News
News
X

Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణం, యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి!

Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు.

FOLLOW US: 
 
Hyderabad Crime : హైదరాబాద్ లో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఓ యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలో ఈ దారుణ ఘటన జరిగింది. ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు ముషిరాబాద్‌కు చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. ఆమె డిగ్రీ చదువుతోంది. యువతిపై దాడికి పాల్పడిన నిందితుడు రంజిత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

అసలేం జరిగింది? 

హైదరాబాద్ లో కత్తి దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల పరువు హత్యలు జరగగా, తాజాగా ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.  ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలో ప్రేమకత్తి పంజా విసిరింది. ముషీరాబాద్ బోలక్‌పూర్‌కు చెందిన ఓ యువతి, రంజిత్ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. శనివారం సాయంత్రం ఉస్మానియా యూనివర్సిటీలోని మంజీరా హాస్టల్ సమీపంలో వీరిద్దరూ కలుసుకున్నారు. ఇద్దరి మధ్య ఓ విషయంపై గొడప జరిగింది. ఈ గొడవతో రంజిత్ ఆగ్రహానికి గురై తనతో తెచ్చుకున్న ఆయుధంతో యువతిపై దాడి చేశాడు. ఆమె చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి. దాడి అనంతరం రంజిత్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమీప హాస్టల్లో ఉన్న విద్యార్థులు విషయాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలపాలైన యువతిని కాచిగూడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు రంజిత్ కోసం గాలిస్తున్నారు.  ప్రస్తుతం యువతి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు అంటున్నారు. ఆమె కుడి చేతికి గాయం కావడంతో చికిత్స చేస్తున్నట్లు తెలిపారు.  

పాతబస్తీ సంతోష్ నగర్ పీఎస్ పరిధిలో దారి దోపిడీ

News Reels

హైదరాబాద్ పాతబస్తీ సంతోష్ నగర్ పీఎస్ పరిధిలో దారి దోపిడీ జరిగింది. బైక్ పై వెళుతున్న వైన్స్ షాప్ క్యాషియర్ నుంచి రూ.6 లక్షల నగదు బ్యాగ్ ను  గుర్తు తెలియని యువకులు దోచుకుపోయారు. సంతోష్ నగర్ ప్రధాన రహదారిపై ఉన్న శ్రీ లక్ష్మి వైన్స్ ను శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మూసివేసిన క్యాషియర్ నవీన్  కలెక్షన్ డబ్బుల బ్యాగ్ తో తోటి సిబ్బందితో బైక్ పై ఇంటికి బయలు దేరారు. వైన్స్ షాపునకు సుమారు 50 అడుగుల దూరంలో వెనుకగా హోండా యక్టీవాపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా క్యాషియర్ చేతిలో బ్యాగ్ ను లాక్కొని పారిపోయారు. వెంటనే అప్రమత్తమైన వైన్ షాపు సిబ్బంది బైకుపై వెంబడించగా కొంత దూరం వెళ్లాక దుండగులు హోండా యాక్టివాను వదిలి నాలలో దూకి పారిపోయారు. ఈ ఘటనపై సంతోష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ ఫ్యూటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : SI Suspension: బాలికపై అత్యాచారం, ఆపై తల్లీకూతురు ఆత్మహత్య - ఎస్ఐపై సస్పెన్షన్ వేటు

Also Read : TSRTC Driver Suicide: అధికారుల వేధింపులు భరించలేక ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

Published at : 25 Sep 2022 03:08 PM (IST) Tags: Hyderabad News Osmania University Knife Attack TS News lover attacked

సంబంధిత కథనాలు

Tirupati Crime : ఏపీలో మరో పరువు హత్య?- చంద్రగిరి యువతి ఆత్మహత్య కేసులో ట్విస్ట్!

Tirupati Crime : ఏపీలో మరో పరువు హత్య?- చంద్రగిరి యువతి ఆత్మహత్య కేసులో ట్విస్ట్!

AP Road Accidents : కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం, లారీలు ఢీకొని ముగ్గురు సజీవదహనం!

AP Road Accidents : కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం, లారీలు ఢీకొని ముగ్గురు సజీవదహనం!

Karnataka Crime News: 'దృశ్యం-2' సినిమాను దింపేశారుగా! లవర్‌తో కలిసి భర్తను చంపేసి!

Karnataka Crime News: 'దృశ్యం-2' సినిమాను దింపేశారుగా! లవర్‌తో కలిసి భర్తను చంపేసి!

అమ్మాయిలూ 9490617444 నెంబర్‌ సేవ్ చేసుకోండి- ఆకతాయిల తాట తీయండి

అమ్మాయిలూ 9490617444 నెంబర్‌ సేవ్ చేసుకోండి- ఆకతాయిల తాట తీయండి

పక్కాగా రెక్కీ- గురువారం బంగారం వస్తుందని తెలిసి దోపిడీ - హైద్రాబాద్‌లో అంతరాష్ట్రా ముఠా హల్చల్

పక్కాగా రెక్కీ- గురువారం బంగారం వస్తుందని తెలిసి దోపిడీ - హైద్రాబాద్‌లో అంతరాష్ట్రా ముఠా హల్చల్

టాప్ స్టోరీస్

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

Nellore Janasena : నెల్లూరులో జనసేన పరిస్థితి ఏంటి? పార్టీ నేతలతో నాగబాబు భేటీ!

Nellore Janasena : నెల్లూరులో జనసేన పరిస్థితి ఏంటి?  పార్టీ నేతలతో నాగబాబు భేటీ!

కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ - నయా సినిమా షురూ!

కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ - నయా సినిమా షురూ!

MP GVL Narsimharao : ఏప్రిల్ నాటికి ఏపీలో 5G సేవలు, విశాఖ నుంచి మూడు వందే భారత్ ట్రైన్స్ - ఎంపీ జీవీఎల్

MP GVL Narsimharao : ఏప్రిల్ నాటికి ఏపీలో 5G సేవలు, విశాఖ నుంచి మూడు వందే భారత్ ట్రైన్స్ - ఎంపీ జీవీఎల్