బొట్టు పెట్టుకుని స్కూల్‌కి వచ్చినందుకు కొట్టిన టీచర్, విద్యార్థి ఆత్మహత్య
Jharkhand Student Sucide: బొట్టు పెట్టుకుని స్కూల్‌కి వచ్చినందుకు టీచర్ కొట్టిందన్న అవమానంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
Jharkhand Student Sucide:
ఝార్ఖండ్‌లో ఘటన..
ఝార్ఖండ్‌లో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. టీచర్ చెంపదెబ్బ కొట్టిందన్న అవమానంతో ప్రాణాలు తీసుకుంది. బొట్టు పెట్టుకుని స్కూల్‌కి వచ్చినందుకు టీచర్ విద్యార్థినిని కొట్టినట్టు పోలీసులు చెబుతున్నారు. మృతురాలి నుంచి సూసైడ్ నోట్‌ని స్వాధీనం చేసుకున్నారు. టీచర్ టార్చర్ చేయడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు అందులో రాసింది విద్యార్థిని.
"ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్టు మాకు సమాచారం అందింది. ఆమె దగ్గర ఓ సూసైడ్ నోట్‌ని స్వాధీనం చేసుకున్నాం. స్కూల్లో టీచర్ వేధించడం వల్లే సూసైడ్ చేసుకుంటున్నట్టు అందులో రాసింది. ఈ నోట్ ఆధారంగా నిందితురాలిని అరెస్ట్ చేశాం. తదుపరి విచారణ కొనసాగిస్తాం"
- పోలీసులు
Jharkhand | A class 10 student died by suicide allegedly after being slapped by a teacher for coming to school with a 'bindi' on her forehead
— ANI (@ANI) July 12, 2023
We received information that a student has died by suicide. A suicide note has been recovered in which she alleged that she was tortured… pic.twitter.com/i5du989GKT
తరచూ విద్యార్థుల ఆత్మహత్యలు..
ఈ ఏడాది ఏప్రిల్‌లో చెన్నైలో ఓ ఐఐటీ విద్యార్థి తన రూమ్‌లోనే ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. "ఎవరికీ నాతో మాట్లాడే టైమ్ లేదు. అందరూ బిజిగానే ఉన్నారు" అని ఫ్రెండ్స్‌తో తరచూ చెప్పే వాడని తెలుస్తోంది. కెమికల్ ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న 20 ఏళ్ల స్టూడెంట్ రూమ్‌లో ఓ నోట్ కూడా దొరికిందని పోలీసులు వెల్లడించారు. అయితే...దానిపై డేట్ కానీ, సంతకం కానీ లేవు. తనతో బాగా మాట్లాడిన ఫ్రెండ్స్‌కి మాత్రం థాంక్స్ చెప్పాడు ఆ స్టూడెంట్. అకాడమిక్స్‌లో బ్రిలియంట్‌గా పేరు తెచ్చుకున్న విద్యార్థి ఒత్తిడిని తట్టుకోలేకపోయాడని, అందుకే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. IIT మద్రాస్‌లో ఇలా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం ఈ ఏడాదిలో ఇది నాలుగోసారి. దీనిపై యాజమాన్యాన్ని ప్రశ్నించగా..."ఆ విద్యార్థికి ఆత్మహత్యకు కారణమేంటో తెలియదు" అని సమాధానమిచ్చింది. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పింది.
ఇప్పటికే "be happy" పేరిట ఓ వెబ్‌సైట్‌ని నడుపుతోంది ఐఐటీ మద్రాస్. స్ట్రెస్ నుంచి విద్యార్థులను బయట పడేసేందుకు ఇది ఉపయోగపడుతోందని వివరిస్తోంది. దీంతో పాటు పాజిటివ్ థింకింగ్ పెంచేందుకు Kushal faculty programme మొదలు పెట్టింది. ఇటీవలే ఇదే క్యాంపస్‌లో ఓ పీహెచ్డీ స్కాలర్ అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఐటీలో సీట్ కోసం చాలా కష్టపడతారు విద్యార్థులు. అవసరమైన దానికంటే ఎక్కువ ఒత్తిడి తీసుకుంటారు. కోచింగ్ సెంటర్లు వాళ్లను దారుణంగా రుద్దుతాయి. అయితే...ఒక్కసారి సీట్ వచ్చిన తరవాత అక్కడి వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఐదేళ్ల పాటు అక్కడే ఉండడాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ప్రస్తుతానికి ఐఐటీ మద్రాస్ ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటోంది.
Also Read: North India Floods: ఉత్తరాదిని ముంచెత్తుతున్న వరదలు, కళ్ల ముందే కొట్టుకుపోతున్న ఇళ్లు