అన్వేషించండి

North India Floods: ఉత్తరాదిని ముంచెత్తుతున్న వరదలు, కళ్ల ముందే కొట్టుకుపోతున్న ఇళ్లు

North India Floods: ఉత్తరాది రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి.

North India Floods: 

మూడు రోజులుగా భారీ వర్షాలు..

ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నాయి. జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. హిమాచల్‌ప్రదేశ్‌లోనే వరదల కారణంగా 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్‌లు కొనసాగుతున్నాయి. హిమాచల్‌లోని కసోల్, మణికరన్, ఖీర్ గంగ, పుల్గా ప్రాంతాల్లో వరదలు  పోటెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుకు ఏరియల్ సర్వే నిర్వహించారు. కులూ ఏరియాలో దాదాపు 40 షాప్‌లు, 30 ఇళ్లు వరదల ధాటికి కొట్టుకుపోయాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. లహౌల్, స్పితి, మనాలిలో చిక్కుకుపోయిన టూరిస్ట్‌లనూ కాపాడారు. హాస్పిటల్‌లో వారికి చికిత్స అందిస్తున్నారు. వాళ్లందరినీ సురక్షితంగా రాష్ట్రం దాటిస్తామని సీఎం సుఖ్వీందర్ హామీ ఇచ్చారు. చంద్రతల్ ప్రాంతంలో దాదాపు 250 మంది టూరిస్ట్‌లు వరదల్లో చిక్కుకుపోయారు. మనాలిలో 300 మంది వరదల్లో చిక్కుకున్నారు. ఇక యూపీలోనూ దాదాపు ఇవే పరిస్థితులున్నాయి. హిమాచల్ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్.  వరదల్లో చిక్కుకున్న వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు యూపీ సర్కార్ కూడా సాయం చేస్తోంది. మొత్తం 18 రాష్ట్రాల్లో వరద ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటి వరకూ 8,815 ధ్వంసం కాగా... 47,225 హెక్టార్ల పంట నష్టం వాటిల్లింది. 

కొట్టుకుపోతున్న వంతెనలు..

ఉత్తరాఖండ్‌లో వరదల ధాటికి కొండ చరియలు విరిగి పడుతున్నాయి. గంగోత్రి నేషనల్ హైవేపై కొండ చరియలు విరిగి పడడం వల్ల రోడ్  బ్లాక్ అయింది. మూడు వాహనాలు వరదల్లో కూరుకుపోయాయి. ఈ ప్రమాదంలో 5గురు యాత్రికులు చనిపోయారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. జుమ్మాగడ్‌లో ఉన్నట్టుండి వరదలు ముంచెత్తాయి. చమోలి జిల్లాలో ఓ వంతెన కొట్టుకుపోయింది. ఇండియా-టిబెట్‌ని కనెక్ట్ చేసే దారి మూసుకుపోయింది. సరిహద్దు గ్రామాలకు చేరుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. హరియాణా పంజాబ్‌లోనూ వరదలు సవాల్‌గా మారాయి. రెండ్రోజుల పాటు కురిసిన వర్షాలకు భారీ నష్టం వాటిల్లింది. రూప్‌నగర్, పటియాలా, మొహాలి, అంబాలా, పంచ్‌కుల ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు. హోషియార్‌పూర్‌లో ఇల్లు కూలిన ఘటనలో ఓ 75 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. సుల్తాన్‌పూర్‌లో వరద నీటిలో ఓ యువకుడు కొట్టుకుపోయాడు. ఓ రెసిడెన్షియల్ స్కూల్‌లోని 370 మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. హరియాణాలోని గగ్గర్ నది పోటెత్తుతోంది. గత కొన్నేళ్లలో ఎప్పుడూ లేని విధంగా చెరువులు, నదులు ప్రమాదకర స్థాయిలో ముంచెత్తుతున్నాయి. ఢిల్లీలోని యమునా నది 206 మీటర్ల లెవెల్ దాటి ప్రవహిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజల్ని తరలిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Embed widget