అన్వేషించండి

Hyderabad Delivery Boy: దూసుకొచ్చిన పెంపుడు కుక్క, భయంతో మూడో అంతస్తు నుంచి దూకిన డెలివరీ బాయ్‌

హైదరాబాద్‌ మణికొండలోని పంచవటి కాలనీలో దారుణం జరిగింది. పెంపుడు కుక్క దూసుకురావడంతో ఓ డెలివరీ బాయ్ ప్రాణాలు కాపాడుకునేందకు మూడో అంతస్తు నుంచి దూకేశాడు.

హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వేసవికాలం మొదలైనప్పటి నుంచీ కుక్కల బెడద మరింత అధికమైంది. నగరంలో ఓ బాలుడ్ని వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. ఆపై ఖమ్మం జిల్లాలో, ఇటీవల హన్మకొండలోనూ వీధి కుక్కలు దాడి చేయడంలో పసివాళ్లు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా హైదరాబాద్‌ మణికొండలోని పంచవటి కాలనీలో దారుణం జరిగింది. పెంపుడు కుక్క దూసుకురావడంతో ఓ డెలివరీ బాయ్ ప్రాణాలు కాపాడుకునేందకు మూడో అంతస్తు నుంచి దూకేశాడు. తీవ్రగాయాలపాలైన డెలివరీ బాయ్‌ ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. 

అసలేం జరిగిందంటే..
రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో మణికొండ పంచవటి కాలనీ ఉంది. ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే కుటుంబ అమెజాన్ లో ఓ ప్రొడక్ట్ ఆర్డర్ చేసింది. అది డెలివరీ చేసేందుకు ఓ యువకుడు వెళ్లాడు. ఈ క్రమంలో డెలివరీ బాయ్ మూడో అంతస్తు ఎక్కగా.. అక్కడ ఉన్న ఓ పెంపుడు కుక్క యువకుడి మీదకు దూసుకొచ్చింది. భయాందోలనకు గురైన డెలివరీ బాయ్ ప్రాణ భయంతో మూడో అంతస్తు నుంచి కిందకి దూకేశాడని స్థానికులు తెలిపారు. డాబర్ మెన్ డాగ్ మీదకు దూసుకురావడంతో కరుస్తుందేమోనన్న భయంతో కిందకి దూకిన డెలివరీ బాయ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గాయపడ్డ యువకుడ్ని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

ఆ ఇంటి ఓనర్ ఈ ఘటనపై స్పందించారు. తాము ఈ కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ లో బెడ్ బుక్ చేశామని తెలిపారు. తమ ఫ్లాట్ కు వచ్చే కొంత సమయం ముందు డెలివరీ బాయ్ కాల్ చేశాడు. 5 నిమిషాల్లో వస్తానని ఫోన్ లో చెప్పాడన్నారు. డెలివరీ బాయ్ కోసం ఎదురుచూశాం, ఆ యువకుడ్ని చూసి మా పెంపుడు కుక్క అరిచింది. దాంతో డెలివరీ బాయ్ భయపడ్డాడు. కుక్క కరుస్తుందని భయంతో యువకుడు గోడ ఎక్కి దూకేశాడు. అయితే కుక్క కరవదని మేం చుబుతూనే ఉన్నాం, కానీ అతడు భయంతో కిందకు దూకాడని బెడ్ ఆర్డర్ చేసిన ఆ ఇంటి ఓనర్ తెలిపారు.

వరుసగా కుక్కల దాడులు, బలవుతున్న చిన్నారులు!
కొన్ని నెలల కిందట హైదరాబాద్ లోని అంబర్ పేటలో ప్రదీప్ అనే బాలుడు కుక్కల దాడిలో మృతిచెందిన ఘటన మరువక ముందే తెలంగాణలో మరో దారుణం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలో వీధి కుక్కలు దాడి చేసిన ఘటనలో మరో చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. రఘునాథపాలెం మండల పరిధిలోని పుటాని తండా గ్రామ పంచాయతీలో ఈ విషాదం జరిగింది. బానోతు రవీందర్, సంధ్య దంపతులకు చిన్న కుమారుడైన బానోతు భరత్(5) ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. అంతలో వీధి కుక్కలు భరత్ పై దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాథమిక చికిత్స చేయించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గం మధ్యలోనే బాలుడు మృతి చెందడం తెలిసిందే. రెండు రోజుల కిందట  హన్మకొండ జిల్లాలో దారుణం జరిగింది. కాజీపేట రైల్వే ఆవరణంలోని నూతన చిల్డ్రన్ పార్క్ వద్ద బాలుడిని కుక్క కరిచింది. ఆరేళ్ల బాలుడు ఆడుకుంటున్న టైంలో కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో బాలుడు స్పాట్‌లోనే చనిపోయాడు. 

టాప్ హెడ్ లైన్స్

Bengaluru Murder Case: భార్యపై కోపంతో ఏడుగురి హత్య.. పార్టీకి పిలిచి మొత్తం అత్తింటి ఫ్యామిలీని అంతం!
భార్యపై కోపంతో ఏడుగురి హత్య.. పార్టీకి పిలిచి మొత్తం అత్తింటి ఫ్యామిలీని అంతం
Adulterated Milk: మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
US Telugu Students: అమెరికాలో విషాదాలు..నల్గొండ యువతి మిస్సింగ్, గుంటూరు యువకుడి మృతి!
అమెరికాలో విషాదాలు..నల్గొండ యువతి మిస్సింగ్, గుంటూరు యువకుడి మృతి!
Meerpet Knife Attack: మీర్‌పేట్‌లో దారుణం.. అత్తింటి వారిపై అల్లుడు కత్తితో దాడి.. ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు
మీర్‌పేట్‌లో దారుణం.. అత్తింటి వారిపై అల్లుడు కత్తితో దాడి.. ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Metro Combined Pass: తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ ధరలు భారీగా తగ్గింపు
తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ ధరలు భారీగా తగ్గింపు
Kandula Durgesh: మురసు తుఫాన్ ఉగ్రరూపం.. రంగంలోకి దిగిన కందుల దుర్గేష్, నిడదవోలులో బాధితులకు అండగా మంత్రి
మురసు తుఫాన్ ఉగ్రరూపం.. రంగంలోకి దిగిన కందుల దుర్గేష్, నిడదవోలులో బాధితులకు అండగా మంత్రి
Adulterated Milk: మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
High-Security Registration Plate: హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ తప్పనిసరి.. ప్రయోజనాలు, ధర & ఆన్‌లైన్‌లో అప్లై చేసే విధానం
మీ వాహనానికి HSRP ఉందా? ఇది ఎందుకు అవసరం, ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి
Telangana Congress Internal Infighting : తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
Anand Mahindra Post: రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
Vantara: మెరుగైన వైద్యం కోసం ఏనుగు పిల్ల మాయను కేరళ నుంచి వంతారాకు ఎయిర్‌లిఫ్ట్
మెరుగైన వైద్యం కోసం ఏనుగు పిల్ల మాయను కేరళ నుంచి వంతారాకు ఎయిర్‌లిఫ్ట్
KA Paul: రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి బట్టబయలు చేస్తా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి బట్టబయలు చేస్తా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
Embed widget