అన్వేషించండి

Baloch Liberation Army : పాకిస్తాన్‌కు ముంచుకొస్తున్న ప్రమాదం- క్వెట్టా, మస్టుంగ్‌లో బిఎల్ఏ దాడి

Baloch Liberation Army : పాకిస్థాన్‌కు బలూచ్ లిబరేషన్ ఆర్మీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పాక్ సైన్యం వారికి సపోర్ట్ చేసేవారిపై దాడి చేస్తోంది. తాజాగా క్వెట్టా, మస్టుంగ్‌లో అటాక్ చేసింది.

Baloch Liberation Army : భారత్‌తో జరిగిన ఘర్షణలో పాకిస్థాన్‌ సైనిక పటిమ ఎంతో ప్రపంచానికి అర్థమైపోయింది. బయటకు చెప్పుకునేంత శక్తి లేదని అంతా ఢాంబికాలేనని స్పష్టమైంది. ప్రత్యేక దేశం కోసం పోరాటం చేస్తున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ పట్టు సాధించే ప్రయత్నాల్లో ఉంది. అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఆ సంస్థ దాడులు చేస్తోంది. పాకిస్థాన్ సైన్యాన్ని పరుగెత్తిస్తోంది.  

భారీ విధ్వంసం ఎదురైనప్పటికీ ఆ దేశ ప్రజలను మభ్య పెట్టడానికి భారత్‌పై విజయం సాధించామని సంబరాలు చేసుకుంది పాకిస్థాన్. ఈ సంబరాలను క్వెట్టాలో కూడా చేపట్టింది. అక్కడ బలంగా ఉన్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ దీన్ని వ్యతిరేకించింది. దీంతో బిఎల్ఏకు పాక్ సైన్యానికి మధ్య ఘర్షణ జరిగింది. పాకిస్తాన్ సైన్యం రక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించింది ఎమ్మెల్యే అలీ మదద్ జట్టక్. కార్యక్రమం ప్రారంభానికి ముందు మునీర్ మెంగల్ రోడ్డుపై గ్రెనేడ్ దాడి జరిగింది, దీనిలో ఒక సైనికుడు మరణించగా 12 మంది గాయపడ్డారు.

బీఎల్‌ఏకు స్థానికుల నుంచి భారీ మద్దతు 

ఈ దాడి కేవలం భద్రతా లోపం మాత్రమే కాదు, బలూచ్ ఉద్యమం ప్రతీకారానికి నిదర్శనంగా చెబుతున్నారు. బలూచ్‌స్తాన్‌పై ఆక్రమణ కొనసాగుతున్నంత వరకు ఇలాంటి దాడులు తప్పవని బిఎల్ఏ స్పష్టం చేసింది. అంతేకాకుండా, మస్తుంగ్‌లోని ఎంసీసీ క్రాస్‌లో ఉన్న పాకిస్తాన్ సైన్యం బంకర్‌పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసింది. ఈ దాడిలో 4 మంది పాకిస్తాన్ సైనికులు గాయపడ్డారు. ఈ బంకర్ బలూచ్ ప్రజలకు అణచివేత కేంద్రంగా మారింది.  

బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధి జియాండ్ బలూచ్ ఏమన్నారంటే?

బిఎల్ఏ ఈ దాడిని ప్రతీకార చర్యగా అభివర్ణిస్తూ, బలూచ్ ప్రజల గౌరవం, భద్రతతో చెలగాటం ఇక సహించబోమని స్పష్టం చేశారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధి జియాండ్ బలూచ్ విడుదల చేసిన ప్రకటనలో, బలూచ్‌స్తాన్‌లో ఎక్కడా పాకిస్తాన్ సైన్యానికి భద్రత లేదని ప్రపంచం చూస్తోందని పేర్కొన్నారు. బలూచ్ ప్రజల మద్దతు నిరంతరం బలాన్ని ఇస్తోంది. బలూచ్ ఉద్యమం వేర్పాటువాదం మాత్రమే కాదని, ప్రజా మద్దతుతో నడిచే ఉద్యమంగా మారింది' అని పాకిస్తాన్ ప్రభుత్వానికి, ప్రపంచానికి తెలియజేసింది.  

వాస్తవాన్ని వదిలేసి విదేశీ శక్తులు ఉన్నాయని ఆరోపిస్తున్న పాకిస్థాన్ 

బలూచ్ లిబరేషన్ ఆర్మీ తమకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని, పాకిస్తాన్ పాలనకు ఇది హెచ్చరిక అని వార్నింగ్ ఇచ్చింది. బలూచీస్తాన్‌లో భయోత్పాతం,  నియంత్రణ విధానం ఇక పనిచేయదని ఇది స్పష్టం చేస్తుంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ దాడులను ఉగ్రవాద ఘటనలుగా అభివర్ణిస్తూ క్వెట్టాలో భద్రతను కట్టుదిట్టం చేసింది. రోడ్డు మూసివేతల ద్వారా నగరాన్ని గుప్పెట్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది, కానీ స్థానికులు దీని వల్ల పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారారని అంటున్నారు. బలూచ్ ఉద్యమానికి 'విదేశీ శక్తుల' మద్దతు ఉందని ప్రభుత్వ ప్రకటనల్లో పాకిస్థాన్ చెబుతోంది. కానీ వాస్తవికత ఏమిటంటే ఈ ఉద్యమం మూలాలు స్థానిక బాధలు,  అణచివేతలో ఉన్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
US Iran War: ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget