By: ABP Desam | Updated at : 08 Apr 2022 06:52 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
మంత్రి ఆదిమూలపు సురేశ్(ఫైల్ ఫొటో)
కోవిడ్ థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న తరుణంలో పది పరీక్షల నిర్వహణపై ఏపీ విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. టీనేజర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రభుత్వం చేపట్టింది. 15-18 ఏళ్ల లోపు విద్యార్థుల్లో 95శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశామని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. పది పరీక్షలను మార్చిలో తప్పనిసరిగా నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో లక్షకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత విద్యాసంవత్సరాల్లో కరోనా కారణంగా పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశారు. ఈ విద్యాసంవత్సరం తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం అంటుంది.
Also Read: ఏపీలో సినిమా వ్యాపారానికి మరో దెబ్బ... కొత్త సినిమాలకు కలెక్షన్లు రావడం కష్టమే!
త్వరలో సీబీఎస్ఈ సిలబస్
పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ కీలక ప్రకటన చేశారు. మార్చి నెలలో పదో తరగతి పరీక్షలు తప్పనిసరిగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా వినుకొండలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 7 సబ్జెక్టులతో పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో సీబీఎస్‌ఈ సిలబస్ త్వరలో ప్రారంభిస్తామన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి సీబీఎస్‌ఈలో పదో తరగతి ఫస్ట్ బ్యాచ్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వ లక్ష్యమన్నారు.
Also Read: 23 శాతం ఫిట్మెంట్ ఓకే.... పీఆర్సీ ప్రకటనపై ఉద్యోగ సంఘాలు హర్షం
95 శాతం వ్యాక్సినేషన్
పదో తరగతి పరీక్షలు మార్చిలో నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. సంక్రాంతి నాటికి సిలబస్ పూర్తి చేయాలని సూచించారు. 15 నుంచి 18 ఏళ్ల లోపు విద్యార్థులకు 95 శాతం వ్యాషినేషన్ పూర్తి చేశామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలో అమ్మఒడి మూడో విడత ఇస్తామన్నారు. నిబంధనలు పాటించని 375 బీఈడీ, డీఈడీ కాలేజీలు మూతపడ్డాయని మంత్రి సురేశ్ పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో చట్టసవరణ ద్వారా 35 శాతం ఫ్రీ సీట్లు ఇప్పించామన్నారు. ఏ ఒక్క విద్యార్ధి డబ్బులు లేక విద్యకు దూరం కాకూడదని అమ్మఒడి ఇస్తున్నామన్నారు. విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చెప్తూ తెలుగు కూడా బోధిస్తున్నామన్నారు.
Also Read: ఏపీ ఉద్యోగులకు 23.29 శాతం ఫిట్‌మెంట్.. రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Union Budget Live 2023 Updates: సీతమ్మ బడ్జెట్ మురిపిస్తుందా? ఉసురుమనిపిస్తుందా?
AP Capital issue : ఏపీ రాజధాని అంశాన్ని సీఎం జగన్ మళ్లీ ఎందుకు కదిలించారు ? కోర్టులో ఉన్న అంశంపై రిస్క్ తీసుకున్నారా ?
Kotamreddy vs Balineni: నా ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు చూపిస్తా, కాచుకో బాలినేనీ!: ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలనం
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Payyavula On CM jagan : రాజధానిపై ప్రకటన కోర్టు ధిక్కారమే - సీఎం జగన్పై టీడీపీ నేత పయ్యావుల ఫైర్ !
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
Dhanbad Fire Accident: జార్ఖండ్లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం
Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీ, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్గా భారతి హోళికేరి