అన్వేషించండి

BLA Operation Herof: బలూచ్ ఆర్మీ ఆపరేషన్ హీరోఫ్ - పాక్ ఆర్మీకి డెత్ వారెంట్ - ఊచకోత కోస్తున్న వేర్పాటువాదులు

Pakistan: పాకిస్తాన్ ఆర్మీ అన్ని చోట్ల దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. భారత్ ఆపరేషన్ సిందూర్ తో గట్టి దెబ్బ కొడితే.. బలూచ్ వేర్పాటువాదులు ఊచకోత కోస్తున్నారు.

BLA operation herof turns deadly For Pakistan Army: కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని ఎగదోసి తమ ఇంటికి నిప్పు పెట్టుకున్న రీతిలో వ్యవహరించిన పాకిస్తాన్ ఆర్మీకి.. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బ్లడ్ బాత్ అంటే ఏంటో చూపిస్తోంది. వరుసగా కనిపించిన పాకిస్తాన్ ఆర్మీని చంపేస్తున్నారు. దానికి వారు ఆపరేషన్ హెరోఫ్ అనే పెరు పెట్టుకున్నారు.  

పాకిస్తాన్ ఆర్మీపై ఆపరేషన్ హీరోఫ్ అమలు చేస్తున్న బలూచ్ ఆర్మీ

 ఆపరేషన్ హీరోఫ్ పేరుతో  బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్తాన్ ఆర్మీపై విరుచుకుపడుతోంది. బలూచ్ స్వాతంత్ర్యం కోసం  పాకిస్తాన్ సైన్యం   "ఆక్రమణ"ను ఎదిరించడం  కోసం..   బలూచ్ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం కోసం తాము ఈ ఆపరేషన్ హీరోఫ్ ప్రారంభించామని బీఎల్ఏ ప్రకటించుకుంది.  "హీరోఫ్" అంటే బలూచీ,  బ్రాహుయి భాషలలో "డార్క్ స్టార్మ్" అని అర్థం.  ఈ ఆపరేషన్ ను  బలూచ్ స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక మైలురాయిగా చెప్పుకుంటున్నారు. 

బలూచ్ పై పట్టు సాధించిన బీఎల్ఎ -  130 మంది పాక్ సైనికుల హతం 

ఆపరేషన్ హెరోఫ్‌ను  2024 ఆగస్టు 25 నుంచి ప్రారంభించారు.   ఇప్పటి వరకూ బలూచ్ ప్రాంతంలోని 51 ప్రాంతాల్లో 71 దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 130 మంది పాక్ సైనికులు చనిపోయారు.  లాస్బెలా జిల్లాలోని పాకిస్తాన్ సైన్యం   ప్రధాన స్థావరంపై మజీద్ బ్రిగేడ్  పై   ఏడుగురు ఆత్మాహుతి దళ సభ్యులు  దాడి చేశారు. వారు 20 గంటల పాటు స్థావరంలో గణనీయమైన బలూచ్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు.   పాకిస్తాన్ సైనిక సిబ్బందిని హతమార్చారు,  డజన్ల మందిని గాయపరిచారు. ఈ దాడుల్లో ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా లెక్కలేనన్ని చోట్ల దాడులు చేశారు.        

బలూచ్ మొత్తం  రహదారులపై చెక్ పోస్టులు 

పాకిస్తాన్ సైన్యం, ఫ్రాంటియర్ కార్ప్స్  ,   ఇతర భద్రతా బలగాలపై లక్ష్యంగా దాడులు చేయడం, వారి సామర్థ్యాన్ని బలహీనపరచేలా బీఎల్ఏ పని చేస్తుంది.  బలూచిస్థాన్‌ను పాకిస్తాన్ "ఆక్రమణ" నుండి విముక్తి చేసి స్వతంత్ర బలూచ్ రాష్ట్రాన్ని స్థాపించడం లక్ష్యంగా పెట్టుకుంది.  బలూచ్ ప్రజలను సాయుధ పోరాటంలో చేర్చుకుంటోంది.  ఆపరేషన్ హీరోఫ్ బలూచిస్థాన్   వివిధ జిల్లాలలో బలంగా ఆర్మీపై దాడులు చేస్తోంది. ఈ బీఎల్ఎల్ బహుముఖంగా విస్తరించింది. ఆత్మాహుతి దాడులు, రహదారి అడ్డగింతలు,  సైనిక స్థావరాలపై దాడులతో ఆపరేషన్ హెరోఫ్ ను ఉద్ధృతంగా కొనసాగిస్తోంది.            

బలూచ్ ప్రజలందరిదీ ఒకటే మాట - ప్రత్యేక బలూచ్ వాదన

 బలూచిస్థాన్  సహజ వనరులతో నిండిన ప్రాంతం. దశాబ్దాలుగా స్వాతంత్ర్య ఉద్యమాలకు కేంద్రంగా ఉంది. బలూచ్ స్వాతంత్ర్యవాదులు పాకిస్తాన్ , ఇరాన్‌లు తమ భూమిని "ఆక్రమించాయి" అని ఆరోపిస్తారు.  మానవ హక్కుల ఉల్లంఘనలు, ఆర్థిక,   అభివృద్ధి లేకపోవడం వంటి సమస్యలను అక్కడి ప్రజలు ఎత్తి చూపుతారు. తమకు ప్రత్యేక దేశం కావాలని   బలూచ్ జాతీయవాద సాయుధ సంస్థ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఏర్పాటు చేసుకున్నారు.  2006న బలూచ్ తెగ నాయకుడు ,  మాజీ గవర్నర్ నవాబ్ అక్బర్ షాబాజ్ ఖాన్ బుగ్టీ హత్య చేసారు. ఆ రోజున ఈ సంస్థను ప్రారంభించారు.  ఆగస్టు 26ని బలూచ్ జాతీయవాదులకు ఒక కీలకమైన రోజు.     

పెద్ద ఎత్తున బలూచ్ ఆర్మీలో చేరుతున్న బలూచ్ ప్రజలు 
 
ఆపరేషన్ హీరోఫ్ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ  సైనిక సామర్థ్యం ,వ్యూహాత్మక సమన్వయాన్ని ప్రదర్శించిన ఒక మైలురాయి ఆపరేషన్.  పాకిస్తాన్ భద్రతా బలగాలకు గణనీయమైన నష్టాన్ని కలిగించింది.  ఈ ఆపరేషన్ బలూచ్ జాతీయవాదాన్ని బలోపేతం చేసింది, మహిళలు, మాజీ సైనికులు పెద్ద ఎత్తున బీఎల్ఏలో చేరారు. వీళ్ల నుంచి తమను కాపాడుకోవడం ఆర్మీకి కష్టంగా మారింది. అందుకే బలూచ్ ప్రాంతం వైపు ఆర్మీ కన్నెత్తి చూడలేకపోతోంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Donald Trump Assassination Attempt:టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!
టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget