By: ABP Desam | Updated at : 18 Dec 2021 04:34 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. బిచ్కుంద మండలం జగన్నాథ్‌పల్లి గేట్ వద్ద లారీని కారు ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో నలుగురికి తీవ్రగాయాలు కాగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు సహా ముగ్గురు మృతి
మరో ఆరుగురికి తీవ్రగాయాలు
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బిచ్కుంద మండలం జగన్నాథపల్లి గేట్ వద్ద ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. శనివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. క్వాలీస్ వాహనంలో 12 మంది నాందేడ్ నుంచి సంగారెడ్డి వైపు వెళ్తుండగా.. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల జగన్నాథ్‌పల్లి గేట్ వద్దకు రాగానే వాహనం అదుపుతప్పింది. దీంతో అక్కడ ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఘటనా స్థలంలోనే మరణించారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఆరుగురు క్షతగాత్రులను బాన్సువాడ, నిజామాబాద్ ఆసుపత్రులకు చికిత్స కోసం తరలించారు. ప్రమాదస్థలాన్ని డీఎస్పీ జైపాల్‌రెడ్డి, సీఐ శోభన్, మండలాల ఎస్సైలు పరిశీలించారు. మృతుల వద్ద ఉన్న గుర్తింపు కార్డుల ఆధారంగా పోలీసులు వారి వివరాలు సేకరిస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు పోలీసులు.
Also Read: ఆ అమ్మాయిలు రాత్రి మద్యం సేవించారు.. ఆపై నా మాట వినలేదు.. జూనియర్ ఆర్టిస్ట్ సిద్ధు ఆవేదన
అతివేగమే కారణమా..?
ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతులు హైదరాబాద్ కు చెందినవారని గుర్తించారు. ప్రమాదం జరిగే సమయానికి వాహనంలో 12 మంది ఉన్నారు. కారు అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. కారు వేగంగా లారీని ఢీకొట్టడంతో ముందుభాగం నుజ్జునుజ్జయింది.
Also Read: బెజవాడ 'ఖాకీ'ల సాహసం... గుజరాత్ వెళ్లి చెడ్డీ గ్యాంగ్ కు వల ... ముగ్గురు నిందితులు అరెస్టు
Jobs Cheating: నెలకు మూడు లక్షల జీతం- వర్క్‌ఫ్రమ్ హోం- హైదరాబాద్‌లోనే ఆఫీస్!
Nizamabad News: నిజామాబాద్ పీఎఫ్ఐ కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు- డబ్బులు ఇచ్చే వ్యక్తి సహా మరో ఇద్దరి అరెస్ట్
Karimnagar News: నిజామాబాద్ టెర్రరిస్టు ట్రైనర్‌కి కరీంనగర్‌తో లింకు- ఉగ్రవాది అజాంఘోరీ సంఘటనతో పోలుస్తున్న జనం
Vijayawada: బార్లు, వైన్ షాపుల్లో అవి తప్పకుండా పెట్టాల్సిందే! ఓనర్లకి బెజవాడ పోలీసుల వార్నింగ్
Vijayawada: అధిక ధరలకు కూల్ డ్రింక్స్, ఫుడ్ ఐటమ్స్ విక్రయాలు - విజిలెన్స్ ఆకస్మిక దాడులతో సీన్ తారుమారు
Pavitra Lokesh: నరేష్ ఎవరో తెలీదు, ఆ ఆధారం ఒక్కటే లేదు, పవిత్ర నన్ను క్షమించు - భర్త సుచేంద్ర ప్రసాద్
TRS Again Sentiment Plan : ఈ సారి అదే బ్రహ్మాస్త్రాన్ని వాడనున్న టీఆర్ఎస్ ! అదొక్కటే మార్పు - మిగతా అంతా సేమ్ టు సేమ్ !
Cooking Oil Prices: గుడ్ న్యూస్! భారీగా తగ్గనున్న వంట నూనెలు, పప్పుల ధరలు!
Tapsee Pannu: తాప్సీలా మీరు నిల్చోగలరా? అమ్మో కష్టమే