Road Accident: గ్యాస్ సిలిండర్ లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా, పేలుడు జరగకపోవడంతో తప్పిన ముప్పు
Andhra Pradesh News : గ్యాస్ సిలిడర్ల లోడ్ తో వెళ్తున్న ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. కడప జిల్లాలోని వేంపల్లి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
Gas Cylinder load lorry overturned in Kadapa district | కడప: వేంపల్లి సమీపంలోని SNR కళ్యాణ మండపం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంతపురం నుంచి లక్కిరెడ్డిపల్లికి వెళ్తున్న హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ లోడ్ తో వెళ్తున్న లారీ ఒక్కసారిగా బోల్తా పడటంతో స్థానికులందరూ భయాందోళనకు గురయ్యారు. సుమారుగా లారీలో వందల సిలిండర్లో లోడు ఉండటం ఒక్కసారిగా రోడ్డుపైన బోల్తాపడడంతో ఎక్కడ గ్యాస్ లీక్ అయి ప్రమాదం జరుగుతుందో అని భయపడ్డారు. అదృష్టవశాత్తు లారీ బోల్తా పడినప్పటికీ గ్యాస్ లీక్ అవ్వకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలం వద్దకు చేరుకున్న ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. అయితే ఈ ఘటన ఉదయం పూట జగడంతో డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నాడా అన్న వదంతులు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనాప్పటికీ హెచ్పి గ్యాస్ సిలిండర్ల లోడ్ తో వెళ్తున్న లారీ రోడ్డు ప్రమాదం గురికావడం గ్యాస్ లీక్ అవ్వకపోవడంతో పెను ప్రమాదమే తప్పినట్లు అయింది రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం స్వాధీనం
అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో లారీ కాటా దగ్గర 30 టన్నుల PDS బియ్యం లారీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఉండ్రాజవరం నుండి ఖమ్మంకి రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న రెవిన్యూ అధికారులు విసన్నపేట వద్ద లారీని ఆపి, బియ్యం పట్టుకున్నారు. రెవిన్యూ పిడిఎస్ డిటి నాగరాజు అధ్యర్యంలో అధికారులు లారీ సీజ్ చేసి అందులోని రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పౌరసరఫరాల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజునుంచే నాదెండ్ల మనోహర్ రేషన్ సరుకుల, నాణ్యత విషయంలో చర్యలు తీసుకుంటున్నారు.
Also Read: Crime News: శృంగారం అయిపోగానే తల కత్తిరించి తీసుకుపోయింది - ఇది దృశ్యం కాదు అదృశ్యం !
Also Read: Kurnool News: ‘డెలివరీ కోసం వెళితే ప్రాణం తీశారు’ - హాస్పిటల్ ఎదుట కుటుంబసభ్యుల ఆందోళన