Viral News : పదమూడేళ్ల బాలుడితో వెళ్లిపోయిన టీచర్ - ప్రెగ్నెంట్ కూడా - పోక్సో కేసు పెట్టారు కానీ ..
Gujarat: గుజరాత్ లో ఓ ట్యూటర్ తన వద్ద ట్యూషన్ కు వచ్చే పదమూడేళ్ల బాలుడితో వెళ్లిపోయింది. తర్వాత పట్టుకున్నారు. కానీ ఇప్పుడామె గర్భం దాల్చింది.

Female Tutor abducts minor boy becomes pregnant: విద్యార్థుల్ని లోబర్చుకుని వారితో లైంగిక కోరికలు తీర్చుకునే టీచర్ల గురించి ముఖ్యంగా మహిళా టీచర్ల గురించి విదేశాల్లో కేసులు నమోదవుతూ ఉంటాయి. భారత్ లో అలాంటివి చాలా తక్కువ.కానీ ఇప్పుడు భారత్ లోనూ అలాంటి కేసులు నమోదవుతున్నాయి. గుజరాత్‌లో 13 ఏళ్ల విద్యార్థితో కలిసి వెళ్లిపోయిదో 23 ఏళ్ల మహిళా ట్యూటర్. ఆమెను వెదికి పట్టుకుని అరెస్టు చేశారు. ఇది కొద్ది రోజుల కిందటి ఘటన. ఆమె అరెస్టు తర్వాత, ఆమె 20 వారాల గర్భవతి అని వెల్లడైంది. ఆ చిన్న పిల్లవాడితోనే బిడ్డను కంటున్నదా.. ఇంకెవరైనా ఉన్నారా అన్న అంశం తేల్చేందుకు పోలీసులు డీఎన్ఎ టెస్టులు నిర్వహించాలనుకున్నారు. శాంపిల్స్ తీసుకుని ల్యాబ్ కు పంపారు. అయితే తాను అబార్షన్ చేయించుకుంటానని ఆమె విజ్ఞప్తి చేసింది.
గుజరాత్‌లోని సూరత్‌లో ఈ కేసు సంచలనం సృష్టించింది. బాలుడు కనిపించడం లేదని కేసు నమోదు అయిన తర్వాత పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఐదు రోజుల తర్వాత రాజస్థాన్ సరిహద్దులో ఆ బాలుడ్ని గుర్తించారు. ఆ బాలుడితో పాటు ఉన్న ట్యూషన్ టీచర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై పోక్సో కేసు పెట్టి అరెస్టు చేశారు. దర్యాప్తు లో ఆమె మైనర్‌తో లైంగిక చర్యలో పాల్గొన్నట్లు అంగీకరించింది . ఆమె ఆ బాలుడితో లైంగిక చర్య వల్ల గర్భం దాల్చిందా లేదా అన్నది తేల్చేందుకు DNA నమూనాను సేకరించి ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపారు. ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.
23-year-old unmarried teacher from #Surat, #Gujarat , caught after abducting a 13-year-old student, found pregnant—court grants abortion nod. Medical termination begins today amid deepening investigation@jayanthjacob @NewIndianXpress @santwana99 pic.twitter.com/SX7gm8FYAa
— Dilip Kshatriya (@Kshatriyadilip) May 14, 2025
DNA ఫలితాలు రావడానికి ముందే ట్యూషన్ టీచర్ గర్భాన్ని తొలగించుకోవడానికి అనుమతి కోరుతూ కోర్టును ఆశ్రయించింది. పోలీసులు కోర్టులో కౌంటర్ దాఖలు చేయడానికి అదనపు సమయం కోరారు. జైలు ఆసుపత్రి గైనకాలజీ విభాగం ఆ మహిళ 20 వారాల మూడు రోజుల గర్భవతి అని నిర్ధారిస్తూ నివేదికను అందించింది. గర్భం కొనసాగించడం వల్ల అవివాహిత మహిళకు తీవ్రమైన మానసిక , సామాజిక పరిణామాలు ఎదుర్కోవచ్చని వైద్యులు చెప్పారు. వైద్యుల నివేదిక మేరకు కొన్ని పరిస్థితులలో 22 వారాల వరకు గర్భస్రావం చేయడానికి అనుమతించే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MTP) చట్టం ప్రకారం, కోర్టు ఆ అభ్యర్థనను ఆమోదించింది.
చట్టపరమైన ప్రోటోకాల్‌లను పాటిస్తూ పోలీస్ ఇన్‌స్పెక్టర్ POCSO కోర్టుకు వైద్య పత్రాలను సమర్పించారు. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టం కింద చర్యలు తీసుకోవడానికి, సాక్ష్యంగా DNA ఫలితాలు కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. మైనర్‌ను అపహరించినందుకు ట్యూటర్‌పై ఇప్పటికే BNS సెక్షన్ 137 (2) కింద కేసు నమోదు చేశారు.





















