Hair Transplant Scam: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ పేరుతో డాక్టర్ అనుష్క మోసం - ఇద్దరు మృతి - ఇంత ఘోరం ఎలా జరిగిందంటే ?
Kanpur: హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ తక్కువ ధరకే చేస్తామని అనుష్క అనే డాక్టర్ ఆస్పత్రి ప్రారంభించారు. కానీ ఆమె నిర్వాకంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.

Kanpur Hair Transplant Horror: వయసు చిన్నదే కానీ జుట్టు అంతా రాలిపోయిందన్న బెంగతో వారు హెయిర్ ట్రాన్స్ ప్రాంటేషన్ కు వెళ్లారు. కానీ ఇద్దరి ప్రాణాలు పోయాయి. ఈ ఘటన యూపీలోని కాన్పూర్ లో జరిగింది.
- కాన్పూర్‌లోని పన్కీ పవర్ హౌస్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి రావత్‌పూర్ థానా పరిధిలోని ఒక ప్రైవేట్ క్లినిక్‌లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స తీసుకున్నాడు. చికిత్స సమయంలో అతనికి ఇంజెక్షన్ ఇచ్చారు. దాంతో అతని ముఖంపై తీవ్రమైన వాపు వచ్చింది. క్రమంగా అతను లేవలేని స్థితికి వెళ్లాడు. వెంటనే ఆ యువకుడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయినా ప్రయోజనం లేకపోయింది. చనిపోయాడు. వైద్యం రాకుండా చికిత్స చేశారని.. హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ పేరుతో తప్పుడు ఇంజెక్షన్ ఇచ్చారని చనిపోయిన వ్యక్తి కుటుంబసభ్యులు సీఎంకు ఫిర్యాదు చేశారు. చివరికి 54 రోజుల తర్వాత రావత్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేశారు.
कानपुर में हेयर ट्रांसप्लांट से एक और इंजीनियर की मौत l
— Sanjay Kumar (@SanjayK06194605) May 14, 2025
हेयर ट्रांसप्लांट के बाद रात भर दर्द से कराहता रहा l
इंपायर क्लीनिक की dr अनुष्का तिवारी से करवाया था ट्रांसप्लांट l pic.twitter.com/AVAtyfBHrc
ఈ వివాదం జరుగుతున్న సమయంలోనే మరో ఇంజనీర్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స సమయంలో సందిగ్ధ పరిస్థితుల్లో మరణించాడు. ఈ వ్యక్తి చికిత్స తర్వాత తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడని, అతని ముఖం కూడా వాచిపోయిందని అతని తల్లి తెలిపింది. రాత్రంతా బాధతో విలవిల్లాడిపోయి తన ఒడిలోనే చనిపోయాడని ఆ వ్యక్తి తల్లి కన్నీరుమున్నీరవుతోంది.
As per allegations by families two men died after hair transplant by Dr Anushka Tiwari of Kanpur. Instant FIR must be registered against this female doctor and harshest punishment must be given. @kanpurnagarpol @Uppolice @myogiadityanath #MenToo #NuclearLeak #BoycottTurkey pic.twitter.com/E62LouahyB
— Saurabh Bahuguna46 (@bahuguna46) May 15, 2025
#Currentlyreading UP: Another engineer dies after hair transplant in Kanpur, probe ordered https://t.co/dR2IQom8Ty @kanpurnagarpol @UPGovt @homeupgov pic.twitter.com/4K4a8KLdpD
— The Lucknow Journal (@Ambuj_t_Lko) May 14, 2025
ఈ రెండు మరణఆలు డాక్టర్ అనుష్కా తివారీ నడిపే క్లినిక్‌లో జరిగాయి. ఆమెపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి డాక్టర్ అనుష్కా తివారీని "సీరియల్ కిల్లర్" అని పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స సమయంలో ఇద్దరు ఇంజనీర్ల మరణాలు స్థానికంగా షాక్‌కు గురిచేశాయి. వైద్య సేవల నాణ్యతపై తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీస్ , వైద్య కమిటీ దర్యాప్తు కొనసాగుతోంది.ప్రస్తుతం డాక్టర్ అనుష్క పరారీలో ఉన్నారు.





















