By: ABP Desam | Updated at : 06 Jan 2022 06:46 PM (IST)
వనమా రాఘవేంద్రరావు
వనమా రాఘవేంద్రరావు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మారు మోగుతున్న పేరు.. నలుగురు కుటుంబ సభ్యులు ఒకేసారి చనిపోయిన సంఘటనలో కీలక ముద్దాయిగా ఉన్న వనమా రాఘవ చరిత్ర చూస్తే ఆది నుంచి ఆరోపణల పర్వమే. తన తండ్రి వనమా వెంకటేశ్వరరావు పంచాయతీ వార్డు మెంబర్ నుంచి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినప్పటికీ వనమా రాఘవ తీరు మాత్రం మారలేదు. ఆది నుంచి అనేక హత్య ఆరోపణలతోపాటు బెదిరింపులు, భూ కబ్జాల పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తినప్పటికీ రాజకీయ అండదండలతో కేసుల నుంచి తప్పించుకున్నాడనే కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు భావిస్తుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో వనమా వెంకటేశ్వరరావు రాష్ట్ర వైద్య విధానపరిషత్ మంత్రిగా పనిచేసినప్పటికీ వరుసగా రెండు సార్లు ఓటమి పాలు కావడానికి వనమా రాఘవే కారణమని నియోజకవర్గ ప్రజలు చెబుతుంటారు. అయితే ఎనిమిది పదుల వయస్సులో పడిన వనమా వెంకటేశ్వరరావు తన చివరి కోరికగా 2018 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినప్పటికీ రాఘవ తీరు మాత్రం మారలేదు.
రాఘవ చుట్టూ నేరారోపణలే..
తండ్రి ఎమ్మెల్యే పనిచేస్తున్న ప్రతిసారీ నియోజకవర్గంలో రాజకీయాల్లో తలదూర్చడంతోపాటు బెదిరింపులకు పాల్పడే రాఘవ జీవిత చరిత్ర మొత్తం నేరారోపణల మయంగా మారింది. పాత పాల్వంచలో చర్ల చిట్టయ్య అనే దళితుడు మరణానికి రాఘవ కారణమనే ఆరోపణలున్నాయి. దీంతోపాటు పాల్వంచలో పనిచేసిన ఓ ఎస్సై ఆత్మహత్య విషయంలో రాఘవపై ఆరోపణలు వచ్చాయి. 2018లో వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రాఘవ ఆగడాలకు అడ్డుకట్టలేకుండా పోయిందని సొంత పార్టీ అనుచరులే పేర్కొనడం గమనార్హం. నవభారత్‌కు చెందిన ఓ గిరిజన మహిళను వేధించడంతో ఇతనిపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదైంది. దీంతోపాటు పాల్వంచ పట్టణంలో ఓ ముస్లీం మహిళకు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేశాడనే ఆరోపణలున్నాయి. ఇదే కాకుండా ఆరు నెలల క్రితం పాల్వంచ పట్టణానికి చెందిన వడ్డీ వ్యాపారి ఆత్మహత్యకు కారణం రాఘవ అని చనిపోయిన వడ్డీ వ్యాపారి వెంకటేశ్వర్లు తన సూసైడ్ నోట్‌లో రాయడంతో రాఘవపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది నియోజకవర్గంలో పెద్ద చర్చానీయాంశంగా మారింది. ఆ తర్వాత కొద్ది కాలం స్థబ్దుగా ఉన్న వనమా రాఘవేంద్రరావు... నాగా రామకృష్ణ కుటుంబం సజీవదహనానికి కారణమని ఆరోపణలు వస్తున్నాయి.
Also Read: Pigeon News: భయపెడుతున్న పావురాలు.. కాలికి పసుపురంగు ట్యాగ్, దానిపై ఆ కోడ్ ఏంటి? అక్కడ కూడా ఇలాగే..
నియోజకవర్గంలో ప్రశ్నించే గొంతుకలే టార్గెట్..
తండ్రి పదవిని అడ్డుపెట్టుకున్న వనమా రాఘవ నియోజకవర్గంలో తానే అంతా బాస్‌గా వ్యవహరిస్తుంటాడు. గతంలో వివిధ పార్టీలకు చెందిన బలమైన నాయకులు ఉండటంతో కొద్దిగా జంకిన రాఘవ 2018 ఎన్నికల తర్వాత వనమా కుటుంబానికి ఎదురు నిలిచేవారు నియోజకవర్గంలో ఉండకపోవడం, కొంత మంది అతని వ్యవహారంలో తల దూర్చకపోతుండటంతో ఎమ్మెల్యే ఇంటిని కాస్త సెటిల్‌మెంట్ వ్యవహారాలకు అడ్డాగా మార్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఓ హోటల్ యజమాని కుటుంబ విషయాల్లో ఏకంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోనే బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతోపాటు నియోజకవర్గంలోని అధికారులను సైతం తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు బెదిరింపులకు పాల్పడుతుంటాడనే ఆరోపణలున్నాయి. రాజకీయ బహిరంగ సభలకు సైతం అధికారులు జనాలను తరలించాలనే హుకుం జారీ చేయడంతో ఇటీవల ప్రభుత్వ అధికారులు ఇతని వ్యవహర శైలిపై ఆగ్రహంతో ఉన్నారు. అయితే అధికార పార్టీలో ఉండటంతో ఏమి అనలేక కిమ్మనకుంటున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కొత్తగూడెం నియోజకవర్గంలో ఇప్పటి వరకు వనమా రాఘవేంద్రరావు చేసిన ఆగడాలు ఇప్పుడు వరుసగా జరిగిన రెండు ఆత్మహత్యల కేసులతో బహిర్గతం కావడంతో స్థానిక ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులతో కలిసి నాగ రామకృష్ణ ఆత్మహత్యకు పాల్పడటం, రామకృష్ణ చనిపోయే ముందు తీసుకున్న సెల్పీ వీడియో బయటకు రావడంతో ప్రజలు వనమా కుటుంబంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అయితే ఈ పరిణామాలు రాజకీయంగా ఎటు దారితీస్తాయనే విషయం మాత్రం వేచి చూడాల్సిందే.
Petrol Diesel Price 18th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్వల్పంగా తగ్గిన పెట్రోల్, పెరిగిన డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా
Breaking News Live Updates : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు సజీవదహనం
Gold Silver Price Today 18th May 2022 : గోల్డ్ ప్రియులకు షాకింగ్ న్యూస్, నేడు భారీగా పెరిగిన బంగారం రేట్స్, స్వల్పంగా పెరిగిన వెండి
Weather Updates : తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు
Woman Police SHO: మరో మహిళా పోలీస్‌కు అరుదైన గౌరవం, ఎస్‌హెచ్‌వోగా నియమించిన నగర కమిషనర్
Astrology: మీరు నవంబరులో పుట్టారా, ఆ ఒక్క లక్షణం మార్చుకుంటే మీరే రాజు మీరే మంత్రి
YSRCP Rajyasabha Equation : వైఎస్ఆర్సీపీలో అర్హులు లేరా ? రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?
Today Panchang 18th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, వినాయక శ్లోకం
Fat Removal Surgery: కొవ్వును కరిగించే లైపోసక్షన్ ఆపరేషన్ ఎలా చేస్తారు? అది ప్రాణాలు తీసేంత ప్రమాదకరంగా ఎందుకు మారుతోంది?