అన్వేషించండి

East Godavari News: చెల్లెలు కోడి కూర వండలేదని మద్యం మత్తులో ఓ అన్న ఘాతుకం, అసలేం జరిగిందంటే !

Chicken Curry: రక్తం పంచుకు పుట్టినవారే కిరాతకులుగా మారిపోయి దారుణాలకు పాల్పడుతున్నారు. కన్న తండ్రి తరువాత కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అన్న సొంత చెల్లిలినే హతమార్చాడు.

East Godavari News: మద్యం మత్తు.. క్షణికావేశాలు బంధాలను, ఆప్యాయతలను దూరం చేస్తోంది. రక్తం పంచుకు పుట్టినవారే కిరాతకులుగా మారిపోయి దారుణాలకు పాల్పడుతున్నారు. కన్న తండ్రి తరువాత కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అన్న సొంత చెల్లిలినే హతమార్చాడు (Man Kills His Sister for Not Cooking Chicken). కోడి కూర వండలేదన్న కారణంతో సొంత అన్న ఈ దారుణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. తూర్పు గోదావరి జిల్లాలో ఈ ఘటన జరిగింది.

స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం అయిన కూనవరం మండలంలో  కన్నాపురంలో  కొవ్వాసి సందా స్థానికంగా కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటాడు. ఇతనికి సోమమ్మ(22) అనే సోదరి ఉంది. ఈమెను చాలా కాలం క్రితం సమీప బంధులకు దత్తత ఇచ్చారు. సోమమ్మ వారం రోజుల క్రితం సొంత  అన్న అయిన నందా ఇంటికి వచ్చింది. ఈక్రమంలోనే నందా మధ్యాహ్నం బయటకు వెళ్తూ రాత్రి భోజనానికి కోడి కూర వండాలని సోదరితో చెప్పి వెళ్లిపోయాడు. తిరిగి అర్ధరాత్రి బాగా మద్యం సేవించి ఇంటికి వచ్చిన నందా కోడికూరతో తనకు అన్నం పెట్టాలని కోరాడు. 

కోడికూర వండని సోదరి..
సోమమ్మ కూడికూర వండలేదని సోదరుడు సందాకు చెప్పింది. ఈ పూట వేరే కూర వండానని, రేపు కోడి కూర చేస్తానని చెప్పింది. నేను అడిగితే కోడి కూర చేయలేదు అంటూ ఆమెతో గొడవపడి ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయాడు సందా. తెల్లవారు జామున ఇంటికి వచ్చిన నందా ఉద్దేశం ప్రకారమే చెల్లిలితో గొడవపడ్డాడు. తన మాటంటే లెక్కలేదని, చెప్పినా కోడి కూర వండ లేదంటూ అక్కడే ఉన్న గొడ్డలి తీసుకుని ఆమెపై విచక్షణారహితంగా దాడిచేశాడు. సోదరుడు సందా చేసిన గొడ్డలి దాడిలో సోమమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. 

స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.  నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎటపాక సీఐ గజేంద్రకుమార్ తెలిపారు. కేవలం కోడి కూర వండలేదని సోదరిని హత్య చేశాడా, ఆస్తి తగాదాలు, వ్యక్తిగత తగాదాల కారణంగా హత్య చేశాడా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

Also Read: Vijayawada: సోఫాలో నిద్రపోతున్న అన్న, కూరగాయల కత్తితో కడుపులో పొడిచిన తమ్ముడు - కారణం ఏంటంటే

Also Read: Murder Sketch Politics : తెలంగాణ పోలీసులపై ఢిల్లీలో కేసులు - "మర్డర్ స్కెచ్" కేసులో కీలక మలుపు !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: కేసీఆర్ ఫ్యామిలీ కూడా బాధితులే, ఆ బాధలు మాకంటే ఎవరికి బాగా తెలుసు: కేటీఆర్
కేసీఆర్ ఫ్యామిలీ కూడా బాధితులే, నిర్వాసితుల బాధలు మాకంటే ఎవరికి బాగా తెలుసు: కేటీఆర్
HYDRA: రూల్స్ తెలుసా రంగనాథ్‌. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇంటికెళ్తారు -  హైడ్రా చీఫ్‌పై హైకోర్టు ఆగ్రహం
రూల్స్ తెలుసా రంగనాథ్‌. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇంటికెళ్తారు - హైడ్రా చీఫ్‌పై హైకోర్టు ఆగ్రహం
Tamilnadu Politics :  విజయ్ వర్సెస్ ఉదయనిధి - తమిళనాడు రాజకీయం మారిపోతోందా ?
విజయ్ వర్సెస్ ఉదయనిధి - తమిళనాడు రాజకీయం మారిపోతోందా ?
New DSC In Telangana: కొత్త డీఎస్సీపై గుడ్ న్యూస్! వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు- రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
కొత్త డీఎస్సీపై గుడ్ న్యూస్! వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు- రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్తిరుమలలో మరోసారి చిరుత కలకలం, సీసీటీవీ ఫుటేజ్‌తో సంచలనంతమిళనాడు డిప్యుటీ సీఎంగా ఉదయ నిధి స్టాలిన్, ప్రకటించిన డీఎమ్‌కేకేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: కేసీఆర్ ఫ్యామిలీ కూడా బాధితులే, ఆ బాధలు మాకంటే ఎవరికి బాగా తెలుసు: కేటీఆర్
కేసీఆర్ ఫ్యామిలీ కూడా బాధితులే, నిర్వాసితుల బాధలు మాకంటే ఎవరికి బాగా తెలుసు: కేటీఆర్
HYDRA: రూల్స్ తెలుసా రంగనాథ్‌. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇంటికెళ్తారు -  హైడ్రా చీఫ్‌పై హైకోర్టు ఆగ్రహం
రూల్స్ తెలుసా రంగనాథ్‌. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇంటికెళ్తారు - హైడ్రా చీఫ్‌పై హైకోర్టు ఆగ్రహం
Tamilnadu Politics :  విజయ్ వర్సెస్ ఉదయనిధి - తమిళనాడు రాజకీయం మారిపోతోందా ?
విజయ్ వర్సెస్ ఉదయనిధి - తమిళనాడు రాజకీయం మారిపోతోందా ?
New DSC In Telangana: కొత్త డీఎస్సీపై గుడ్ న్యూస్! వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు- రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
కొత్త డీఎస్సీపై గుడ్ న్యూస్! వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు- రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Virus Attack: ఏపీలో మళ్లీ హ్యాండ్ ఫుట్ మౌత్ వ్యాధి కలకలం- విజయవాడ, గుంటూరు, విశాఖలో కేసులు
ఏపీలో మళ్లీ హ్యాండ్ ఫుట్ మౌత్ వ్యాధి కలకలం- విజయవాడ, గుంటూరు, విశాఖలో కేసులు
Mithun Chakraborty: బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి ప్రతిష్టాత్మక 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డు... అఫిషియల్‌గా అనౌన్స్ చేసిన కేంద్ర ప్రభుత్వం
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి ప్రతిష్టాత్మక 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డు... అఫిషియల్‌గా అనౌన్స్ చేసిన కేంద్ర ప్రభుత్వం
Tesla Workers : సిక్ ‌లీవులు పెడితే ఇంటికి మేనేజర్లు - టెస్లా ఉద్యోగులను రాచి రంపాన పెడుతున్న ఎలన్ మస్క్
సిక్ ‌లీవులు పెడితే ఇంటికి మేనేజర్లు - టెస్లా ఉద్యోగులను రాచి రంపాన పెడుతున్న ఎలన్ మస్క్
Mohammed Siraj Catch: కళ్లు చెదిరిపోయాయ్ వర్మ, సిరాజ్ మియా! అదరగొట్టావయ్యా
కళ్లు చెదిరిపోయాయ్ వర్మ, సిరాజ్ మియా! అదరగొట్టావయ్యా
Embed widget