Night Curfew & 50% Occupancy in AP: ఏపీలో సినిమా వ్యాపారానికి మరో దెబ్బ... కొత్త సినిమాలకు కలెక్షన్లు రావడం కష్టమే!
అసలే ఏపీలో టికెట్ రేట్స్‌తో ఇబ్బందులు పడుతున్న సినిమా వ్యాపారం మీద కొవిడ్ మరో పిడుగు పడేసింది. దాంతో కొత్త సినిమాలకు కలెక్షన్లు రావడం కష్టం అనేది ట్రేడ్ వర్గాల అభిప్రాయం.
ఏపీలో సినిమా టికెట్ రేట్స్ తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన జీవో నం. 35 థియేటర్ వ్యాపారంపై ప్రభావం చూపుతోంది. నెల్లూరు జిల్లాలోని వి ఎపిక్ వంటి థియేటర్లు స్వచ్ఛందంగా మూసి వేయడానికి కారణమైంది. అసలే, ఏపీలో టికెట్ రేట్లు తక్కువ ఉండటంతో ఇబ్బందులు పడుతున్న సినిమా వ్యాపారం మీద కరోనా థర్డ్ వేవ్ మరో పిడుగు పడటానికి కారణం అయ్యింది. సారీ... కరోనా థర్డ్ వేవ్ రూపంలో మరో పిడుగు పడింది.
కరోనా థర్డ్ వేవ్ కారణంగా ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకూ కర్ఫ్యూ (ఆంక్షలు) అమలులో ఉంటుంది. దాంతో సెకండ్ షో వేయడానికి వీలు పడదు. ఒక షో పోయినట్టే. దీనికి తోడు రెస్టారెంట్లు, బార్లు, థియేటర్లు, ప్రభుత్వ ఆఫీసులు, హోటళ్లు 50 శాతం ఆక్యుపెన్సీతో రన్ చేయాలని పేర్కొంది. అంటే... మార్నింగ్, మ్యాట్నీ, ఫస్ట్ షోలు 50 పర్సెంట్ ఆక్యుపెన్సీతో రన్ చేయాలి. టికెట్ రేట్స్ తక్కువ అంటే... సగం సీటింగ్ కెపాసిటీతో షోలు వేస్తే కలెక్షన్లు విపరీతంగా తగ్గుతాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్న కొత్త సినిమాలకు కలెక్షన్లు రావడం కష్టమే.
ఏపీలో కరోనా థర్డ్ వేవ్ ఆంక్షల నేపథ్యంలో కొత్త సినిమాలు విడుదల అవుతాయా? లేదంటే వాయిదా వేసే నిర్ణయం తీసుకుంటారా? అనేది చూడాలి. అక్కినేని తండ్రీ కుమారులు నాగార్జున, నాగ చైతన్య నటించిన 'బంగార్రాజు' సినిమా బడ్జెట్‌తో పోలిస్తే... మిగతా సినిమాల బడ్జెట్లు తక్కువే. అవి వాయిదా పడే అవకాశాలు తక్కువ. మరి, 'బంగార్రాజు'ను ఏం చేస్తారో? ఇటీవల సినిమా టికెట్స్ మీద నాగార్జున తన అభిప్రాయం వెల్లడించారు. ప్రస్తుత టికెట్ రేట్స్ తన సినిమాకు చాలని చెప్పారు. మరి, 50 శాతం సీటింగ్ కెపాసిటీ అయినా విడుదల చేయవచ్చని అనుకుంటారో? లేదో? వెయిట్ అండ్ సీ.
Also Read: సినిమా టిక్కెట్ రేట్ల కాన్సెప్ట్ బస్ టిక్కెట్లకు వర్తించదా !? ఏపీ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది ?
సంక్రాంతికి 'బంగార్రాజు', 'రౌడీ బాయ్స్', 'ఉనికి', '7 డేస్ 6 నైట్స్', 'హీరో', 'సూపర్ మచ్చి', 'డీజే టిల్లు', తమిళ డబ్బింగ్ 'నా పేరు శివ 2' సినిమాలు విడుదల అవుతున్నాయి.
Also Read: ఏడిస్తే కష్టం పోతుందా? - దీప్తి సునయన లేటెస్ట్ పంచ్! బ్రేకప్ బాధ నుంచి బయటకొస్తోందా?
Also Read: మహేష్ నుంచి తమన్‌కు... తమన్ నుంచి ఎవరికి? నెక్స్ట్ ఎవరు??
Also Read: 'అతిథి దేవో భవ' రివ్యూ: ప్రేక్షకుల్ని అతిథుల్లా చూశారా? లేదా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.