Deepthi Sunaina: ఏడిస్తే కష్టం పోతుందా? - దీప్తి సునయన లేటెస్ట్ పంచ్! బ్రేకప్ బాధ నుంచి బయటకొస్తోందా?
యూట్యూబర్ దీప్తి సునయన లేటెస్ట్ పంచ్ డైలాగ్స్‌తో సోషల్ మీడియాలో వీక్షకుల ముందుకు వచ్చారు.

'కన్నీరై కురవాలా?
మన చుట్టూ ఉండే లోకం తడిసేలా...
ఎక్కిళ్లే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా? కదా!
మరి, ఎందుదుకు గోల??'
- ఇది ఎక్కడో విన్నట్టు ఉందా? 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి రాసిన ఓ పాటలో కొన్ని లైన్లు. ఇప్పుడీ పాటను దీప్తి సునయన పాడారు. పాడిన వీడియోను సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
రీసెంట్‌గా దీప్తి సునయన ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ ఇచ్చారు. అంతకు ముందే షణ్ముఖ్ జస్వంత్‌తో బ్రేకప్ గురించి వెల్లడించినా... లైవ్‌లో మరోసారి మాట్లాడారు. ఆ లైవ్ ఇచ్చినంతసేపూ ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు 'ఏడుస్తుంటే కష్టం పోతుందా?' అని అంటున్నారు. దీన్నిబట్టి ఏడుపు గోల ఎందుకని ఆమె అనుకుని ఉండవచ్చు. దీని కంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే...
'నేను పులి. మా డాడ్ (నాన్న) అలా పెంచారు' - ఇదీ దీప్తి సునయన ఇన్‌స్టాలో 2022లో తొలి వారం ఎలా గడిచిందన్నదీ చెబుతూ పోస్ట్ చేసిన ఫొటోలకు, వీడియోలకు ఇచ్చిన కాప్షన్. తనను తాను పులిగా ఆమె వర్ణించుకున్నారు. ఏడుపు ఎందుకంటూ ధైర్యాన్ని ఇచ్చుకుంటున్నారు.
View this post on Instagram
దీప్తి సునయన వ్యవహారం చూస్తుంటే... బ్రేకప్ బాధ నుంచి బయట పడటానికి ట్రై చేస్తున్నట్టు ఉంది. బ్రేకప్ తర్వాత దీప్తి సునయన తండ్రికి మరింత దగ్గర అవుతున్నట్టు అనిపిస్తోంది. గతంలోనూ ఆమె తండ్రితో దిగిన ఫొటోలు, వీడియోలు షేర్ చేశారు. అయితే... బ్రేకప్ తర్వాత తన తండ్రే తనకు నైతిక ధైర్యం అని పేర్కొన్నారు. ఏది ఏమైనా దీప్తి సునయన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు.
View this post on Instagram
Also Read: మహేష్ నుంచి తమన్‌కు... తమన్ నుంచి ఎవరికి? నెక్స్ట్ ఎవరు??
Also Read: 'అతిథి దేవో భవ' రివ్యూ: ప్రేక్షకుల్ని అతిథుల్లా చూశారా? లేదా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

