అన్వేషించండి
Nizamabad: పెళ్లి చేయట్లేదని తండ్రి, బాబాయ్ హత్య - కర్రతో చావ బాదిన కొడుకు!
Nizamabad Crime News: కర్రల సతీష్ అనే యువకుడు తండ్రి కర్ర అబ్బయ్య, రెండో బాబాయి సాయిలు ఇద్దరిని దారుణంగా హత్య చేశాడు.
నిజామాబాద్ జిల్లా మోగ్పాల్ గ్రామంలో పండగ పూట విషాదం నెలకొంది. మోగ్పాల్ మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఒక యువకుడు ఏకంగా తన తండ్రిని, బాబాయిని మట్టుబెట్టాడు. కర్రల సతీష్ అనే యువకుడు తండ్రి కర్ర అబ్బయ్య, రెండో బాబాయి సాయిలు ఇద్దరిని దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కుటుంబ కలహాలే హత్యలకు కారణమని అన్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు కర్రల సతీష్ గత కొంత కాలంగా పెళ్లి చేయాలని ఇంట్లో తరచూ గోడవపడే వాడని, పెళ్లికి ఆలస్యం చేస్తున్నారనే తండ్రి, అడ్డొచ్చిన చిన్నాన్నను హత్య చేశాడని తెలిపారు. తలపై గట్టిగా మోదీ అతను ఇద్దర్నీ చంపేశాడు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పండగ పూట ఈ ఘాతుకానికి పాల్పడటంతో మోగ్పాల్ గ్రామంలో విషాదం నెలకొంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
న్యూస్
ప్రపంచం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion