NEET OBC Reservations: నీట్ పీజీ కౌన్సెలింగ్.. సీట్ల కోటాను ఖరారు చేసిన సుప్రీం ధర్మాసనం
ఆల్ ఇండియా నీట్ మెడికల్ యూజీ, పీజీ సీట్ల కేటాయింపులపై జస్టిస్ డీవై చంద్రచూడ్, ఏఎఖస్ బోపన్నలతో కూడిన సుప్రీం ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.
NEET OBC Reservations: నీట్ సీట్ల కేటాయింపు, రిజర్వేషన్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి (EWS) 10 శాతం సీట్లను ఆల్ ఇండియా నీట్ మెడికల్ యూజీ, పీజీ సీట్ల కేటాయింపులపై నిర్ణయం తీసుకుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్లలో ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లపై నిన్న సుదీర్ఘంగా విచారించిన సుప్రీంకోర్టు నేడు తీర్పు ఇచ్చింది.
జస్టిస్ డీవై చంద్రచూడ్, ఏఎఖస్ బోపన్నలతో కూడిన సుప్రీం ధర్మాసనం నీట్ పీజీ కౌన్సెలింగ్‌కు సంబంధించి సీట్ల కోటాను ఖరారు చేసింది. నీట్ పీజీ కౌన్సెలింగ్ లో సీట్ల కోటాపై నిర్ణయం తీసుకోవాలని దేశ వ్యాప్తంగా ఉన్న రెసిడెంట్ డాక్టర్లు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈడబ్ల్యూఎస్ కోటా నుంచి 10 సీట్లు కేటాయిస్తూ సుప్రీం ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. సీట్ల కోటా తేలడంతో త్వరలోనే కౌన్సెలింగ్ ప్రారంభం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: Job Skills: కొత్త ఏడాది.. కొత్త స్కిల్స్ నేర్చుకుంటే పోలా.. ఇక 2022 మీదే అవ్వొచ్చు
Supreme Court allows 27% reservation for Other Backward Class (OBC) and 10% for Economically Weaker Section (EWS) category in the All-India Quota (AIQ) seats for admission in the NEET for all medical seats as existing criteria this year.
— ANI (@ANI) January 7, 2022
ఇప్పటివరకూ ఉన్న విధానం ప్రకారం ప్రతి అభ్యర్థి ఈడబ్ల్యూఎస్ కోటాకు అర్హులు అవుతారు. ఇదే విషయాన్ని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వం తరుఫున సుప్రీంకోర్టుకు తెలియజేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ఈడబ్ల్యూ కోటా కోసం సీట్లు పెంచాల్సి ఉంటుంది. అదే సమయంలో జనరల్ కోటా విద్యార్థుల అవకాశాలకు విఘాతం కలగకూడదని సుప్రీం ధర్మాసనానికి తుషార్ మెహతా వివరించారు.
తాజా తీర్పు ప్రకారం.. ఎంబీబీఎస్, బీడీఎస్, ఎండీ, ఎంఎస్, ఎండీఎస్ ప్రవేశాలలో ఈడబ్ల్యూఎస్ కోటా 10 శాతం సీట్లు ఉంటాయి. 2021-22 విద్యా సంవత్సరానికిగానూ ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు వర్తిస్తాయని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. సుప్రీం కోర్టు తాజా తీర్పుతో నీట్ పీజీ కౌన్సెలింగ్‌కు మార్గం సుగమం అయింది.
Also Read: Warangal News: తెలంగాణ యూనివర్సిటీల్లో చదువు అంత ఈజీ కాదు ఇక