NEET PG Counselling: నీట్ పీజీ కౌన్సెలింగ్ తేదీలపై కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ప్రకటన..
NEET PG Counselling Date 2022 OUT: ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి (EWS) 10 శాతం సీట్లను ఆల్ ఇండియా నీట్ మెడికల్ కేటాయింపులపై సుప్రీం ధర్మాసనం జనవరి 7న తీర్పు వెలువరించింది.
NEET PG Counselling Latest News: నీట్ సీట్ల కేటాయింపు, రిజర్వేషన్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వడంతో కౌన్సెలింగ్ కు మార్గం సుగమం అయింది. ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి (EWS) 10 శాతం సీట్లను ఆల్ ఇండియా నీట్ మెడికల్ కేటాయింపులపై సుప్రీం ధర్మాసనం జనవరి 7న తీర్పు వెలువరించింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్లలో ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లపై నిన్న సుదీర్ఘంగా విచారించిన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
నీట్ పీజీ కౌన్సెలింగ్ జనవరి 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని కేంద్ర వైద్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఏఎన్ఐ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలోనూ కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారమే ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. జస్టిస్ డీవై చంద్రచూడ్, ఏఎఖస్ బోపన్నలతో కూడిన సుప్రీం ధర్మాసనం నీట్ పీజీ కౌన్సెలింగ్‌కు సంబంధించి సీట్ల కోటాను ఇటీవల ఖరారు చేసింది. నీట్ పీజీ కౌన్సెలింగ్ లో సీట్ల కోటాపై నిర్ణయం తీసుకోవాలని దేశ వ్యాప్తంగా ఉన్న రెసిడెంట్ డాక్టర్లు సమ్మె చేయడం తెలిసిందే. ఈడబ్ల్యూఎస్ కోటాకు 10 సీట్లు కేటాయిస్తూ, గత ఏడాది తరహాలోనే సీట్ల కోటాను ఖరారు చేస్తూ సుప్రీం ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.
ఇప్పటివరకూ ఉన్న విధానం ప్రకారం ప్రతి అభ్యర్థి ఈడబ్ల్యూఎస్ కోటాకు అర్హులు అవుతారు. ఇదే విషయాన్ని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వం తరుఫున సుప్రీంకోర్టుకు తెలియజేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ఈడబ్ల్యూ కోటా కోసం సీట్లు పెంచాల్సి ఉంటుంది. అదే సమయంలో జనరల్ కోటా విద్యార్థుల అవకాశాలకు విఘాతం కలగకూడదని సుప్రీం ధర్మాసనానికి తుషార్ మెహతా వివరించారు.
సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ప్రకారం.. ఎంబీబీఎస్, బీడీఎస్, ఎండీ, ఎంఎస్, ఎండీఎస్ ప్రవేశాలలో ఈడబ్ల్యూఎస్ కోటా 10 శాతం సీట్లు ఉంటాయి. 2021-22 విద్యా సంవత్సరానికిగానూ ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు వర్తిస్తాయని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. సుప్రీం కోర్టు తాజా తీర్పుతో నీట్ పీజీ కౌన్సెలింగ్‌కు మార్గం సుగమం అయింది.
Also Read: NEET OBC Reservations: నీట్ పీజీ కౌన్సెలింగ్.. సీట్ల కోటాను ఖరారు చేసిన సుప్రీం ధర్మాసనం