Narsaraopet Murders: కోర్టు వాయిదాకి వస్తే పీకలు కోసి చంపేశారు - నర్సరావుపేటలో జంట హత్యలు
Crime: నర్సరావుపేటలో కోర్టు వాయిదాకు వచ్చిన తండ్రి కొడుకుల్ని చంపడం సంచలనంగా మారింది. బాపట్ల దగ్గర వారి మృతదేహాలను పడేశారు.

Father and son Murder : చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరైన తండ్రీకొడుకులను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేసిన ఘటన నర్సరావుపేటలో జరిగింది. వీరస్వామిరెడ్డి ఆయన కుమారుడు ప్రశాంత్ రెడ్డి బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూంటారు. వీరిపై నర్సరావుపేటలో చెక్ బౌన్స్ కేసు నమోదు అయింది. ఆ కేసులో విచారణకు హాజరయ్యారు. వారు వస్తారని తెలిసి ముందుగానే పక్కాగా ప్లాన్ చేసి.. కిడ్నాప్ చేసి.. చంపేశారు. వారి మృతదేహాలను బాపట్ల జిల్లా సంతమాగులూరు సమీపంలోని ఓ ప్రైవేట్ వెంచర్‌లో పడేశారు.
గడ్డం అనిల్‌కుమార్‌రెడ్డి అనే మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి.. సుపారి గ్యాంగులతో ఈ పని చేయించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరస్వామి రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, బాపట్ల జిల్లా సంతమాగులూరు గ్రామానికి చెందినవారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం నిమిత్తం చాలా సంవత్సరాలుగా బెంగళూరులో నివాసం ఉంటున్నారు. జులై 22, 2025న, చెక్ బౌన్స్ కేసు సంబంధించి నరసరావుపేట కోర్టుకు హాజరయ్యారు. కోర్టు విచారణ అనంతరం ఓ హోటల్‌లో టీ తాగుతుండగా వారిని గుర్తు తెలియని వ్యక్తులు కారులో కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన దుండగులు తండ్రీకొడుకులను బాపట్ల జిల్లా సంతమాగులూరు సమీపంలోని ఒక ప్రైవేట్ వెంచర్‌లో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. మృతదేహాలను అదే ప్రాంతంలో పడేశారు.
ఈ హత్యలకు కారణం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లావాదేవీల వివాదంగా ప్రాథమికంగా పోలీసులు అంచనా వేశారు. వీరస్వామి రెడ్డికి గడ్డం అనిల్ కుమార్ రెడ్డి అనే వ్యక్తితో ఆర్థిక లావాదేవీలపై వివాదం ఉదంి. చెక్ బౌన్స్ కేసు ఈ వివాదంలో భాగంగానే కోర్టులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై నరసరావుపేట పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను సంతమాగులూరు సమీపంలోని ప్రైవేట్ వెంచర్‌లో గుర్తించారు. పోలీసులు ఈ హత్యల వెనుక గడ్డం అనిల్ కుమార్ రెడ్డి లేదా అతని అనుచరుల పాత్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సంతమాగులూరు ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్, స్థానిక సాక్షుల సమాచారం ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది.
బ్రేకింగ్ న్యూస్..
— Thota Sunitha (@ThotaSunit3488) July 23, 2025
నరసరావుపేట కోర్టు వద్ద ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్..
చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు వచ్చిన సంతమాగులూరు కి చెందిన ప్రశాంత్ రెడ్డి ,వీరాస్వామి రెడ్డి..
అతి కిరాతకంగా నరికి సంతమాగులూరు వద్ద బాడీ లను పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు..
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.. pic.twitter.com/3byD7A38ho
తండ్రి, కుమారులు ఇద్దరూ కోర్టు వాయిదాకా వస్తారని పక్కా సమాచారంతోనే ఈ హత్యలకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. ప్రధాన అనుమానితుడిగా ఉన్న అనిల్ కుమార్ రెడ్డి.. ఆ సమయంలో కోర్టు దగ్గరే ఉన్నట్లుగా సీసీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. ఇంత దారుణంగా చంపుతారని ఊహించి ఉంటే.. ఆ తండ్రి కొడుకులు బెంగళూరు నుంచి వచ్చి ఉండేవారు కాదని బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. సుపారీ గ్యాంగులతో ఈ హత్యలు చేయించినట్లుగా అనుమానిస్తున్నారు.





















