News
News
X

Kamareddy News : ప్రభుత్వ ఆఫీస్ ను బార్ లా మార్చేసిన తహసీల్దార్, మందేస్తూ మజా!

Kamareddy News : ప్రభుత్వ కార్యాలయాన్నే బార్ గా మార్చేశాడో తహసీల్దార్. బదిలీపై వచ్చిన మొదటి రోజే వీఆర్ఏతో కలిసి మందేస్తూ దొరికిపోయాడు.

FOLLOW US: 

Kamareddy News :  కామారెడ్డి జిల్లాలో ఓ తహసీల్దార్ ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో మందేసి మజా చేశారు. నాగర్ కర్నూల్ నుంచి బదిలీపై వచ్చిన తహసీల్దార్ సుధాకర్, వీఆర్ఏ సాయిలుతో కలిసి గురువారం రాత్రి ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో మద్యం సేవించారు. నిన్నటిరోజే విధుల్లో జాయిన్ అయిన తహసీల్దార్ సుధాకర్ మందు పార్టీలో చిక్కడం వివాదాస్పదం అవుతోంది.  వీఆర్ఏ సాయిలుతో కలిసి ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో మందు పార్టీ చేసుకోవడాన్ని మీడియా బట్టబయలు చేసింది. 

బదిలీపై వచ్చి బార్ తెరిచి! 

నాగర్  కర్నూల్ నుంచి బదిలీపై వచ్చిన తహసీల్దార్ సుధాకర్ ఎల్లారెడ్డి తహసీల్దార్ కార్యాలయం గౌస్ట్ హౌస్ లో  మందు తాగుతూ అడ్డంగా దొరికిపోయారు. వీఆర్వో సాయిలును వెంటేసుకుని ఏకంగా ప్రభుత్వ కార్యాలయంలోనే మందు దుకాణం పెట్టాడు. బుధవారం సుధాకర్ కొత్తగా విధుల్లో జాయిన్ అయ్యారు. వచ్చిన మొదటి రోజు నుంచే కార్యాలయాన్ని ఏకంగా బార్ అండ్ రెస్టారెంట్ గా మార్చేశారని విమర్శలు వస్తున్నాయి. తహసీల్దార్  ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో ఉంటున్నారు. అక్కడ కూడా వీఆర్ఏ సాయిలుతో కలిసి మందు తాగాడు. నాగర్  కర్నూల్ నుంచి బదిలీపై వచ్చిన సుధాకర్ ఇలాంటి పనులు చేయడం పట్ల పలువురు విమర్శిస్తున్నారు. 

ఇంట్లో నోట్ల కట్టలు

మహారాష్ట్రలోని జల్నా జిల్లాలోని ఓ బిజినెస్‌ గ్రూప్‌పై ఆదాయపు పన్ను శాఖ ఇటీవల విస్తృతంగా సోదాలు చేపట్టింది. ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడ్డాయి. దాదాపు రూ.56 కోట్ల నగదు లభ్యమవ్వగా.. దీన్ని లెక్కించడానికి అధికారులకు ఏకంగా 13 గంటల సమయం పట్టిందట. దీంతో పాటు వందల కోట్ల విలువైన బినామీ ఆస్తులను అధికారులు గుర్తించారు. జల్నాలో స్టీల్‌, వస్త్రాలు, రియల్‌ ఎస్టేల్‌ వ్యాపారం చేసే ఓ సంస్థ గత కొన్నేళ్లుగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆదాయపు పన్ను శాఖకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఈ నెల 1 నుంచి 8 వరకు 260 మంది ఐటీ సిబ్బంది ఐదు బృందాలుగా ఏర్పడి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా సోదాలు చేపట్టారు. ఆ సంస్థ యజమాని ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు జరిపారు.

ఈ సోదాల్లో మొత్తం రూ.56 కోట్ల నగదు, రూ.14 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను అధికారులు జప్తు చేసుకున్నారు. ఇతర ఆస్తులను చెందిన డిజిటల్‌ డేటా, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు మొత్తాన్ని అధికారులు ఐటీ ఆఫీసుకు తీసుకురాగా.. 13 గంటలకు పైగా శ్రమించి లెక్కించారట. ఈ సోదాల్లో దాదాపు రూ.390 కోట్ల మేర లెక్కల్లోకి రాని బినామీ ఆస్తులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నోట్ల కట్టలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే వీరిదంతా పన్నులు ఎగ్గొట్టి చేసే వ్యాపారమే కానీ రాజకీయాలతో సంబంధం లేదని భావిస్తున్నారు. ఈ అంశంపై ఐటీ అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. రాజకీయ లింకులు ఉంటే.. సంచలనాత్మకం అయ్యే అవకాశం ఉంది. 

Also Read : Nizamabad: పెళ్లి చేయట్లేదని తండ్రి, బాబాయ్‌ హత్య - కర్రతో చావ బాదిన కొడుకు!

Also Read : Hyderabad Crime : జీడిమెట్లలో దారుణం, బ్యూటిషన్ పై స్నేహితుడే అత్యాచారం!

Published at : 12 Aug 2022 02:47 PM (IST) Tags: TS News Drinking Alcohol Kamareddy News govt guest house VRA tahsildar

సంబంధిత కథనాలు

Kabul Blast: కాబూల్‌లో మరో భారీ పేలుడు, 100 మంది చిన్నారులు మృతి!

Kabul Blast: కాబూల్‌లో మరో భారీ పేలుడు, 100 మంది చిన్నారులు మృతి!

Rajahmundry News : స్పందనలో వెరైటీ ఫిర్యాదు, నాలుగు గంటలు శ్రమించి పట్టుకున్న సిబ్బంది!

Rajahmundry News : స్పందనలో వెరైటీ ఫిర్యాదు, నాలుగు గంటలు శ్రమించి పట్టుకున్న సిబ్బంది!

యానాంలో యథేచ్ఛగా గంజాయి దందా,  ఇద్దర్ని పట్టుకున్న పోలీసులు

యానాంలో యథేచ్ఛగా గంజాయి దందా,  ఇద్దర్ని పట్టుకున్న పోలీసులు

పబ్‌లో మైనర్‌ డ్యాన్స్, మంత్రులకు, అధికారులకు వీడియో ట్యాగ్‌!

పబ్‌లో మైనర్‌ డ్యాన్స్, మంత్రులకు, అధికారులకు  వీడియో  ట్యాగ్‌!

Secunderabad News : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో బాలుడి కిడ్నాప్, రెండు గంటల్లో ఛేదించిన పోలీసులు!

Secunderabad News : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో బాలుడి కిడ్నాప్, రెండు గంటల్లో ఛేదించిన పోలీసులు!

టాప్ స్టోరీస్

యాదాద్రీశునికి కేజీ 16 తులాల బంగారం విరాళం - కేటీఆర్ కుమారుడి చేతుల మీదుగా ఇచ్చిన కేసీఆర్ !

యాదాద్రీశునికి కేజీ 16 తులాల బంగారం విరాళం -  కేటీఆర్ కుమారుడి చేతుల మీదుగా ఇచ్చిన కేసీఆర్ !

Bandla Ganesh: 'భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషేనా' - పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ కామెంట్స్!

Bandla Ganesh: 'భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషేనా' - పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ కామెంట్స్!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ