Crime News: దృశ్యం తరహాలో అదృశ్యం స్టోరీ - లవర్‌ను చంపేసి ఈ ప్రేమికుడు ఆడిన నాటకం గురించి తెలిస్తే మైండ్ బ్లాంకే
Gujarat: గుజరాత్ లో ఓ యువతి కనిపించకుండా పోయింది. లవర్ మీద అనుమానపడ్డారు. కానీ ఆ లవర్ దృశ్యం సినిమా చూశాడని ఆలస్యంగా గుర్తించారు.

Drishyam style murder: దృశ్యం సినిమా చూసిన వారందరికీ.. తమ కుమార్తెను వేధించిన యువకుడ్ని చంపడమే కాదు.. తప్పుడు సాక్ష్యాల సృష్టించి పోలీసుల్ని గందరగోళ పరచడం అందరికీ గుర్తు ఉంటుంది.అయితే నిజ జీవితంలో అలాంటివి చేయడం అంత సులువు కాదు. కానీ గుజరాత్ కు చెందిన ఓ వ్యక్తి చేసి చూపించాడు. గుజరాత్ పోలీసుల్ని ఏడాది పాటు ముప్పు తిప్పలు పెట్టాడు. చివరికి అతనే హత్య చేశాడని తేల్చారు.
ప్రేమికుడి కోసం వెళ్లి కనిపించకుండా పోయిన యువతి
గుజరాత్ లోని విశావదర్‌లోని రూపవతి గ్రామానికి చెందిన దయా అనే యువతి జనవరి 2, 2024న ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు తీసుకుని వెళ్లిపోయింది. అప్పటికే ఆమెకు పెళ్లి అయింది. భర్త దగ్గరే ఉంటుంది. కానీ లవర్ తో జీవించాలనుకుని వెళ్లిపోయింది. అప్పటి నుంచి కనిపించడం లేదు. ఆమె భర్త ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దయా లవర్ గా హార్దిక్ అనే యువకుడ్ని గుర్తించారు. అయితే హార్దిక్ మాత్రం.. తాను మాజీ లవర్ ను అని ఆమె ఇంకొకర్ని ప్రేమించి వారితో వెళ్లిపోయిందని ఆధారాలు చూపించాడు.
నకిలీ ఆధారాలు సృష్టించి ఆమె వేరే వ్యక్తితో వెళ్లిపోయిందని నమ్మించిన హంతకుడు
ఆ ఆధారాలు చూసిన పోలీసులు కన్ ఫ్యూజ్ అయ్యారు. అసలు ఆ లవర్ ఎవరో కనిపెట్టాడనికి చాలా ప్రయత్నాలు చేశారు. హార్దిక్ ఇచ్చిన సాక్ష్యాలలో వాయిస్ రికార్డులు, కాల్ రికార్డులు వంటివి ఉన్నాయి. అయితే ఎంత వెదికినా ఆ లవర్ ఎవరో తెలియలేదు. దయా ఎక్కడ ఉందో కూడా ఆచూకీ తెలియలేదు. దీంతో పోలీసులు హార్దిక్ ఇచ్చిన సాక్ష్యాల్లో నిజమెంత అని పరిశీలించడం ప్రారంభించారు. చివరికి తేలిందేమిటంటే..ఆ సాక్ష్యాలన్నీ ప్లాన్ ప్రకారం హార్జికే సృష్టించాడు. కాల్ రికార్డుల్లో ఉన్నది కూడా అతని వాయిసేనని టెక్నికల్ గా తేల్చడంతో పోలీసులు హార్దిక్ ను అరెస్టు్ చేసితమదైన శైలిలో ప్రశ్నించారు. దాంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చివరికి అసలు నిజం కనిపెట్టిన పోలీసులు
జనవరి 3, 2024న అమ్రేలి జిల్లాలోని హడాలా గ్రామం సమీపంలో దయాను చంపినట్లు హార్దిక్ అంగీకరించాడు. దయాను చంపేసి ఓ బావిలో పడేశాడు. ఎవరికీ తెలియకుండా వెళ్లిపోయాడు. తర్వాత ఆమె వేరే వారితో వెళ్లిపోయిందని ఆధారాలు సృష్టించాడు. పోలీసులను మిస్ లీడ్ చేశాడు. దయా పెళ్లి చేసుకోవడంతో ఆమెను తన జీవితంలోకి ఆహ్వానించడానికి హార్జిక్ సిద్దంగా లేడు . కానీ వివాహేతర బంధం పెట్టుకున్నందున తనతో జీవితం పంచుకోవాల్సిందేనని దయా ఒత్తిడి చేయడంతో చంపేశానని హార్దిక్ పోలీసులకు చెప్పాడు. హార్దిక్ పోలీసుల్ని మాయ చేయడానికి ఉచిత కాలింగ్ యాప్‌లు , నకిలీ హోటల్ బస బిల్లులు సృష్టించాడు.
Also Read: భర్త హత్యకు సుపారీ, భార్య ప్రియుడి దాడిలో గాయపడిన డాక్టర్ మృతి - వరంగల్‌లో విషాదం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

