By: ABP Desam | Updated at : 01 May 2022 04:57 PM (IST)
యువకుడి దారుణ హత్య
Kakinada Youth Killed in Samarlakota in Kakinada District: ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. పట్ట పగలే ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. అది కూడా పుట్టినరోజు నాడు ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. నిందితుడు ఓ యువకుడ్ని వేట కత్తితో నరికి హత్య చేశాడు. ఈ విషాదం కాకినాడ జిల్లా సామర్లకోటలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. కేసు నమోదు చేసిన సామర్లకోట పోలీసులు విచారణ చేపట్టారు. అయితే నిందితుడు పీఎస్‌లో లొంగిపోయి తానే శివను హత్య చేసినట్లు అంగీకరించాడు.
పుట్టినరోజు నాడే పట్ట పగలే దారుణం..
సామర్లకోటకు చెందిన యువకుడు శివ పుట్టినరోజు నేడు. బర్త్ డే సందర్భంగా శివ మూవీ చూసేందుకు థియేటర్‌కు వెళ్లాడు. కొందరు గుర్తుతెలియని దుండగులు శివపై ఒక్కసారిగా కత్తులు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. కత్తితో నరకడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు శివ. కొంతసేపటికే అతడు ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. శివను హత్య చేసిన నిందితుడ్ని మణి అని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
తలాటుర్ శివ అనే యువకుడు సామర్లకోటలోని అమ్మమ్మ కాలనీలో నివాసం ఉంటున్నాడు. నేడు తన పుట్టినరోజు కావడంతో సినిమా చూసేందుకు స్థానిక విఘ్నేశ్వర థియేటర్‌కు వెళ్లాడు. శివను హత్య చేసేందుకు ముందుగానే ప్లాన్ వేసుకున్న నిందితుడు అతడ్ని ఫాలో అయ్యాడు. షర్టులో వేట కత్తిని పెట్టుకుని మణి థియేటర్ వద్దకు వెళ్లాడు. అతడితో పాటు మరికొందరు యువకులు ఒక్కసారిగా శివపై రాడ్లు, వేట కత్తితో దాడి చేశారు. మణి, అతడి స్నేహితులు జరిపిన దాడిలో శివ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడికక్కడే కొంతసేపటికే శివ ప్రాణాలు వదిలాడని స్థానికులు చెబుతున్నారు.
హత్య చేసిన అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిందితుడు మణి లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరికి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందని, ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య గత కొంతకాలం నుంచి వివాదం ఉందని గుర్తించారు. ఆ మహిళ కేవలం తనకు మాత్రమే దక్కాలని భావించిన నిందితుడు మణి.. శివపై కక్ష పెంచుకున్నాడు. పుట్టినరోజు నాడే హతమార్చాలని భావించిన మణి తన ప్లాన్ ప్రకారం వేట కత్తితో వెళ్లి దాడిచేసి శివను దారుణంగా హత్యచేశాడు.
Hyderabad News : బీజేపీ కార్పొరేటర్ ఆర్డర్ చేసిన బిర్యానీలో బల్లి, హోటల్ నిర్వాహకుడికి నోటీసులు
Nandyal News : నంద్యాలలో నిత్య పెళ్లి కూతురు, విడాకులు తీసుకోకుండా మూడు పెళ్లిళ్లు, నాల్గో పెళ్లికి సిద్ధం!
Srikalahasti News : శ్రీకాళహస్తి ఫైనాన్స్ సంస్థలో భారీ చోరీ, ఉద్యోగినిని కట్టేసి రూ. 80 లక్షల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు
Hyderabad Crime : ఇళ్లు రెంట్ కు చూపిస్తానని చెప్పి యువతిపై అత్యాచారయత్నం, వాట్సాప్ గ్రూప్ ద్వారా ట్రాప్!
Karimnagar News : వడ్డీ వ్యాపారుల వేధింపులతో యువకుడు ఆత్మహత్య- కలచివేస్తున్న సూసైడ్ నోట్
Gold Rate Today 28th May 2022: పసిడి ప్రియులకు షాక్ - నేడు పెరిగిన బంగారం ధర, రూ.600 ఎగబాకిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ
RR Vs RCB Highlights: బెంగళూరును బాదేసిన బట్లర్ - రెండోసారి ఫైనల్‌కు రాజస్తాన్!
Horoscope Today 28th May 2022: ఈ రాశులవారు తమ పనిని పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం