News
News
X

Konaseema News : దైవసేవకుడిగా వచ్చి ప్రేమపాఠాలు, చర్చి ఫాదర్ పై మహిళలు ఫిర్యాదు!

Konaseema News : దైవ సేవకుడిగా వచ్చిన ఓ ఫాదర్ ప్రేమ పాఠాలు మొదలుపెట్టాడు. దీంతో ఆ చర్చికి వచ్చే మహిళలు పోలీసులను ఆశ్రయించడంతో అతడి భాగోతం బయటపడింది.

FOLLOW US: 

Konaseema News : దైవ సేవకుడునని నమ్మించి ప్రేమ పాఠాలు చెబుతున్నాడో చర్చి ఫాదర్. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ముమ్మిడివరం నియోజకవర్గంలోని ఓ చర్చి ఫాదర్ పై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దైవసందేశం వినడానికి వస్తుంటే ప్రేమ సందేశాలు చెపుతున్నాడంటూ చర్చి ఎదుట ఆందోళనకు దిగారు కొందరు మహిళలు. ముమ్మిడివరంలో ఉన్న రోమన్ కాథలిక్ చర్చిలో గత కొన్నేళ్లుగా ఆదివారం క్రైస్తవ గీతాలాపనలు, ఆరాధనలు, స్తుతి, స్వస్థత కార్యక్రమాలలో స్థానిక మహిళలు పాల్గొంటారు. ఆరునెలల క్రితం ఈ చర్చికి డి.జల్తాజర్ రాజు అనే వ్యక్తి ఫాదర్ గా వచ్చాడు. ఆయన వచ్చినప్పటి నుంచి దైవ వాక్యాలు కాకుండా చర్చికి వచ్చే మహిళలను లోబరుచుకునే విధంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి.  

పిల్లలతో అసభ్య ప్రవర్తన 

దేవుడు అభిషేకించిన వ్యక్తి  దైవజనుడు దైవంతో సమానం  అని భావించిన మహిళలు మెుదట్లో పెద్దగా పట్టించుకోలేదు. రానురాను అతని ప్రవర్తన శ్రుతిమించడంతో మహిళలు చర్చికి తాళం వేసి ఫాదర్ జల్తాజర్ రాజుపై ముమ్మిడివరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చర్చికి వచ్చే తమ పిల్లలపై ఇతని ప్రభావం పడుతుందని, తాము లేని సమయంలో పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించే అవకాశం ఉందని ఇతనిని ఈ చర్చినుండి తొలగించడమే కాకుండా మరే చర్చిలోనూ ఉండకుండా చర్యలు తీసుకోవాలని మహిళా భక్తులు అంటున్నారు. 

లైంగికదాడి చేసిన సమీప బంధువు

రోజూ ఏదో ఒక చోట మహిళలు వేధింపులకు గురి అవుతూనే ఉన్నారు.  ఇలాంటి ఘటనే నల్లగొండ జిల్లా వేములపల్లి మండల పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వివాహితపై ఓ కామాంధుడు తన లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. ఆమెను తీవ్రంగా కొట్టి తర్వాత అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వేములపల్లి మండల కేంద్రంలోని ఎన్ఎస్పీ కాలనీకి చెందిన ఓ వివాహిత ఈ నెల 13న మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ సమయంలోనే సమీప బంధువు గుండె బోయి సైదులు.. కూర కావాలని అడుగుతూ ఆమె ఇంట్లోకి వెళ్లాడు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని చూసి అదే అదనుగా భావించాడు. కామంతో ఆ వివాహిత చేయి పట్టుకోబోయాడు. సమీప బంధువే చేయి పట్టుకుని అలా చేయడంతో ఆమె అతడి చర్యలకు ప్రతిఘటించింది. దీంతో కోపోద్రిక్తుడైన గుండె బోయిన సైదులు ఆమె కడుపులో బలంగా తన్నాడు. వివాహిత కింద పడగానే ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.  

బాధితురాలు కడుపు నొప్పితో బాధ పడుతూ కేకలు వేయగా.. పక్కింట్లోని మట్టమ్మ బాధితురాలి వద్దకు వెళ్లింది. రక్త స్రావంతో బాధపడుతున్న బాధితురాలిని చూసి ఆమె భర్తకు సమాచారం ఇచ్చింది. అనంతరం బాధితురాలు అయిన వివాహితను ఆటోలో మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో బాధిత మహిల ఆస్పత్రిలో నాలుగు రోజుల నుంచి చికిత్స పొందతూనే ఉంది. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి ఇంకా స్థిమిత పడలేదు. సాధారణ స్థితికి చేరుకోలేదు. శుక్రవారం బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలు ఇచ్చిన కంప్లైంట్ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read : కీసరలో దారుణం- ఇంటి పని చేసుకుంటున్న మహిళ మెడ నుంచి బంగారం చోరీ

Published at : 18 Sep 2022 05:32 PM (IST) Tags: AP News Crime News Konaseema news Church father misbehaviour with woman

సంబంధిత కథనాలు

Fire Accident : భద్రాచలం కిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం, షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు

Fire Accident : భద్రాచలం కిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం, షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు

Nizamabad News : కోతులు వెంటబడడంతో చెరువులో దూకిన నలుగురు చిన్నారులు, ఇద్దరు మృతి!

Nizamabad News : కోతులు వెంటబడడంతో చెరువులో దూకిన నలుగురు చిన్నారులు, ఇద్దరు మృతి!

Crime News : రియల్ ఆవేశం స్టార్ - పోలీసులు ఆపారని బైక్ కాల్చేసుకున్నాడు.. కేసుల పాలయ్యాడు !

Crime News : రియల్ ఆవేశం స్టార్ - పోలీసులు ఆపారని బైక్ కాల్చేసుకున్నాడు.. కేసుల పాలయ్యాడు !

Nizamabad News : మూడు నెలలైనా దొరకని బ్యాంకు దొంగల జాడ, 8 కేజీల బంగారం తిరిగివ్వాలని బాధితులు ధర్నా

Nizamabad News : మూడు నెలలైనా దొరకని బ్యాంకు దొంగల జాడ, 8 కేజీల బంగారం తిరిగివ్వాలని బాధితులు ధర్నా

Chandrababu Tweet : స్కూల్ పిల్లల వరకూ గంజాయి వచ్చేసింది, ఇది క్షమించరాని నేరం- చంద్రబాబు

Chandrababu Tweet : స్కూల్ పిల్లల వరకూ గంజాయి వచ్చేసింది, ఇది క్షమించరాని నేరం- చంద్రబాబు

టాప్ స్టోరీస్

Dharmana : రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

Dharmana :  రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం  - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

Jasprit Bumrah Ruled Out: భయాలే నిజం అయ్యాయ్ - టీ20 వరల్డ్‌కప్ నుంచి బుమ్రా అవుట్!

Jasprit Bumrah Ruled Out: భయాలే నిజం అయ్యాయ్ - టీ20 వరల్డ్‌కప్ నుంచి బుమ్రా అవుట్!

Allu Arjun: నేనెందుకూ పనికి రానని ఆయన ఫీలింగ్ - బన్నీ కామెంట్స్ వైరల్!

Allu Arjun: నేనెందుకూ పనికి రానని ఆయన ఫీలింగ్ - బన్నీ కామెంట్స్ వైరల్!

రూ.12 వేలలోపే నోకియా ట్యాబ్ - భారీ డిస్‌ప్లేతో!

రూ.12 వేలలోపే నోకియా ట్యాబ్ - భారీ డిస్‌ప్లేతో!