Australian police: భారత మహిళ హత్య కేసులో క్లూ ఇస్తే రూ. 8 కోట్లు - ఆస్ట్రేలియా పోలీసుల ఆఫర్ - ఎంత క్లిష్టమైన కేసు అంటే ?
Bengaluru techie murder: 2015లో ఓ భారత మహిళ ఆస్ట్రేలియాకు హత్యకు గురైంది. ఇప్పటి వరకూ ఆ కేసులో హంతకులెవరో కనిపెట్టలేకపోయారు. ఎవరైనా సమాచారం ఇస్తే రూ.8 కోట్లు ఇస్తామని ప్రకటించారు.
Australian police offers over Rs 8 crore reward for information : 2015లో జరిగిన ఓ మర్డర్ కేసును ఆస్ట్రేలియా పోలీసులు ఇప్పటికీ చేధించలేకపోయారు. దీన్ని వారు అవమానంగా భావిస్తున్నారు. అందుకే ఈ కేసులో సమాచారం ఇచ్చిన వారికి రూ. ఎనిమిది కోట్లు ఇస్తామని ప్రకటించారు. అసలు ఈ కేసు ఎంటి ? ఎందుకు పరిష్కరించలేకపోయారు ? అనుమానితులు ఉన్నా ఎందుకు సమాచారాన్ని సేకరించలేకపోయారు ?
2015లో ప్రభా అరుణ్ కుమార్ అనే మహిళ న్యూ సౌత్ వేల్స్‌లో దారుణ హత్యకు గురైంది. ఫోన్ మాట్లాడుకుంటూ రోడ్డు మీద వెళ్తున్న ఆమెను ఓ దుండగుడు అటకాయించాడు. దారుణంగా హింసలు పెట్టి చంపేసి పరారయ్యాడు. ప్రభా అరుణ్ కుమార్ ఫోన్ లో మాట్లాడుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కానీ హత్య జరిగింది మాత్రం సీసీ కెమెరా కవర్ చేయిని ప్రాంతంలో.
దొంగ గారూ ప్లీజ్ - బతిమాలుకుంటున్న ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ! ఎంత కష్టం వచ్చిందంటే ?
న్యూసౌత్ వేల్స్ పోలీసుల విచారణలో ఒక్క లీడ్ కూడా దొరకలేదు. హత్యకు గురైన ప్రభ ఓ ఇండియన్ ఐటీ కంపెనీ తరపున ప్రాజెక్టు పని మీద వచ్చారు. కుటుంబం అంతా బెంగళూరులో ఉంటుంది. ఆమె భర్త కూడా బెంగళూరులో ఉంటారు. హత్యకు గురయినప్పుడు ఆమె ఫోన్‌లో మాట్లాడుతోంది తన భర్తతోనే. హత్య తర్వతా లాస్ట్ కాల్ ప్రభభర్త అరుణ్ కుమార్ ది కావడంతో న్యూ సౌత్ వేల్స్ పోలీసులు ఆయనను కూాడ ప్రశ్నించారు. తాను ఫోన్ మాట్లాడానని.. తన భార్యను హత్య చేస్తున్నప్పుడు ఆమె ఆర్తనాదాలు విన్నానని తెలిపారు. అయితే ఆయన తీరు పోలీసులకు అనుమానాస్పదంగానే అనిపించింది. అప్పటికే ఆయనకు మరో గర్ల్ ఫ్రెండ్ ఉందని గుర్తించారు. అయితే ఆ కేసులో ఆయనకు వ్యతిరేకంగా లీడ్ దొరకలేదు. దాంతో పోలీసులు ఏమీ చేయలేకపోయారు.
దేశ విభజన సమయంలో తప్పిపోయాడు - 77 ఏళ్ల తర్వాత కుటుంబం దగ్గరకు - చోటాసింగ్ లైఫ్ సినిమా స్టోరీనే
ఈ కేసులో ఎప్పటికప్పుడు కొత్త సమాచార వస్తే విశ్లేషించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ..వర్కవుట్ కావడం లేదు. ఎవరైనా సుపారీ మర్డర్ చేయించారా లేకపోతే.. అత్యాచారం చేసేందుకు ప్రయత్నించి కుదరక చంపేశారా లేకపోతే దోపీడీ కోసం ప్రయత్నించి చంపేశారా అన్నదానిపై ఎలాంటి సమాచారం పోలీసులకు లభించలేదు. పాత నేరస్తులు సహా అందర్నీ ప్రశ్నించి చివరికి అలసిపోయారు.
ఇంక కాలం ప్రభా అరుణ్ కుమార్ మర్డర్ కేసును పరిష్కరించలేపోవడాన్ని అక్కడి పోలీసులు నామోషీగా ఫీలయ్యారు. వెంటనే ..హంతకుల్ని పట్టించే లీడ్ ఇస్తే రూ. ఎనిమిది కోట్లు ఇస్తామని ప్రకటించారు. మరి సినిమాల్లోగా ఇప్పుడైనా వారికి నమ్మకమైన హత్య సమాచారం ఎవరైనా ఇస్తారా? ప్రభా అరుణ్ కుమార్ హత్య మిస్టరీ వీడుతుందా ?