Youtube Thief: అప్పుల బాధ భరించలేక, యూట్యూబ్‌లో టెక్నిక్స్ నేర్చుకుని మరీ చోరీ - కథ అడ్డం తిరిగింది
Thief learns Techniques from Youtube: నేర్చుకోవడానికి యూట్యూబ్‌ని ఆశ్రయించాడు. అయితే కొత్త దొంగ కాబట్టి యూట్యూబ్ నాలెడ్జ్ పనిచేయలేదు సరికదా పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.
Karimnagar Crime News: అతను ఫీల్డ్‌కి ఒక కొత్త దొంగ... తను చేసిన అప్పులను తీర్చడానికి దొంగ అవతారమెత్తాడు. కానీ మొదటి ప్రయత్నంలోనే ఓడిపోయాడు. అలాగని అతడేమీ నేరుగా చోరీకి యత్నించలేదు. ఇలాంటివి నేర్చుకోవడానికి యూట్యూబ్‌ని ఆశ్రయించాడు. అయితే ముందుగా చెప్పినట్టు కొత్త దొంగ కాబట్టి యూట్యూబ్ నాలెడ్జ్ పనిచేయలేదు సరికదా పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఆ యూట్యూబ్ దొంగ కథేంటో మీరూ చదవండి..
అప్పుల బాధతో దొంగ అవతారం....
ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ కు చెందిన చెరుకు రాజేష్ డ్రైవర్‌గా పని చేస్తూ జీవితాన్ని గడిపేవాడు. అయితే కొద్ది సంవత్సరాల క్రితం దాదాపు 12 లక్షల అప్పు చేసి కొన్న హార్వెస్టర్ వల్ల తీవ్రంగా నష్టపోయాడు రాజేష్. మరోవైపు అప్పులు ఇచ్చిన వారంతా ఇంటి మీదకు వచ్చి గొడవ చేసేవారు. దీంతో అన్ని అప్పులు ఎలా తీర్చాలి అనే ఆలోచనలో పడ్డ రాజేష్ ఇక భారీ స్కెచ్ వేశాడు. ఇందుకోసం ప్రత్యేకంగా 15 రోజుల కిందటే మెట్‌పల్లికి వచ్చి మరీ అక్కడ ఉన్న రైల్వే బ్రిడ్జి వద్ద గల ఖాళీ బిల్డింగ్‌లో ఉంటున్నాడు. ఇక ఎలాగైనా దొంగతనం చేసి అప్పులు చెల్లించేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇక్కడ సార్ కి కొత్త కాబట్టి ఎలా చేయాలో తెలియదు. ఎవరిని అడగలేడు కాబట్టి యూట్యూబ్ ని తన గురువుగా ఎంచుకున్నాడు. ఇక మెట్‌పల్లి ఎస్బీఐ వెన్పేట లోని కెనరా బ్యాంక్ ఎటిఎం లను లక్ష్యంగా తన భార్య ఏటీఎం వాడటం ద్వారా ముందుగా రెక్కీ నిర్వహించాడు.
అంతా రెడీ కానీ కథ అడ్డం తిరిగింది...
ఇక జూన్ 27న రాత్రి అక్కడే ఉన్న ఒక వెల్డింగ్ షాప్ లో ఒక గ్యాస్ సిలిండర్... నాజిల్ ముందుగా దొంగిలించాడు. ఇక 30వ తారీఖున మెట్‌పల్లి లోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి ప్రయత్నించగా మొదటి సారి గ్యాస్ సిలిండర్ పనిచేయలేదు. దీంతో మరోసారి జులై 1వ తారీఖున వేంపెంటలో గల కెనరా బ్యాంక్ ఎటిఎం కి చేరుకొని ముందుగా తలుపులు పగులగొట్టి లోపలికెల్లి మల్లి రెండవ తలుపులు వెల్డింగ్ ద్వారా తీసేయాలని ప్రయత్నించగా తెరుచుకోలేదు... అనుభవం లేదు కదా భయం మొదలు కావడంతో దొంగతనాన్ని విరమించుకొని తిరిగి తాను ఉంటున్న బిల్డింగ్ కి వచ్చేశాడు. అయితే ఏటీఎంలలో దొంగతనం ప్రయత్నం జరిగిందనే విషయం తెలుసుకున్న పోలీసులు ఆ వైపుగా దృష్టి సారించారు. దొరికిన ఆధారాలను బట్టి వీడెవడో కొత్త దొంగ అయి ఉంటాడని ఆ వైపుగా దృష్టి సారించారు.. వారి అంచనా గురి తప్పలేదు. చివరికి ఈ యూట్యూబ్ ట్రైనింగ్ దొంగను ఆధారాలతో సహా దొంగను అరెస్ట్ చేశారు పోలీసులు.
Also Read: Jammu Kashmir Cloudburst: అమర్‌నాథ్‌లో విషాదం - ఆకస్మిక వరదల్లో 15 మంది మృతి, మరో 35 మంది గల్లంతు
Also Read: Karimnagar News : కరీంనగర్ జిల్లాలో విషాదం, బావిలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్, రైతు మృతి