By: ABP Desam | Updated at : 01 May 2022 03:54 PM (IST)
బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్
Three people arrested in Woman Molested in Repalle: Bapatla SP Vakul Jindal: రేపల్లె రైల్వేస్టేషన్‌లో వివాహిత గ్యాంగ్ రేప్ కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. ఈ అత్యాచార కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు యువకులు కాగా, ఓ మైనర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విజయకృష్ణ, నిఖిల్ అనే యువకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఓ మైనర్ బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ నిందితుల అరెస్టు వివరాలు మీడియాకు వెల్లడించారు. నిందితులపై సెక్షన్ 376(డీ), 394, 307, R/w 34 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎలాంటి రాజకీయ కోణం లేదని బాపట్ల ఎస్పీ స్పష్టం చేశారు.
తమ పిల్లలతో భార్యాభర్తలు రేపల్లె రైల్వేస్టేషన్‌కు అర్ధరాత్రి చేరుకోగా, ఒంటిగంట సమయంలో అత్యాచార ఘటన జరిగింది. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో కేసు దర్యాప్తు చేశామని, నిందితుడు చొక్కా మార్చుకున్న ప్రదేశాన్ని గుర్తించినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. బాధితురాలి భర్త పోలీస్ స్టేషన్‌కు రాగానే పోలీసులు రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. ఈ సామూహిక అత్యాచార కేసులో నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని ఎస్పీ వెల్లడించారు.
టైమ్ అడిగే వంకతో గొడవ..
అర్ధరాత్రి రేపల్లె రైల్వే స్టేషన్‌లో నిద్రిస్తున్న బాధితురాలి భర్త వద్దకు నిందితులు వచ్చారు. టైమ్ అడిగి బాధితురాలి భర్తతో వివాదం పెట్టుకున్నారు. తనకు వాచీ లేదని చెప్పడంతో అతడిపై దాడిచేసి అతడి వద్ద నుంచి రూ.750 లాక్కున్నారు. అంతటితో ఆగని నిందితులు ఆ వ్యక్తి భార్యను జుట్టు పట్టుకుని ప్లాట్ ఫారమ్ చివరకు లాక్కెళ్లారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆమె భర్తపై దాడి చేయడంతో అతడు స్థానికుల సాయంతో రేపల్లె పోలీసులను ఆశ్రయించారు. జరిగిన విషయాన్ని తెలిపి, ఫిర్యాదు చేయడంతో పాటు తమకు న్యాయం చేయాలని కోరారు. పోలీసు జాగిలాలు, ఇతర ఆధారాల ద్వారా నిందితులను పోలీసులు ఆదివారం ఉదయం గుర్తించినట్లు వివరించారు.
బాధితులకు మంత్రి పరామర్శ..
రేపల్లె రైల్వేస్టేషన్ లో అత్యాచారానికి గురైన బాధితురాలు, ఆమె భర్తను మంత్రి మేరుగు నాగార్జున, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ కుమారుడు మోపిదేవి రాజీవ్ ప్రభుత్వ హాస్పటల్ లో పరామర్శించారు. పోలీసులను కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి మేరుగు. తన తండ్రి మోపిదేవి వెంకటరమణ తరుపున బాధిత కుటుంబానికి రూ.50 వేలు అందించారు మోపిదేవి రాజీవ్.
Chandra Babu Comments on Tickets: తెలంగాణ ఫలితాలతో చంద్రబాబు అలర్ట్ -అలాంటి వారికి డోర్స్ క్లోజ్
Breaking News Live Telugu Updates: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
APPMB: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 170 టీచింగ్ పోస్టులు, వాక్ఇన్ తేదీలు ఇలా
APPSC Group-1: ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా
AP Tenth: 'టెన్త్' విద్యార్థులకు అలర్ట్, వివరాల్లో తప్పులుంటే మార్చుకోవచ్చు!
Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే
Mangalavaaram: ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్న ‘మంగళవారం’ - ఎప్పుడు, ఎక్కడంటే?
Infinix Smart 8 HD: రూ.ఆరు వేలకే స్మార్ట్ ఫోన్ - భారీ బ్యాటరీ, పెద్ద డిస్ప్లే - ఇన్ఫీనిక్స్ కొత్త ఫోన్ వచ్చేసింది!
Telangana Assembly : 15న స్పీకర్ ఎన్నిక - విపక్షాలు పోటీ పెడతాయా ?
/body>