IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

సినిమా చూసిన టైంలో పైసా ఖర్చు లేకుండా యానిమేషన్ నేర్చుకోండిలా.. కొత్త సంవత్సరంలో కొత్తగా ట్రై చేయండి..

ప్రస్తుతం యానిమేషన్‌కు గిరాకీ పెరుగుతోంది. మార్కెట్‌లో కూడా ఇబ్బడి ముబ్బడిగా కోర్సు నేర్పే సంస్థలు పెరుగుతున్నాయి. నమ్మకమైన సంస్థలో సులభంగా యానిమేషన్ నేర్చుకోండి.

FOLLOW US: 

యానిమేషన్ ప్రాధాన్యత రోజురోజుకు పెరుగుతోంది. ఉద్యోగ అవకాశాలు కూడా బాగానే ఉన్నాయి. అందుకో ఈ ఫీల్డ్‌ వైపు చూస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇలాంటి వారి కోసమే ఉచితంగా 15వారాల కోర్సును డిజైన్ చేసింది స్వయం పోర్టల్. 
యానిమేషన్, ఇంజినీరింగ్ డిజైన్, గేమింగ్ టెక్నాలజీలో స్థిరపడాలనుకునే వారి కోసం ఉద్దేశించి రూపొందించిన కోర్సు. ఈ కోర్సులో జాయిన్ అయిన వాళ్లు డిజైన్ చరిత్ర, క్రియేటివిటీ వృద్ధి తీరు, యానిమేషన్ ఫిల్మ్‌ ప్రొడక్షన్‌లో ఉన్న సాంకేతిక అంశాలు, సీజీ మోడలింగ్, టెక్చరింగ్, లైటింగ్, రిగ్గింగ్, యానిమేషన్ అండ్‌ రెండరింగ్ వంటి అంశాలు నేర్పిస్తారు. విజువల్స్ ఎఫెక్ట్స్‌, యానిమేషన్, డిజైన్ ఇంజినీరింగ్‌లో ఉన్న మెళకువలు చెప్తారు. 
సినిమా, టెలివిజన్, అడ్వర్టైజింగ్, వెబ్‌, మోషన్ క్యాప్చర్, గేమ్‌ డిజైనింగ్‌లో ఉన్న అవకాశాలను వివరిస్తారు. ఈ ప్రాజెక్ట్ బేస్డ్ కోర్సు నేర్చుకున్న వాళ్లు తమ వృత్తి నైపుణ్యాలను పెంచుకొని మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ఉపాది అవకాశాలు సులభంగా పొందే ఛాన్స్ ఉంది. 

కోర్సు చెప్పే ఫ్యాకల్టీ:

1. డా. అభిషేక్‌ కుమార్, అడోబ్‌ ఎడ్యుకేటర్, ఆపిల్‌ గుర్తింపు ఉన్న అమెరికా ప్రొఫెసర్
2. డా.అచింత్య సింఘాల్, అసోసియేట్‌ ప్రొఫెసర్, బెనారస్‌ హిందు విశ్వవిద్యాలయం
3. డా. అలోక్‌ కుమార్ కుశ్వాహా, జీజీయూ సెంట్రల్ యూనివర్శిటీ
4. డా. జితేంద్ర శీత్లానీ, శ్రీసత్య సాయి యూనివర్శిటీ ప్రొఫెసర్
5. డా. వీడీ అంబేద్‌ కుమార్, ప్రొఫెసర్, అన్నాయూనివర్శిటీ
ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌:
1. భువనేష్‌ కుమార్ క్రియేటర్‌ యానిమేటర్‌, యాష్‌ రాజ్‌ ఫిల్మ్స్‌
2. అల్కా కే ర్యాన్, టీడీ లైట్నింగ్‌, కోర్సు కంటెంట్‌ డెవలపర్‌ యానిమేషన్ అండ్‌ వీఎఫ్‌ఎక్స్‌
3. ప్రసూన్‌ సింగ్‌, టెక్నికల్‌ డైరెక్టర్‌ యానిమేషన్, ప్రైమ్‌ ఫోకస్‌ వరల్డ్‌
టీచింగ్‌ అసిస్టెంట్స్‌:
1. ఈఆర్‌. అంకిత్‌ కుమార్‌,  ఎంటెక్‌-ఐఐఐటీఏ, పీహెచ్‌డీ-బిట్స్‌*
2. జీఎస్‌ ధనుంజయ్‌, ఎంఏజేఎంసీ, ఇఫ్లూ

కోర్సు పూర్తైన తర్వాత పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో పాస్‌ అయితే సర్టిఫికేట్‌ ఇస్తారు. 

ముఖ్యమైన తేదీలు

కోర్సు కాలవ్యవధి: 15వారాలు
కోర్సు ప్రారంభమయ్యే తేదీ: 10జనవరి 2022
కోర్సు ముగిసే తేదీ: 30 ఏప్రిల్ 2022
ప్రవేశానికి చివరి తేదీ: 28 ఫిబ్రవరి2022
కోర్సు స్థాయి: పీజీ 

కోర్సు లింక్‌: కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాలు

Also read: ఏం ఫుడ్ కాంబినేషన్ గురూ ఇది... విచిత్రం కాదు, వికారం కలుగుతోంది

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.
Published at : 31 Dec 2021 09:24 AM (IST) Tags: Education Animation Course Swayam

సంబంధిత కథనాలు

Telangana Police Jobs: పోలీసు ఉద్యోగాలకు ఇంకా అప్లై చేయలేదా? ఇవాళే లాస్ట్ డేట్!

Telangana Police Jobs: పోలీసు ఉద్యోగాలకు ఇంకా అప్లై చేయలేదా? ఇవాళే లాస్ట్ డేట్!

Karimnagar: శాతవాహన యూనివర్సిటీలో 12బీ హోదా లొల్లి - UGCకి వర్సిటీ నుంచి వివాదాస్పద లేఖలు 

Karimnagar: శాతవాహన యూనివర్సిటీలో 12బీ హోదా లొల్లి - UGCకి వర్సిటీ నుంచి వివాదాస్పద లేఖలు 

TS SSC Exams: నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు, ఆ నిబంధన కచ్చితంగా పాటించాల్సిందే

TS SSC Exams: నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు, ఆ నిబంధన కచ్చితంగా పాటించాల్సిందే

Telangana TET Exam : తెలంగాణ టెట్ వాయిదాపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు

Telangana TET Exam : తెలంగాణ టెట్ వాయిదాపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు

Student Debarred: ఏపీ ఇంటర్ బోర్డ్ పరీక్షల్లో కాపీయింగ్ - 13 మంది విద్యార్థుల్ని డిబార్ చేసిన అధికారులు

Student Debarred: ఏపీ ఇంటర్ బోర్డ్ పరీక్షల్లో కాపీయింగ్ - 13 మంది విద్యార్థుల్ని డిబార్ చేసిన అధికారులు

టాప్ స్టోరీస్

F3 Movie Review - 'ఎఫ్ 3' రివ్యూ: వెంకటేష్, వరుణ్ తేజ్ నవ్వించారా? ఫ్రస్ట్రేషన్ తెప్పించారా?

F3 Movie Review  - 'ఎఫ్ 3' రివ్యూ: వెంకటేష్, వరుణ్ తేజ్ నవ్వించారా? ఫ్రస్ట్రేషన్ తెప్పించారా?

Nikhat Zareen : హైదరాబాద్ కు నిఖత్ జరీన్, శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం

Nikhat Zareen : హైదరాబాద్ కు నిఖత్ జరీన్, శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం

Hyundai Venue Facelift: హ్యుండాయ్ కొత్త వెన్యూ వచ్చేస్తుంది - ఈసారి వచ్చే మోడల్ వేరే లెవల్!

Hyundai Venue Facelift: హ్యుండాయ్ కొత్త వెన్యూ వచ్చేస్తుంది - ఈసారి వచ్చే మోడల్ వేరే లెవల్!

AP In Davos : దావోస్ నుంచి ఏపీకి రూ. 1లక్షా 25వేల కోట్ల పెట్టుబడులు - జగన్ పర్యటన విజయవంతమయిందన్న ప్రభుత్వం !

AP In Davos :   దావోస్ నుంచి ఏపీకి రూ. 1లక్షా 25వేల కోట్ల పెట్టుబడులు - జగన్ పర్యటన విజయవంతమయిందన్న ప్రభుత్వం !