By: ABP Desam | Updated at : 04 Jan 2022 03:34 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
కొంతమందికి.. కొత్త కోర్సులు నేర్చుకోవాలంటే.. చాలా ఇష్టం. ట్రెండ్ మారుతున్న కొద్దీ వచ్చే.. కోర్సులపై దృష్టిపెడతారు. వాటి ద్వారా ఉపాధి కూడా లభిస్తుంటుంది. ఇక డిగ్రీ పూర్తి చేసుకుని.. వెంటనే జాబ్ చేయాలనుకునేవారు కూడా.. మార్కెట్లో మంచి కోర్సు ఏం ఉందా? అని వెతుకుతారు. అయితే ఈ ఏడాది ఏ కోర్సులు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. దాని గురించి చెప్పింది అమెరికాకు చెందిన ఆన్ లైన్ ఎడ్యుకేషన్ ఫ్లాట్ ఫామ్ కోర్స్ ఎరా.. ఇటీవలే ఓ రిపోర్టు కూడా విడుదల చేసింది. ఒక్కసారి ఆ కోర్సులు ఏంటో మీరు చూడండి.. మీకు ఉపయోగపడొచ్చు.
ప్రోగ్రామింగ్... మార్కెట్ లో ప్రోగ్రామింగ్ కు మంచి డిమాండ్ ఉంటుంది. వెబ్‌సైట్స్, యాప్స్ రూపొందించడానికి ప్రోగ్రామింగ్ అనేది చాలా ముఖ్యం. జావా, జావాస్క్రిప్ట్, రూబీ, పైథాన్, సీ++ లాంటి టాప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకున్నవారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
AR and VR.. ఆగ్యుమెంటెడ్ రియాల్టీ, వర్చువల్ రియాల్టీని కలిపి ఎక్స్‌టెండెడ్ రియాల్టీ(XR) అని అంటారు. కొన్నేళ్లపాటు.. ఈ టెక్నాలజీకి భారీగా డిమాండ్ ఉండే అవకాశం ఉంది. దీంట్లో నైపుణ్యం ఉంటే.. వారికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
ఫుల్ స్టాక్ డెవలపర్ కు... ఈ ఏడాది కూడా చాలా డిమాండ్ ఉంటుంది. ఇండీడ్ బెస్ట్ జాబ్స్ ఆఫ్ 2020 జాబితాలో ఫుల్ స్టాక్ డెవలపర్ రెండో స్థానంలో నిలిచింది. ఐటీ రంగంలో చాలా విభాగాలు వేగంగా అభివృద్ధి చెందుతుండటం, సాఫ్ట్‌వేర్, యాప్స్‌కు డిమాండ్ పెరగడం కారణంగా.. ఫుల్ స్టాక్ డెవలపర్లకు డిమాండ్ ఉంది.
క్లౌడ్ కంప్యూటింగ్.. స్కిల్స్‌కు 2022లో ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజుల్లో ప్రతీ టెక్నాలజీలో క్లౌడ్ ప్లాట్‌ఫామ్ ముఖ్యమైపోతుంది. క్లౌడ్ డెవలపర్, ఆడిటర్, ఆర్కిటెక్ట్ లాంటివారికి ఇందులో మంచి ఉద్యోగాలు వచ్చే ఛాన్స్ ఉంది.
ప్రస్తుత కాలంలో.. ప్రతీ వెబ్‌సైట్, యాప్ వాడకం ఎక్కువైంది. యూజర్లను మరింత ఆకట్టుకోవడానికి యూఎక్స్ డిజైన్ అనేది కీలకమైపోయింది. యూజర్ల సైకాలజీ, సెంటిమెంట్, అవసరాలు దృష్టిలో పెట్టుకొని యూఎక్స్ డిజైన్ చేసేవారికి ఈ ఏడాది అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి.
Also Read: ఇలాంటి కోర్సులపై ఓ లుక్కెయండి... ఏమో మీ భవిష్యత్ వీటితోనే ఉందేమో!
Also Read: కరోనా కాలం చదవులా ? ఇంటర్ బోర్డు పొరపాటా? వివాదంగా మారిన ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు !
AP TS 10th Exam Results: ఆ తేదీల్లో ఏపీలో టెన్త్ రిజల్ట్స్ విడుదలయ్యే ఛాన్స్ - తెలంగాణలో స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రారంభం
Telangana Police Jobs: పోలీసు ఉద్యోగాలకు ఇంకా అప్లై చేయలేదా? ఇవాళే లాస్ట్ డేట్!
Karimnagar: శాతవాహన యూనివర్సిటీలో 12బీ హోదా లొల్లి - UGCకి వర్సిటీ నుంచి వివాదాస్పద లేఖలు
TS SSC Exams: నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు, ఆ నిబంధన కచ్చితంగా పాటించాల్సిందే
Telangana TET Exam : తెలంగాణ టెట్ వాయిదాపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు
Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, మరో వారంలో తెలుగు రాష్ట్రాలకు
Infinix Note 12 Flipkart Sale: ఇన్ఫీనిక్స్ నోట్ 12 సేల్ ప్రారంభం - అదిరిపోయే ఫీచర్లు - ఎలా ఉందో చూశారా?
The Conjuring House: ‘ది కంజూరింగ్’ హౌస్, ఆ దెయ్యాల కొంపను రూ.11 కోట్లకు అమ్మేశారు, చరిత్ర తెలిస్తే షాకవుతారు!
F3 Movie OTT Release: 'ఎఫ్3' ఓటీటీ రిలీజ్ అప్డేట్ - స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?