అన్వేషించండి

Gold Loot: సూర్యాపేటలో బంగారం షాపు లూఠీ - 18 కిలోల గోల్డ్ దోపిడీ - ఎవరి పని ?

Suryapet: సూర్యాపేటలోని ఓ బంగారు దుకాణాన్ని దొంగలు ఊడ్చేశారు. అందులో ఉన్న 18కేజీల బంగారాన్ని తీసుకెళ్లిపోయారు.

Suryapet Gold loot Crime : సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రముఖ నగల దుకాణంలో చోరీ జరిగింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ లూటీలో షాపు మొత్తం ఖాళీ చేశారు.  సూర్యాపేట జిల్లా కేంద్రంలోని  ఎంజీ రోడ్‌లో  సంతోషి జువెలరీ షాపు ఉంది.  దొంగలు షాపు వెనుక భాగంలోని  బాత్రూమ్ గోడకు రంధ్రం  వేసి లోపలికి ప్రవేశించారు.  గ్యాస్ కట్టర్‌ను ఉపయోగించి షాపు లోపలి భాగంలోని  షట్టర్ ,  బీరువా ను కట్ చేసి ఆభరణాలను తీసుకెళ్లిపోయారు.  ఈ రంధ్రం ద్వారా షాపు లోపలి స్టోరేజ్ సెక్షన్‌ వద్దకు నేరుగా వచ్చేశారు. 

మొత్తంగా 18 కిలోగ్రాముల బంగారు ఆభరణాలు చోరీ అయినట్లుగా యజమానులు పోలీసులుకు చెప్పారు. అలాగే దుకాణంలో  రూ. 22 లక్షల నగదు కూడా ఉందని చెబుతున్నారు.  షాపు యజమాని  కిషోర్  18 కిలోల బంగారం,  రూ. 22 లక్షల నగదు  దోచుకెళ్లారని పోలీసులుక ఫిర్యాదు చేశారు.  సూర్యాపేట ఎస్పీ స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఐదు స్పెషల్ టీముల్ని ఈ కేసును ఛేదించడానికి ఏర్పాటు చేశారు.  సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. షాపు లోపలి సీసీటీవీ కెమెరాలు  ఎందుకు పని చేయలేదని ఆరా తీస్తున్నారు. 

ప్రొఫెషనల్ గ్యాంగ్ చోరీ  చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  గ్యాస్ కట్టర్ వాడకం ,  బాత్రూమ్ గోడ ద్వారా ప్రవేశించడం వంటివి సైలెంట్ గా చేయడం ప్రొఫెషనల్స్ కే సాధ్యమని భావిస్తున్నారు. ముందుగానే రెక్కీ కూడా నిర్వహించి ఉంటారని నుమానిస్తున్నారు.    స్థానికంగా, వ్యాపారులు ,  ప్రజలు భద్రతా ఏర్పాట్లపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ముఖ్యంగా జువెలరీ షాపుల్లో సీసీటీవీ కెమెరాలు ,  బర్గ్లర్ అలారం సిస్టమ్‌ల లోపాలపై చర్చ జరుగుతోంది.

ఇంకా నిందితులు ఎవరు అన్నది గుర్తించ లేదు.  2014లో హైదరాబాద్‌లోని తనిష్క్ షోరూమ్‌లో 30 కిలోల బంగారం చోరీ  గుర్తు చేస్తోందని పోలీసులు చెబుతున్నారు.  ఇవి కూడా గోడలకు రంధ్రాలు వేసి, గ్యాస్ కట్టర్‌లను ఉపయోగించి  చోరీ చేశారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్‌ సీసీటీవీ ఫుటేజీలు మాయం - వీడియో రికవరీ సాధ్యమేనా?
సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్‌ సీసీటీవీ ఫుటేజీలు మాయం - వీడియో రికవరీ సాధ్యమేనా?
Parawada Pharma City Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. నలుగురు కార్మికులు సజీవదహనం! సహాయక చర్యలు ముమ్మరం
పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. నలుగురు కార్మికులు సజీవదహనం! సహాయక చర్యలు ముమ్మరం
Lucknow Coaching Centre Fire Accident: లక్నో అగ్నిప్రమాదంలో 14 మంది మృతి.. ప్రధాని మోదీ విచారం, మృతుల కుటుంబాలకు పరిహారం
లక్నో అగ్నిప్రమాదంలో 14 మంది మృతి.. ప్రధాని మోదీ విచారం, మృతుల కుటుంబాలకు పరిహారం
Prakasam Road Accident: ఆటోను ఢీకొట్టిన గ్రానైట్ లారీ.. ముగ్గురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు- ప్రకాశం జిల్లాలో విషాదం
ఆటోను ఢీకొట్టిన గ్రానైట్ లారీ.. ముగ్గురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు- ప్రకాశం జిల్లాలో విషాదం

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CI Nagarajau Arrest: సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్! తీవ్ర ఉద్రిక్తతల మధ్య అదుపులోకి తీసుకున్న సిట్
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్! తీవ్ర ఉద్రిక్తతల మధ్య అదుపులోకి తీసుకున్న సిట్
Amaravati బైపాస్ వెంకటపాలెం టోల్ ప్లాజా వద్ద ఆందోళన.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు, ఎందుకంటే
Amaravati బైపాస్ వెంకటపాలెం టోల్ ప్లాజా వద్ద ఆందోళన.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు, ఎందుకంటే
AP Voter List Revision SIR Process: కుప్పం, పులివెందులలో SIR హీట్! జగన్ చెప్పిన మమత, స్టాలిన్ ఓటమి లాజిక్ కంగారు పెడుతోందా?
కుప్పం, పులివెందులలో SIR హీట్! జగన్ చెప్పిన మమత, స్టాలిన్ ఓటమి లాజిక్ కంగారు పెడుతోందా?
Parawada Pharma City Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. నలుగురు కార్మికులు సజీవదహనం! సహాయక చర్యలు ముమ్మరం
పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. నలుగురు కార్మికులు సజీవదహనం! సహాయక చర్యలు ముమ్మరం
AP Politics Kapu Equations: పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన వైసీపీ కాపు మిషన్ - జగన్ వ్యూహం ఫలిస్తుందా?
పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన వైసీపీ కాపు మిషన్ - జగన్ వ్యూహం ఫలిస్తుందా?
Arya On Vishal: 45 రోజులు తీసిందంతా వేస్ట్... వంద రోజులు షూట్ చేశాక కథ - 'వాడు వీడు' తెరవెనుక సంగతులు
45 రోజులు తీసిందంతా వేస్ట్... వంద రోజులు షూట్ చేశాక కథ - 'వాడు వీడు' తెరవెనుక సంగతులు
Qatar Gas Fire Accident: ఖతార్‌ గ్యాస్ ప్లాంట్‌ పేలుడులో 12 మంది భారతీయులు మృతి, మళ్లీ LPG కొరత!
ఖతార్‌ గ్యాస్ ప్లాంట్‌ పేలుడులో 12 మంది భారతీయులు మృతి, మళ్లీ LPG కొరత!
Vehicle Modification Rules: వాహనాన్ని మోడిఫై చేయించిన వ్యక్తి.. 4 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్! రూల్స్ తెలుసుకోండి
వాహనాన్ని మోడిఫై చేయించిన వ్యక్తి.. 4 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్! రూల్స్ తెలుసుకోండి
Embed widget