Road Accident: రేణిగుంటలో రోడ్డు ప్రమాదం - హైదరాబాద్‌కు చెందిన దంపతులు దుర్మరణం
Renigunta Accident: తిరుపతి రేణిగుంట సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు ప్రాణాలు కోల్పోయారు. వీరు హైదరాబాద్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Couple Died In Road Accident In Renigunta: తిరుపతి జిల్లాలో (Tirupati District) సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన దంపతులు దుర్మరణం పాలయ్యారు. రేణిగుంట (Renugunta) - కడప ప్రధాన రహదారిలోని కుక్కలదొడ్డి వద్ద ఓ ప్రైవేట్ బస్సు కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో పటాన్‌చెరుకు చెందిన సందీప్ (45), అంజలీదేవి (40) దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Mining in Mailaram: మైనింగ్ వద్దంటూ రైతుల పోరు.. పోలీసుల అరెస్ట్‌తో గ్రామంలో ఉద్రిక్తత



















