By: ABP Desam | Updated at : 08 Jan 2022 02:58 PM (IST)
కుటుంబం ఆత్మహత్య
విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సూసైడ్ చేసుకోవడం విజయవాడలో కలకలం రేపుతోంది. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన వారు విగత జీవులుగా మారడం వారి బంధువులకు విషాదాన్ని మిగిల్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కుటుంబం విజయవాడ కనక దుర్గమ్మ దర్శనానికి వచ్చినట్లు సమాచారం.
తెలంగాణలోని నిజామాబాద్ ప్రాంతానికి చెందిన పప్పుల సురేష్, శ్రీలత దంపతులు తమ కుమారులతో పాటు ఏపీలోని విజయవాడ సన్నిధికి వెళ్లారు. పప్పుల అఖిల్ పెద్ద కుమారుడు కాగా, వయసు 28. పప్పుల ఆశిష్ చిన్న కుమారుడు వయసు 22 ఏళ్లు. ఇతడు నిజామాబాద్‌లో బీఫార్మసీ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే దుర్గమ్మ దర్శనం కోసం వచ్చిన పప్పుల రమేష్ కుటుంబం విజయవాడలోని కన్యకా పరమేశ్వరి సత్రంలో దిగారు. ఏం జరిగిందో తెలియదు గానీ దుర్గమ్మ దర్శనానికి వచ్చిన కుటుంబం సూసైడ్ చేసుకుంది.
తల్లి శ్రీలత, చిన్న కుమారుడు ఆశిష్ సత్రంలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. రూమ్.నెం.312 లో పప్పుల శ్రీలత(54), ఆశిష్ (22) మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఇదే సమయంలో కృష్ణా నదిలో దూకిన తండ్రి పప్పుల రమేష్,పెద్ద కుమారుడు అఖిల్ గల్లంతయ్యారు. అతికష్టమ్మీద గజ ఈతగాళ్లు రమేష్ (56) మృతదేహాన్ని వెలికితీశారు. అఖిల్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇతడు నిజామాబాద్‌లో ఓ పెట్రోల్ బంకును లీజుకు తీసుకుని నడుపుతున్నాడని సమాచారం.
బంధువులకు మెస్సేజ్..
అఖిల్ పేరిట సత్రంలో గది బుక్ చేసుకున్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత 2:30 గంటల ప్రాంతంలో బంధువులకు మెస్సేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధతో తమ కుటుంబం ఆత్మహత్య చేసుకుని చనిపోతుందని బంధువులకు మెస్సేజ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
Also Read: వనమా రాఘవ ఆగడాలకు అడ్డేలేదా?... ఆది నుంచి ఆరోపణల పర్వమే...!
Also Read: Covid Updates: తెలంగాణలో పెరుగుతున్న కరోనా ఉద్ధృతి... ఒక్క రోజులో 2 వేలకు పైగా కేసులు, ముగ్గురు మృతి
Hayath Nagar Crime : హయత్ నగర్ లో మరోసారి చెడ్డీ గ్యాంగ్ అలజడి, గేటెడ్ కమ్యూనిటీలో చోరీ
Vikarabad News : ప్రియుడి ఇంట్లో యువతి ఆత్మహత్యాయత్నం, పెళ్లికి పది లక్షల కట్నం డిమాండ్ చేసిన యువకుడు!
Anantapur News : అనంతలో ఉన్నతాధికారి ఆత్మహత్య, ఉసురు తీసిన ఆన్లైన్ బిజినెస్!
Hyderabad: హైదరాబాద్‌లో చైల్డ్ పోర్న్ ముఠాలు, ఈ 3 ప్రాంతాల నుంచి వీడియోలు అప్లోడ్! అదుపులోకి ముగ్గురు?
Crime News: కూతుళ్లతోనే ప్రియుడి భార్య హత్యకు స్కెచ్- సీరియల్స్ విలన్స్‌కు మించిన కంత్రీ ప్లాన్ ఇది!
Rishi Sunak Profile: ఇంగ్లాండ్ ప్రధాని రేసులో ఇండియా సంతతి వ్యక్తి- రిషి సునక్ ఎవరో తెలుసా?
YSRCP Plenary 2022 : ప్లీనరీ సక్సెస్ చూసి చంద్రబాబు మళ్లీ బోరు బోరున ఏడుస్తారు - ఎంపీ విజయసాయి రెడ్డి
Corona New Variant : భారత్‌లో మరో కొత్తరకం వేరియంట్ - కొత్త వైరస్‌ను కనిపెట్టిన డబ్ల్యూహెచ్‌వో !
IND-W vs SL-W, 3rd ODI: హర్మన్ ప్రీత్ డిస్ట్రక్షన్! లంకను కుప్పకూల్చిన రాజేశ్వరీ, మేఘనా