AP NGO's On PRC: 23 శాతం ఫిట్మెంట్ ఓకే.... పీఆర్సీ ప్రకటనపై ఉద్యోగ సంఘాలు హర్షం
ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు 23.29 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించింది. ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు పాజిటివ్ గానే స్పందించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సర్దుకుపోతున్నామని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. 23 శాతం ఫిట్మెంట్ కు అంగీకరిస్తున్నామన్నారు. జనవరి నుంచి పెండింగ్ డీఎలు, పెంచిన వేతనాలు అమలుచేస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు. ఉద్యోగులందరికీ స్మార్ట్ టౌన్ షిప్ లలో ప్లాట్లు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. టౌన్ షిప్ లో పది శాతం ప్లాట్లను ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం రిబేటుతో ఇస్తామని సీఎం చెప్పారన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జనవరి నుంచి వేతనాల పెంపు అమలు చేస్తామని హామీ ఇచ్చారని వెంకట్రామిరెడ్డి అన్నారు. ఫిట్మెంట్ తప్ప మిగిలిన అంశాలు ఊహించిన దానికంటే బాగానే ఉన్నాయన్నారు. జూన్ 30లోపు సీపీఎస్ రద్దుపై సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటామన్నారని తెలిపారు. జూన్ 30 లోపు కోవిడ్ వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు ఉద్యోగాలివ్వాలని సీఎం ఆదేశించారన్నారు.
Also Read: ఏపీ ఉద్యోగులకు 23.29 శాతం ఫిట్‌మెంట్.. రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు !
2018 నుంచి 23 శాతం ఫిట్మెంట్ అమలు
ఉద్యోగులకు సంబంధించి హెల్త్ కార్డులపై సీఎస్ ఆధ్యక్షతన కమిటీ వేయాలని సీఎం ఆదేశించారని ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి అన్నారు. 'రెండు వారాల్లో హెల్త్ కార్డుల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇళ్లు లేని ఉద్యోగులకు ఎంఐజీ లే అవుట్ లో 20 శాతం రిబేటు ఇచ్చి ఇళ్లు కేటాయిస్తామన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు జూన్ 30 లోపు సవరించిన వేతనాలతో సర్వీసులు క్రమబద్దీకరణ చేస్తామన్నారు. ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న 5 డీఎలను ఈ నెల వేతనంతో ఇస్తామన్నారు. 1600 కోట్లు జీపీఎఫ్ , మెడికల్ రీ ఎంబర్స్ మెంట్, రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ ను ఏప్రిల్ లోపు పరిష్కారిస్తామన్నారు. పీఆర్సీని ఈ నెల 1 నుంచి క్యాష్ రూపంలో ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జనవరి 1 నుంచే కొత్త వేతనాలు ఇస్తామన్నారు. 1-7-2018 నుంచి 23శాతం ఫిట్మెంట్ అమలు చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. పీఆర్సీ వల్ల ఏడాదికి రూ.10 వేల 250 కోట్లు రాష్ట్ర బడ్జెట్ పై భారం పడుతుందని సీఎం చెప్పారు. ఈ నెల 1 నుంచి ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 60-62కు పెంచుతున్నట్లు సీఎం చెప్పారు. సీపీఎస్ రద్దు పై జూన్ 30 లోపు పాజిటివ్ గా నిర్ణయం తీసుకుంటామన్నారు.' చంద్రశేఖరరెడ్డి అన్నారు.
Also Read: సినిమా టిక్కెట్ రేట్ల కాన్సెప్ట్ బస్ టిక్కెట్లకు వర్తించదా !? ఏపీ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది ?
రిటైర్మెంట్ వయసు పెంపుపై ఉద్యోగ సంఘాలు హర్షం
'ఎవరూ ఊహించని విధంగా ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు సీఎం పెంచడం శుభపరిణామం. సీఎస్ కమిటీ సిఫ్రార్సు చేసినట్లు 14.29 ఫిట్మెంట్ ను సీఎం పక్కన పెట్టారు. అశుతోష్ కమిటీ సిఫార్సు చేసినట్లు 23 శాతం ఫిట్ మెంట్ ను సీఎం ఇచ్చారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యగులను జూన్ 30 లోపు కొత్త ఫిట్మెంట్ సహా క్రమబద్దీకరించాలని సీఎం నిర్ణయించారు. హామీలు అమలు కావడం అనేది ఏపీ జేఎసీ, ఏపీ జేఎసీ అమరావతి ఉద్యమ ఫలితమే. జగనన్న కాలనీలో 10 శాతం ఇళ్లు రిజర్వు చేసి 20 శాతం రిబేటుతో ఉద్యోగులకు ఇళ్లు ఇవ్వాలని సీఎం నిర్ణయంచారు. మేము ప్రభుత్వానికి 71 డిమాండ్లు ఇవ్వగా 50 డిమాండ్లకు పరిష్కారం దొరికింది.' బండి శ్రీనివాస్,ఎపీ జేఎసీ ఛైర్మన్
Also Read: జగన్ చుట్టూ ప్రమాదకర వ్యక్తులు ! ఎవరిని ఉద్దేశించి ఆర్జీవీ ఇలా చెబుతున్నారు ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి