News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

AP Bus And Movie Tickets : సినిమా టిక్కెట్ రేట్ల కాన్సెప్ట్ బస్ టిక్కెట్లకు వర్తించదా !? ఏపీ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది ?

ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల అంశంలో చేస్తున్న వాదన బస్ టిక్కెట్ల విషయంలో చేయడం లేదు. ప్రత్యేక బస్సుల పేరుతో యాభై శాతం అదనంగా వసూలు చేస్తోంది. దీనిపై విమర్శలు పెరుగుతున్నాయి.

FOLLOW US: 
Share:

సంక్రాంతికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ యాభై శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తామని ప్రకటించింది. ఆర్టీసీ చేస్తున్నది వ్యాపారమని ఉన్నతాదికారులు నిర్మోహమాటంగా ప్రకటించేశారు. బస్సు ఓ వైపు ఖాళీగా వస్తుందని అందుకని ఆ మాత్రం అదనపు చార్జీ వసూలు చేయాల్సిందేనని సమర్థించుకున్నారు. ఆర్టీసీ ఇలాంటి ప్రకటన చేయగానే అందరికీ సినిమా టిక్కెట్ రేట్లే గుర్తుకు వచ్చాయి. పండుగకు ప్రజలు సొంత ఊళ్లకు వెళ్లడం ఓ రకంగా తప్పనిసరి. కానీ సినిమాకు వెళ్లడం.. వెళ్లకపోవడం తప్పనిసరి కాదు. కానీ ప్రభుత్వం మాత్రం సినిమా టిక్కెట్ల విషయంలో పట్టుదలకు పోతూ అదే సమయంలో ఆర్టీసీ విషయంలో మాత్రం ప్రజల నుంచి అదనంగా వసూలు చేయాలని నిర్ణయించుకుంది. అందుకే ఈ అంశం చర్చనీయాంశమవుతోంది. 

Also Read: జగన్ చుట్టూ ప్రమాదకర వ్యక్తులు ! ఎవరిని ఉద్దేశించి ఆర్జీవీ ఇలా చెబుతున్నారు ?

దోపిడీ అంటూ సినిమా టికెట్ రేట్లను తగ్గించిన ప్రభుత్వం !

పండగ సీజన్లలో పెద్ద సినిమాలను విడుదల చేసి టిక్కెట్ రేట్లను పెంచి అభిమానాన్ని దోచుకుంటున్నారని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అందుకే టిక్కెట్ రేట్లను తగ్గిస్తున్నట్లుగా ప్రకటించింది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం సినిమాలకు ఖరారు చేసిన టిక్కెట్ రేట్లు పదేళ్ల కిందటివి. ఏ రాష్ట్రంలోనూ అంత మొత్తం తక్కువ టిక్కెట్ ధర లేదు. అందుకే టాలీవుడ్ ఇబ్బంది పడుతోంది. పెరిగిపోయిన ధియేటర్ నిర్వహణ ఖర్చలు.. సినిమా నిర్మాణ ఖర్చు అన్నీ కలిపి టిక్కెట్ రేట్లు గిట్టుబాటు కావని అంటోంది. కానీ ప్రభుత్వం మాత్రం పెంచేదే లేదని చెబుతోంది. పేదలకు వినోదం తక్కువ ధరకే అందిస్తామని.. వారిని దోపిడీ చేసే చర్యలకు అంగీకరించబోమని అంటోంది. ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉంది.  కోర్టు సూచనల మేరకు ప్రభుత్వం కమిటీని నియమించింది. 

Also Read: అడ్డంగా బుక్కైన బంగార్రాజు.. టికెట్‌ రేట్‌ ఇష్యూలో నాగార్జునపై ట్రోల్స్‌

వ్యాపారం అంటూ ప్రత్యేక బస్సుల్లో యాభై శాతం రేట్లను పంచిన ఏపీ ప్రభుత్వం !

ఈ వివాదం నడుస్తూండగానే ఏపీ ప్రభుత్వం సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో యాభై శాతం టిక్కెట్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై అందరూ ఒక్క సారిగా ఆశ్చర్యపోయారు. పేదల కోసం వినోదాన్ని అతి తక్కువకే అందించడానికి అతి తక్కువ ధరలను ఖరారు చేసిన ప్రభుత్వం ఆర్టీసీ విషయంలో పేదలపై భారం పడేలా యాభై శాతం చార్జీలను వడ్డించడం ఏమిటన్న అభిప్రాయం వినిపిస్తోంది. పైగా ఆర్టీసీ ప్రయాణం కొన్ని లక్షల మందికి తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ విధానం ప్రకారం చూస్తే చార్జీలు పెంచకూడదని .. పెంచదని అనుకున్నారు. కానీ అక్కడ జరిగింది వేరు. సినిమా టిక్కెట్ల వివాదం ఇంకా నడుస్తూండగానే ప్రభుత్వం ఏ మాత్రం తటపటాయించకుండా బస్ చార్జీలను యాభై శాతం అదనంగా వసూలు చేయడానికి అంగీకరించింది. 

Also Read: ఆర్జీవీ ట్విట్టర్ కౌంటర్స్.. ఇక కలిసే మాట్లాడుకుందామని చెప్పిన మంత్రి పేర్ని నాని.. కానీ..

ప్రభుత్వానిది వ్యాపారం... మరి సినిమా ఇండస్ట్రీదేంటి? 

ప్రభుత్వ విధానం ప్రకారం చూస్తే ప్రైవేటు వ్యక్తులు వ్యాపారాలను చేయాలంటే ప్రభుత్వ ధరల ప్రకారం చేయాలి. నష్టం వచ్చినా.. కష్టం వచ్చినా చేస్తే చేయాలి లేకపోతే లేదు. కానీ ప్రభుత్వం మాత్రం యథావిధిగా వ్యాపారం చేయవచ్చు. బస్సులు ఓ ట్రిప్ ఖాళీగా వస్తాయన్న ఉద్దేశంతో యాభై శాతం అదనపు చార్జీలకు అంగీకరించామని ప్రభుత్వం చెబుతోంది. అలా చేయడం వల్ల ఆర్టీసీకి నష్టాలు రావని వాదిస్తోంది. మరి ఇదే కాన్సెప్ట్ సినిమా వ్యాపారాల విషయంలో ప్రభుత్వం ఎందుకు అప్లయ్ చేయదనే ప్రశ్నలు కొన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీని దెబ్బకొట్టడానికే ఈ వ్యవహారం నడుపుతున్నారని ఇతర వర్గాలు చేస్తున్న విమర్శలకు ప్రభుత్వ విధానం బలపరిచేలా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

Also Read: కొడాలి నాని ఎవరో తెలియదు.. నాచురల్ స్టార్ నానీ ఒక్కడే తెలుసు! ఆర్జీవీ రివర్స్ పంచ్ రేంజే వేరు

 
సినిమా టికెట్ రేట్లు పెంచి.. ఆర్టీసీ చార్జీలను అంతే ఉంచిన తెలంగాణ !

పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం సినిమా టిక్కెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీనిపై అనేక మంది సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము సినిమాలకు వెళ్లబోమని ప్రకటించారు. సినిమా అనేది నిత్యావసరం కానీ.. అత్యావసరం కానీ కాదు. సినిమాకు వెళ్లకపోయినా అనేక వినోద సాధనాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అందుకే ప్రభుత్వం కూడా లైట్ తీసుకుంది. అదే సమయంలో తెలంగాణ సర్కార్ ఆర్టీసీలో పండుగ సందర్భంగా అదనపు చార్జీలను వసూలు చేయకూడదని నిర్ణయించుకుంది. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామని ఒక్క రూపాయి కూడా అదనపు చార్జీ వసూలు చేయబోమని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఏపీ, టీఎస్ ఆర్టీసీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఏపీ నుంచి ఎన్ని బస్సులు తెలంగాణకు వస్తే .. తెలంగాణ కూడా అన్ని బస్సులను ఏపీకి నడుపుకోవచ్చు. ప్రత్యేక బస్సుల్లోనూ ఇదే కోటా. అంటే విజయవాడకు హైదరాబాద్ నుంచి వంద బస్సులు వెళ్తే అందులో యాభై తెలంగాణ ఆర్టీసీవి ఉంటాయి. అయినప్పటికీ చార్జీలు పెంచాలని ఆ సంస్థ అనుకోలేదు. 

Also Read: పవన్ సినిమాకి సంపూ సినిమాకి తేడా లేనప్పుడు మీ ప్రభుత్వంలో మంత్రికి డ్రైవర్‌కి కూడా తేడా లేదా? ఆర్జీవీ స్ట్రాంగ్‌ కౌంటర్

తెలంగాణ సర్కార్‌కు ఉన్నంత ఆలోచన ఏపీ ప్రభుత్వానికి లేదా !?

సినిమా టిక్కెట్ రేట్లు పెంచితే .. ప్రజలకు భారం అయితే నష్టపోయేది సినిమా పరిశ్రమే. చూడటానికి ఎవరూ రాకపోతే వారికి కలెక్షన్లు రావు. తప్పనిసరిగా చూడాల‌న్న  పరిస్థితేమీ లేదు. కానీ ప్రయాణం అలా కాదు. పండుగను ఆత్మీయులతో జరుపుకోవాలంటే ప్రయాణం తప్పనిసరి. ప్రజల గురించి ఆలోచించేవారు ఎవరైనా ప్రయాణాలు భారం కాకుండా చూస్తారు. తెలంగాణ అదే చేసింది. కానీ ఏపీ మాత్రం మాది వ్యాపారం అంటోంది. రేటు తగ్గించేది లేదని చెబుతోంది. సినిమా టిక్కెట్లతో పోల్చి నెటిజన్లు విమర్శలు చేస్తున్నా.. ఏపీ సర్కార్ లైట్ తీసుకుంటోంది. 

Also Read: ఆర్జీవీ 10 ప్రశ్నలకు మంత్రి పేర్ని నాని కౌంటర్.. ‘ఆ ఫార్ములా ఏంటి వర్మగారూ’ అంటూ వరుస ట్వీట్లు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 
Published at : 07 Jan 2022 03:58 PM (IST) Tags: cm jagan Movie Ticket Controversy increase in bus ticket rates AP vs Telangana AP government business AP government harassment on cinema

ఇవి కూడా చూడండి

Nagarjuna Sagar Dam Issue: నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద మరోసారి ఉద్రిక్తత, జేసీబీలతో చేరుకుంటున్న టీఎస్ పోలీసులు

Nagarjuna Sagar Dam Issue: నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద మరోసారి ఉద్రిక్తత, జేసీబీలతో చేరుకుంటున్న టీఎస్ పోలీసులు

Anantapur News: వైద్యం వికటించి చిన్నారికి తీవ్ర అస్వస్థత, అధికారులు పట్టించుకోలేదని ఫ్యామిలీ ఆందోళన

Anantapur News: వైద్యం వికటించి చిన్నారికి తీవ్ర అస్వస్థత, అధికారులు పట్టించుకోలేదని ఫ్యామిలీ ఆందోళన

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మరో అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు - భారీగా నష్టం

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మరో అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు - భారీగా నష్టం

AP Govt Holidays: వచ్చేఏడాది 20 సాధారణ సెలవులు, జాబితా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

AP Govt Holidays: వచ్చేఏడాది 20 సాధారణ సెలవులు, జాబితా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

Chandrababu : తిరుమలకు చంద్రబాబు - వరుసగా ఐదో తేదీ వరకూ ఆలయాల సందర్శన !

Chandrababu :  తిరుమలకు చంద్రబాబు -  వరుసగా ఐదో తేదీ వరకూ ఆలయాల సందర్శన !

టాప్ స్టోరీస్

Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?

Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?

Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం

Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం

Vijay Rashmika: ఒకే తరహా డ్రెస్‌లో రష్మిక, విజయ్ దేవరకొండ - దొరికిపోయారుగా!

Vijay Rashmika: ఒకే తరహా డ్రెస్‌లో రష్మిక, విజయ్ దేవరకొండ - దొరికిపోయారుగా!

Anasuya Bharadwaj: రౌండ్ కళ్లద్దాలతో రంగమత్త - భలే బాగుంది కదూ!

Anasuya Bharadwaj: రౌండ్ కళ్లద్దాలతో రంగమత్త - భలే బాగుంది కదూ!