Crime News: శృంగారం అయిపోగానే తల కత్తిరించి తీసుకుపోయింది - ఇది దృశ్యం కాదు అదృశ్యం !
Murder: ఐఐటీ స్టూడెంట్ తలలేని మొండెం దొరికింది. అసలేం జరిగిందా అని ఆరా తీసిన పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు తెలిశాయి.
First they had sex and then later the girlfriend cut off her boyfriend neck: అసలేం జరిగిందో చెప్పు.. గద్దించాడు ఇన్స్‌పెక్టర్. నిండా ఇరవై ఏళ్లు కూడా లేని ఆ అమ్మాయి భయం భయంగా అమాయకంగా ముఖంగా పెట్టి "నాకేం తెలియదు సార్... ప్లీన్ నన్ను వదిలి పెట్టండి" అని బతిమాలుతోంది. కానీ ఇన్స్ పెక్టర్ ఆమె ఫోన్ కాల్‌లిస్టులో ఉన్న ఓ ఫోన్ నెంబర్ చూపించండంతో మాటలు పడిపోయాయి. ఇక దొరికిపోయానని ఆమె అనుకుంది. అలాంటి సిట్యూయేషన్ కోసమే చూస్తున్న పోలీసులు మిగతా ప్రక్రియ పూర్తి చేశారు. ఆమెతో నిజాలు చెప్పించారు. కానీ ఇరవై ఏళ్లు కూడా నిండని అమ్మాయి చెప్పే మాటలు వింటున్న పోలీసులకు కూడా చెమటలు పట్టాయి. అంత భయంకరంగా ఆ నేరం చేసింది మరి.
యూపీలోని మొరాదాబాద్‌లో తల లేని మొండెన్ని ఓ చెరుకుతోటలో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు. ఆ తలలేని శరీరాన్ని మార్చురీకి తరలించారు. ఆ తర్వాత తన కుమారుడు పందొమ్మిదేళ్ల సోను కాలేజీకి అని వెళ్లి మళ్లీ రాలేదని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానంతో పోలీసులు ఆ బాడీని చూపించడంతో అది తన కుమారుడిదేనని గుర్తించి కుప్పకూలిపోయాడు. తనకు ఎవరూ శత్రువులు లేరని తన కుమారుడ్ని ఎందుకు అలా చంపారో తెలియదని సోను తండ్రి బావురుమన్నాడు.
కాళ్లు మొక్కి మరీ కాల్చి చంపేశారు - దీపావళి రోజున దారుణం, ఢిల్లీలో ఘటన
పోలీసులు సోను కాల్ లిస్ట్ ను వెలికి తీయడంతో చివరి కాల్ ఓ అమ్మాయిదని తేలింది. ఆ అమ్మాయిని పిలిపించి ప్రశ్నించడంతో మొదట తనకు ఏమీ తెలియదని బుకాయించింది. కానీ తర్వాత మాత్రం అసలు విషయం చెప్పింది. తానే సోను ను కాల్ చేసి చెరుకుతోట వద్దకు పిలిపించానని.. తాము ఇద్దరం చెరుకుతోటలో శృంగారంలో పాల్గొన్నామని ఆ తర్వాత అతన్ని హత్య చేశానని మెడను కత్తిరించి తలను సంచిలో పెట్టుకుని వెళ్లిపోయానని చెప్పింది.