అన్వేషించండి

Crime News: కాళ్లు మొక్కి మరీ కాల్చి చంపేశారు - దీపావళి రోజున దారుణం, ఢిల్లీలో ఘటన

Delhi News: ఇద్దరు నిందితులు బైక్‌పై వచ్చి ఓ వ్యక్తి కాళ్లు మొక్కి మరీ అతనిపై కాల్పులు జరిపారు. ఈ దారుణ ఘటన ఢిల్లీలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి.

Man Killed While Diwali Celebrations In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) దీపావళి పండుగ రోజున తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బైక్‌పై వచ్చిన ఇద్దరు నిందితులు మంచిగా మాట్లాడినట్లే మాట్లాడి తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలోని షహదర ప్రాంతంలో ఈ హత్యలు జరిగాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి ఆకాశ్ శర్మ (44) అనే వ్యక్తి తన కుమారుడు, మేనల్లుడితో కలిసి ఇంటి బయట దీపావళి వేడుకలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అప్పుడే బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు వీరి ఇంటి ముందు ఆగారు. వీరిలో ఓ టీనేజర్ శర్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. అనంతరం పక్కనే నిలబడిన మరో వ్యక్తి వెంటనే తుపాకీ తీసుకుని 5 రౌండ్ల కాల్పులు జరిపడంతో శర్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. 

వెంబడించిన వ్యక్తిని కూడా..

కాల్పులు జరిగిన వెంటనే తేరుకున్న శర్మ మేనల్లుడు షూటర్లను వెంబడించాడు. ఈ క్రమంలో నిందితులు అతనిపైనా కాల్పులు జరపగా ప్రాణాలు కోల్పోయాడు. గాయాలపాలైన శర్మ కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు.

అయితే, బైక్‌పై వచ్చిన టీనేజర్.. డబ్బు అప్పుగా ఇచ్చాడని, అభిషేక్ శర్మ దాన్ని తిరిగి ఇవ్వలేదని పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. దీనికి సంబంధించి మృతుడిపై ఇదివరకే కేసు నమోదైనట్లు తెలిపారు. ఈ కేసులో సదరు టీనేజర్‌ను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. హత్య కోసం అతను సుపారీ ఇచ్చాడని చెప్పారు.

Also Read: Australian police: భారత మహిళ హత్య కేసులో క్లూ ఇస్తే రూ. 8 కోట్లు - ఆస్ట్రేలియా పోలీసుల ఆఫర్ - ఎంత క్లిష్టమైన కేసు అంటే ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Deepfake Scam: డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
Embed widget