుడు కుక్క, భయంతో మూడో అంతస్తు నుంచి దూకిన డెలివరీ బాయ్
విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు..
కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని జన్నాడ ఇసుక ర్యాంపు ద్వారా గోదావరిలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఈప్రాంతంలో నిభందనలకు విరుద్ధంగా 40 నుంచి 50 అడుగులు పైబడి ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇసుకాసురులు తవ్విన ఈ అగాధాలే ఇద్దరు యువకుల ప్రాణాలు తీశాయని, గతంలోనూ ఈప్రాంతంలో కొంత మంది మృతిచెందారని చెబుతున్నారు. అక్రమ ఇసుక తవ్వకాల వల్ల ఈ ఘటనా స్థలానికి అత్యంత సమీపంలో రావులపాలెం`జన్నాడ బ్రిడ్జిలు ఉన్నాయి. జన్నాడ ఇసుక ర్యాంపు నుంచి వందలాది టిప్పర్లు ఇసుకను తరలిస్తుంటాయి.. ఈక్రమంలో జన్నాడ సెంటర్‌లో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ఇక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు..
యువకులు మరణానికి కారణం అక్రమ తవ్వకాలు; నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్
అలమూరు మండలంలో జొన్నాడ ఇసుక రీచ్ లో జేపీ సంస్థ నిబంధనలుకు విరుద్ధంగా చేస్తున్న తవ్వకాలు వల్లనే గోదావరిలో స్నానం చేయడానికి వచ్చిన ఇద్దరు యువకులును బలి తీసుకుందని కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ అన్నారు. ఇసుక మాఫియా నిబంధనలుకు విరుద్ధంగా 40 నుండి 50 అడుగులు ఇసుక తవ్వకాలు చేయడం వలన ఇద్దరు యువకులు బలైపోయారన్నారు. వీరి కుటుంబాలకు ఎవరు బాధ్యత వహిస్తారుని, శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రక్కనే జొన్నాడ - రావులపాలెం బ్రిడ్జ్ ఉందని, వారి అడ్డగోలు తవ్వకాలు చూస్తుంటే భ బ్రిడ్జికి ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో అనిపిస్తుందన్నారు. దీనిపై అధికారులు స్పందించకపోతే జనసేన పార్టీ తరుపున ఉద్యమం చేపట్టవలసి వస్తుంది అని అగ్రహ వ్యక్తం చేశారు.
Also Read: Rains Alert: తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఏపీలో అక్కడ పిడుగులు పడతాయని వార్నింగ్