Medical College: మెడికల్ కాలేజీలో విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. లేదు.. లేదు.. అది ప్రాంక్ అంటున్న ప్రొఫెసర్
విజయవాడలోని వైద్య కాలేజీలో విద్యార్థినులపై లైంగిక ఆరోపణల విషయంపై వైద్య ఆరోగ్య శాఖ అంతర్గత విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసు మరో మలుపు తిరిగింది.
విజయవాడ ప్రభుత్వ డెంటల్ కాలేజీ వేధింపులు ఘటనలో మరో ట్విస్ట్ వచ్చింది. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న.. డాక్టర్ గౌతమ్ ఉమెన్ గ్రీవిన్స్ సెల్‌కు లేఖ రాశారు. విద్యార్థినితో ప్రాంక్ చేశానని లేఖలో చెప్పారు. అయితే డాక్టర్ విద్యార్థినితో అలాంటి ప్రాంక్ చేయడమేంటని.. విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. తనను టార్గెట్ చేసి ప్రిన్సిపల్ కావాలనే తప్పుడు ఫిర్యాదులు చేయించారని మరో వ్యక్తి.. డాక్టర్ రమేష్ అన్నారు.
విజయవాడలోని.. వైద్య కాలేజీలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఫిర్యాదుల ఆరోపణలపై ప్రొఫెసర్స్ విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముగ్గురు వైద్యులతో కూడిన బృందం ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యులపై విచారణ జరుపుతోంది. ఇప్పుడు ఆరోపణలు వచ్చిన.. వైద్యులపైనే.. గతంలోనూ.. పలు మార్లు లైంగిక వేధింపులు వచ్చినట్టు తెలుస్తోంది.
అయితే వైద్య కళాశాలలోని ఇద్దరు వైద్యులపై ఆరుగురు విద్యార్థినులు రాత పూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఇద్దరు వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంతర్గత విచారణకు ఆదేశించారు. బాధిత విద్యార్థినుల నుంచి వైద్యుల కమిటీ వివరాలను సేకరించింది. ఈ విషయమై విమెన్ ప్రొటెక్షన్ సెల్ కూడా వివరాలను తీసుకుంది. అయితే తాను కేవలం విద్యార్థినితో ప్రాంక్ చేశానని డాక్టర్ గౌతమ్ ప్రస్తుతం లేఖ రాశారు.
Also Read: Covid 19 3rd Wave: భయంకరంగా కరోనా థర్డ్ వేవ్.. దేశంలో రోజుకు 10 లక్షల కేసులు!
Also Read: NEET PG Counselling: నీట్ పీజీ కౌన్సెలింగ్ తేదీలపై కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ప్రకటన..
Also Read: PM Modi Meeting: కొవిడ్ పరిస్థితులపై ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమీక్ష.. లాక్‌డౌన్ తప్పదా?
Also Read: Jagityal: పొదల్లో కాపు కాచి మరీ యువకుడి హత్య.. తల్వార్‌లతో నరికి.. జగిత్యాలలో దారుణం
Also Read: CrIme News: విజయవాడలో నిజామాబాద్ కు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య