YS Reddy: ఈడీకి చిక్కిన వైఎస్ రెడ్డి - ఇంట్లో నోట్ల గుట్ట - కేజీల కొద్దీ బంగారం - ఎవరో తెలుసా ?
ED: వైఎస్ రెడ్డి అనే ముంబై అధికారిని ఈడీ అరెస్టు చేసింది. ఆయన ఇంట్లో పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు.

ED arrests Mumbai officer YS Reddy: ముంబైలో టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తున్న వైఎస్ రెడ్డి అనే వ్యక్తిని ఈడీ అరెస్టు చేసింది. ముంబై, హైదరాబాద్ తో పాటు 12 చోట్ల సోదాలు నిర్వహించిన ఈ డి నగదు, నగలు స్వాధీనం చేసుకుంది. మొత్తం 9 కోట్లు ఐదు వందల నోట్లు దొరికాయి. 8 కోట్ల రూపాయల విలువచేసే బంగారు ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇతర ఆభరణాలతో కలిపి మొత్తం 23 కోట్ల రూపాయల విలువచేసే నగలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ముంబైలో 41 భవనాలకు అక్రమ అనుమతులు ఇచ్చారని ఆరోపణలపై ఈడి కేసు నమోదు చేసింది. బిల్డర్స్ తో కుమ్మక్కై అనధికారికంగా అనుమతులు ఇచ్చినట్లు గుర్తించారు.
ED, Mumbai has conducted search operations at 13 different locations across Mumbai and Hyderabad under the provisions of the PMLA, 2002 on 14.05.2025 &15.05.2025. The Search operation led to seizure of Rs. 9.04 Crore (approx.) cash and Rs. 23.25 Crore worth of Diamond studded… pic.twitter.com/PLbDtpQPOD
— ED (@dir_ed) May 15, 2025
అనధికార భవన అనుమతుల ద్వారా మనీ లాండరింగ్‌కు సంబంధించిన కార్యకలాపాలు జరిగినట్లు ఈడీ తేల్చిది. ఈ కేసు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA), 2002 కింద నమోదు చేశారు. ఈడీ హైదరాబాద్ మరియు ముంబైలోని వై.ఎస్. రెడ్డి నివాసాలు, కార్యాలయాలలో సోదాలు నిర్వహించి, అక్రమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను సేకరించింది. ఈడీ అధికారులు గణనీయమైన మొత్తంలో నగదు, బంగారం, మరియు వజ్రాలను స్వాధీనం చేశారు. ఈ కేసులో ఇతర వ్యక్తులు లేదా సంస్థల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
వాసాయి-విరార్ ప్రాంతంలో దశాబ్ద కాలంగా అవినీతికి పాల్పడుతున్నారు. మురుగునీటి శుద్ధి, డంపింగ్ కోసం ఉద్దేశించిన భూమిపై అక్రమంగా నలభై ఒక్క భవనాలు నిర్మించారు. ఎప్పుడూ అమ్మకూడని లేదా నిర్మించకూడని భూమిగా దాన్ని నిర్దారించరాు. అయితే సంవత్సరాలుగా, బిల్డర్లు నకిలీ అనుమతులను ఉపయోగించి ఈ ఫ్లాట్‌లను కొనుగోలుదారులకు విక్రయించారు. వాసాయి-విరార్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోలేదు. ఈ వైఎస్ రెడ్డి కీలకంగా ఉన్నారు. ఈ నిర్మాణాలను కూల్చివేయాలని బాంబే హైకోర్టు కూల్చివేతకు ఆదేశించింది. సుప్రీంకోర్టు దానిని సమర్థించింది.
ED #Mumbai seizes ₹8.6 crore cash and ₹23.2 crore worth of diamond-studded jewellery and bullion from #VVMC Deputy Town Planner Y.S. Reddy’s #Hyderabad home. The seizure is part of an ongoing probe into the illegal construction scam in Vasai Virar. pic.twitter.com/RfPB3c7ZaL
— shinenewshyd (@shinenewshyd) May 15, 2025





















