Pakistan Comedy: మోడీ లాగే ఎయిర్ బేస్‌కు వెళ్లిన పాకిస్తాన్ ప్రధాని - పాక్ దరిద్రాన్ని చూసి నవ్వాపుకోలేరు ! వీడియో
PM Sharif: పాక్ ప్రధాని ఎయిర్ బేస్ పర్యటన నవ్వుల పాలవుతోంది. పాకిస్తాన్ దరిద్రాన్ని సాక్ష్యాలతో సహా ప్రధాని చూపించేశారని సెటైర్లు వేస్తున్నారు.

Pakistan PM visit to air base draws laughter : పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే ఎలా ఉంటుంది..? . నక్కను చూసి నవ్వాపుకోలేరు. అలాంటి పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్ కు ఎదురవుతోంది. అందరూ పాకిస్తాన్ దరిద్రాన్ని చూసి నవ్వుతున్నారు.
భారత ప్రధాని నరేంద్రమోదీ పాకిస్తాన్ సరిహద్దులోని అదంపూర్ ఎయిర్ బేస్ కు వెళ్లారు. అక్కడి నుంచి పాకిస్తాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మోదీని చూసి.. పాకిస్తాన్ ప్రధాని కూడా అలాగే వెళ్లాలనుకున్నాడు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ తో కలిసి వెళ్లారు.
ఆ వీడియోను పాకిస్తాన్ ప్రభుతవం రిలీజ్ చేశారు. కానీ ఆ వీడియోను చూసిన వారు పాకిస్తాన్ దుస్థితి ఇంత ఘోరంగా ఉందని చూసుకుని నవ్వుకుంటున్నారు. పాకిస్తాన్ ప్రధాని వెళ్లిన ప్రాంతం ఎయిర్ బేసో.. ఆర్మీబేసో తెలియదు. ఎదో అడవుల్లో దాక్కున్న వాళ్లను కలవడానికి వెళ్లినట్లుగా వెళ్లారు. ఆ బేస్ లో ఒక్క కట్టడం లేదు. గోనెపట్టాలు కట్టుకుని దాని కింద సైనికులు సేదదీరుతున్నారు.
FAKE IT LIKE PAK: Location far away from the likely damaged airfield (one can see some choppers stationed at a distance). Speech from a random field with a flex sheet depicting tanks that had no role to play. Stark contrast to Modi at Adampur tarmac with S400 and MiG29. pic.twitter.com/0xbsvYm9UQ
— Rahul Shivshankar (@RShivshankar) May 15, 2025
అక్కడికి వెళ్లడానికి పాక్ ప్రధాని గతుకుల రోడ్డులో కిందా మీదా పడుతూ వెల్లారు. పోని అక్కడ ప్రధాని సైనికులతో మాట్లాడటానికి ఓ వేదిక ఉందా అంటే అదీ లేదు. గడ్డితో కప్పేసిన యుద్ధట్యాంకు మీద నిల్చుని మాట్లాడారు. అంతకు మించి ఆ సైనికుల దగ్గర కూడా ఎలాంటి ఆయుధాలు కనిపించలేదు.
భారత ప్రధాని అదంపూర్ కు ఎయిర్ ఫోర్స్ విమానంలో వెళ్లారు. అత్యాధునిక ఆయుధాలను చూపించారు. పాకిస్తాన్ ధ్వంసం చేశామని చెప్పుకున్న వాటిని చూపించారు. కానీ పాక్ ప్రధాని తమ దగ్గర రైఫిల్స్ ఉన్నాయని కూడా చూపించుకోలేకపోయారు.
Every master piece has its cheap copy!
— North East West South (@prawasitv) May 14, 2025
In a copy cat move Pakistan PM and Army Chief Asim Munir and a few visit Pasrur cantonment
Pasrur cantonment situated in Sialkot and it is the least damaged military base!
As you all know yesterday Modi visit Adampur airbase and meet… pic.twitter.com/BatcKs2cQ7
పాక్ ప్రభుత్వం విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. పాక్ పరిస్థితిఘోరంగా ఉందని ఇప్పుడు సాక్ష్యాలతో సహా అర్థమయిందని సెటైర్లు వేస్తున్నారు.





















